ప్రెగ్నెన్సీ సమయంలో అలాంటి ఆలోచనలు పెట్టుకుంటే... బిడ్డలపై ఆ ప్రభావం...

తల్లి డిప్రెషన్‌కి గురైతే పుట్టే పిల్లలపై ఆ ప్రభావం.. ఆత్మస్థైర్యం పెంచుతూ, ఒత్తిడిని దూరం చేయాల్సిన బాధ్యత కుటుంబసభ్యులదే...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 20, 2019, 11:28 PM IST
ప్రెగ్నెన్సీ సమయంలో అలాంటి ఆలోచనలు పెట్టుకుంటే... బిడ్డలపై ఆ ప్రభావం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీ పాపకి నిద్ర సరిగ్గా పట్టడం లేదా... మీ బాబు నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడా... కడుపునిండా పాలు తాపినా పడుకోడానికి కష్టపడుతున్నారా... అయితే ఆ తప్పు వారిది కాదు... మీదే! అవును... బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి డిప్రెషన్‌కి గురైతే ఆ ప్రభావం పుట్టిన పిల్లలపై పడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. గర్భవతి అయిన తర్వాత మూడు నుంచి ఏడు మాసాల కాలం చాలా విలువైనది. ఈ సమయంలో తల్లి మానసిక స్థితి, ఆనందం, ఆమె ఆలోచనలూ పిల్లలపై ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో తల్లి ఎంత ఆనందంగా ఉందనే విషయం, బిడ్డ నిద్రపోయే సమయాన్ని నిర్ణయిస్తుందట. ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా ఆనందంగా తల్లి కాబోతున్న విషయాన్ని ఎంజాయ్ చేసే తల్లులకు పుట్టిన పిల్లలు... మిగిలిన వారితో పోలిస్తే సుఖంగా నిద్రపోతున్నారట.

Depression, Pregnancy tips, thoughts in pregnancy, Child sleep, sleep less child, kids sleep, precautions to take during pregnancy, ప్రెగ్నెన్సీ సమయంలో జాగ్రత్తలు, గర్భం దాల్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భవతి ఆలోచనలు, కడుపులో ఉన్నప్పుడు జాగ్రత్తలు, గర్భవతుల ఆలోచనలు, గర్భవతి ఆలోచనలు పిల్లలపై ప్రభావం, ప్రెగ్నెన్సీ సమయంలో చిట్కాలు, పసిపిల్లల్లో నిద్రలేమీ, నిద్రపోకుండా ఏడుస్తున్న చిన్నారులు, చిన్నారుల నిద్ర
పిల్లలు నిద్రపోకుండా ఏడుస్తున్నారంటే అందుకు కారణం తల్లులే...

అలాకాకుండా అనేక ఆలోచనలతో సతమతమవుతూ మానసికంగా క్రుంగిపోయి డిప్రెషన్లో కూరుకుపోయే వారి పిల్లలు నిద్రలేమితో బాధపడుతున్నారు. అయితే తల్లి కాబోతున్నప్పుడు మహిళల్లో అనేక రకాల ఆలోచనలూ, భయాలు మొదలవుతాయి. వీటి నుంచి బయటపడి మాతృత్వాన్ని ఎంజాయ్ చేసేలా చేయాల్సిన బాధ్యత వారి భర్తలు, కుటుంబ సభ్యులపైనే ఉంటుంది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఆత్మస్థైర్యం పెంచుతూ, ఒత్తిడిని దూరం చేయాల్సి ఉంటుంది. అలాకాకుండా గర్భవతి అని చూడకుండా, ఆమెని తిట్టినా అవమానించినా, చులకన చేసి మాట్లాడిన ఆ ప్రభావం బిడ్డ మానసిక పరిస్థితిపై పడుతుందని ఈ అధ్యయనంలో నిరూపితమైంది.

Depression, Pregnancy tips, thoughts in pregnancy, Child sleep, sleep less child, kids sleep, precautions to take during pregnancy, ప్రెగ్నెన్సీ సమయంలో జాగ్రత్తలు, గర్భం దాల్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భవతి ఆలోచనలు, కడుపులో ఉన్నప్పుడు జాగ్రత్తలు, గర్భవతుల ఆలోచనలు, గర్భవతి ఆలోచనలు పిల్లలపై ప్రభావం, ప్రెగ్నెన్సీ సమయంలో చిట్కాలు, పసిపిల్లల్లో నిద్రలేమీ, నిద్రపోకుండా ఏడుస్తున్న చిన్నారులు, చిన్నారుల నిద్ర
గర్భవతులకు మంచి ఆరోగ్యంతో పాటు నిద్ర కూడా ఎంతో అవసరం

అంతేకాకుండా గర్భవతిగా ఉన్నప్పుడు ఆరోగ్యం మీద కూడా చాలా శ్రద్ధ చూపించాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు. లేకపోతే పుట్టబోయే పిల్లలపై ఆ ప్రభావం చాలారోజుల పాటు ఉంటుంది. అమెరికాలో 833 మంది పిల్లలపై చేసిన సర్వేలో ఈ విషయాలు తేలాయి. వీరంతా ఆరేళ్లలోపు పిల్లలే... పిల్లల నిద్రపోయే సమయం, వీరు తల్లులు గర్భవతిగా ఉన్నప్పడు మానసిక స్థితి ఆధారంగా ఓ డేటా తయారుచేశారు. ఇందులో తల్లికి మానసిక స్థితి, బిడ్డ ఆరోగ్యంపై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో స్పష్టంగా నిర్ధారణ అయ్యింది. బిడ్డలో నిద్రలేమి కారణం తల్లి మానసిక ప్రవర్తనేనట.
First published: March 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading