news18
Updated: January 13, 2021, 8:10 PM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
January 13, 2021, 8:10 PM IST
ఉన్నట్టుండి మీ వైఫై పనిచేయకపోతే? మీ పాస్ వర్డ్ వర్కవుట్ కాకపోతే? మీ ల్యాప్ టాప్ క్రాష్ అయితే? ఇలాంటివి టెక్ ఫ్రస్ట్రేషన్ కు దారితీస్తాయి. మీరు వర్క్ ఫ్రం హోంలో ఉండి ఆఫీసు పని చేస్తున్నప్పుడు ఇలాంటివి అనుకోకుండా జరిగినప్పుడు మీరు అరిచి, కరిచేసే విధానాలకు అలవాటు పడిపోవటం అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న టెక్ స్ట్రెస్ కారణంగా అన్ని వయసుల వారిలో కోపం తారాస్థాయికి చేరుతోంది. పిల్లలు ఆన్ లైన్ క్లాస్ లో ఉన్నప్పుడు ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లెమ్స్ వస్తే వారుకూడా చిత్ర విచిత్రంగా ప్రవర్తించటం మీరు చూసే ఉంటారు. టెక్నాలజీపై అతిగా ఆధారపడితే ఎదురయ్యే పర్యవసానాలను మనం కరోనా సమయంలో చవిచూస్తున్నాం. అదే ఆఫీసులో ఇలాంటి టెక్నికల్ చిక్కులు వస్తే మనకు సాయం అందించేందుకు ఐటీ సపోర్ట్ టీం ఉంటుంది. కానీ ఇంట్లో అదంతా సాధ్యం కాదుకదా. మీరు మీ భావోద్వేగాలపై పట్టుకోల్పోయేలా, అసహనంగా ప్రవర్తించేలా చేసే టెక్ ఫ్రస్ట్రేషన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టే మార్గాలను అన్వేషించాల్సిందే.
అలెక్సా తప్పులు చెబితే..మీరు అలెక్సాను (Alexa) ఏవైనా ప్రశ్నలు అడిగారనుకుందాం..అది తప్పు జవాబు చెబితే.. అలెక్సాపై తిట్ల దండకం అందుకుంటాం ఇది సరైన ప్రవర్తన కాదనే విషయాన్ని మనం కాసేపు మరచిపోతాం. బ్యాడ్ టెక్నాలజీతో కూడా కొన్ని సమస్యలు వస్తాయి అంతమాత్రాన సంయమనం కోల్పోరాదని టెక్ ఎక్స్ పర్ట్స్ కూడా హెచ్చరిస్తున్నారు. దీంతో బీపీ, మెంటల్ స్ట్రెస్ వంటి వాటి స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. కంప్యూటర్ పై మీకెంత పట్టున్నా ఇలాంటి సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి. కరోనా (Corona) కారణంగా మనం గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో టెక్నాలజీపై అతిగా ఆధారపడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఏం కొనాలన్నా, తినాలన్నా, చూడాలన్నా, నేర్చుకోవాలనుకున్నా మనకు ఇప్పుడు ఈ క్యంప్యూటర్ అనే వర్చువల్ వరల్డ్ తోనే ఈజీగా సాధ్యమవుతోంది.
బ్యాడ్ టెక్ ఎక్స్ పీరియన్స్..
కంప్యూటర్ జెయింట్ డెల్ టెక్నాలజీస్ (Dell Technologies) ఇదే విషయంపై జరిపిన అధ్యయనంలో ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాడ్ టెక్ ఎక్స్ పీరియన్స్ లతో మనం సహనాన్ని కోల్పోతున్నట్టు న్యూరో సైన్స్ ద్వారా గుర్తించింది డెల్ సంస్థ. ఈ స్ట్రెస్ నుంచి బయటపడేందుకు చాలా సమయం కూడా పడుతున్నట్టు వీరు గుర్తించారు. ఉద్యోగుల మానసిక ఆరోగ్యం ఇలాంటి వాటిపై ఆధారపడి ఉండటంతో జనరేషన్ Zలో 30శాతం ప్రాడక్టివిటీ పడిపోతున్నట్టు తేలింది. టెక్నికల్ వైఫల్యాలు జరిగినప్పుడు చాలా షార్ప్ గా రియాక్ట్ అయ్యేవారిలో యువకులే ఎక్కువ కావటం మరో విశేషం. వీరిలో ఉన్నట్టుండి స్ట్రెస్ లెవెల్ విపరీతంగా పెరుగుతాయి.
రిమోట్ వర్క్ (remote work) అంటే ఇంతే..
రిమోట్ వర్క్ఎన్విరాన్మెంట్ లో ఐటీ సపోర్ట్ లేక, ట్రబుల్ షూట్ చేసేందుకు సాయం లేక వ్యక్తులు బాగా నీరసపడిపోతున్నారని డెల్ అంచనా వేస్తోంది. వర్క్ ఫ్రం హోం (work from home) అప్ గ్రేడ్స్ తో ఇలాంటి సమస్యలను సంస్థలు అధిగమించితే ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. దీంతో ఎక్కువ ఉత్పాదకతను కంపెనీలు చూడవచ్చు. అందుకే అన్నీ మన అదుపులో ఉండవనే సూత్రాన్ని వంటబట్టించుకోవాలని వైద్యులు, మానసిక నిపుణులు, టెక్ ఎక్స్ పర్ట్స్ మనకు సూచిస్తున్నారు. మీ ఇంట్లోని ఎలక్ట్రానిక్ డివైజులు, గ్యాడ్జెట్లు సరిగా పనిచేయకపోతే వాటిపై అరిచి, మీ సహనాన్ని కోల్పోయి, అతి కోపంతో కొంప ముంచకండి అంటూ నిపుణులు చెబుతున్న మాట గుర్తుంచుకోండి.
Published by:
Srinivas Munigala
First published:
January 13, 2021, 8:10 PM IST