Home /News /life-style /

DENGUE VIRAL FEVER IN CHILDREN SYMPTOMS AND PRECAUTIONS RNK 2

Dengue fever: పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త.. అది కచ్చితంగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డెంగీ వైరస్‌ నుంచి పిల్లలను కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బయటకు,స్కూళ్లకు వెళ్లినా.. సరైన రక్షణా చర్యలు తీసుకోవాలి. దీన్ని ముందస్తుగా నియంత్రించడమే సరైన మార్గం.

దోమ వల్ల కలిగే ఈ డెంగీ (Dengue Fever).. ఎడీస్‌ ఈజిప్టై వల్ల వస్తుంది. దీన్ని టైగర్‌ దోమ (Tiger Mosquito) అని కూడా అంటారు. ముఖ్యంగా ఇది డే బైటర్‌.. ఈ సమయంలో ఇంట్లో కచ్చితంగా ఏదైనా మస్కిటో రెప్పలేంట్‌ పెట్టుకోవాలి. ఇది వైరల్‌ ఫీవర్‌.. (Viral Fever) దీంతో సివియర్‌ బాడీ పెయిన్స్‌ వస్తాయి. దీన్ని బొన్‌ బ్రేక్‌ పెయిన్‌ అని కూడా అంటారు. వాంతులు ఎక్కువ అయినా, ప్లేట్‌లేట్స్‌ కౌంట్‌ (Platelet Count) సడన్‌గా పడిపోయినా.. డెంగీ ప్రమాదస్థాయికి చేరుకుందని నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా జూలై నుంచి డిసెంబర్‌ వరకు ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది.

అందుకే ఈ సమయాల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ మస్కిటో ఫ్రేష్‌ వాటర్‌లోనే బ్రీడ్‌ అవుతుంది. ఇంటి పరిసరాల్లో కొబ్బరి చిప్పలు, పాత టైర్లు ఇతర స్టోరేజీ కంటైనర్లలో వాటర్‌ నిల్వ ఉండకుండా చూడాలి. లేకపోతే మూత పెట్టి ఉంచాలి. పిల్లలకు డెంగీ ఫీవర్‌  (Dengue fever) అనగానే తల్లిదండ్రులు భయాందోళన చెందుతారు. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే దీని బారి నుంచి బయటపడవచ్చు. 70 శాతం మంది డెంగీ పేషంట్లకు సాధారణ చికిత్సలే అందిస్తారు. కానీ, ప్లేట్‌లేట్స్‌ సంఖ్య తగ్గకుండా ఉండాలి. శరీరంలో ఫ్లూయిడ్‌ లెవల్స్‌ కూడా స్ట్రిక్ట్‌గా మెయిన్‌టెన్‌ చేయాలి. కాంప్లికేట్‌ అయితేనే ప్రాణంతకం అవుతుంది.

పిల్లలను డెంగీ నుంచి రక్షించే విధానం..

  • పిల్లలు ఆడుకునేటపుడు లేదా ఇంట్లో ఉన్నా.. మస్కిటో రెప్పలెంట్‌ అప్లై చేసి ఉంచాలి.

  • డే టైంలో కూడా దోమల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

  • దోమల తెర కూడా వాడితే మరింత మంచిది. రెండు నెలలపైబడిన పిల్లలకు మాత్రమే మస్కిటో రెప్పలెంట్‌ అప్లై చేయాలి. చర్మంపై ఏవైనా రాష్, పుండ్లు ఉంటే ఆ ప్రాంతంలో పెట్టకూడదు. ముఖ్యంగా డీట్‌ ఉంటే మస్కిటో రెప్పలెంట్‌ వాడటం మంచిది.


Dengue Fevers: జనాలపై దండెత్తిన దోమ... డెంగ్యూ జోన్ లో వైజాగ్..ఉదయం దీన్ని అప్లై చేస్తే సాయంత్రం వరకు పిల్లలకు ప్రొటెక్షన్‌ ఇస్తుంది. లెమన్, యూకలిప్టస్‌ ఆయిల్‌ నేచురల్‌ రెప్పలెంట్స్‌. సిట్రనల్‌ ఆయిల్‌ బేస్‌ ఉన్న మస్కిటో రెప్పలెంట్స్‌ మార్కెట్లో ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఒడోమస్‌ వంటివి 3 ఏళ్లు పైబడిన పిల్లలకు మాత్రమే వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. కానీ, ఈ నేచురల్‌ ప్రొడాక్ట్స్‌ అన్ని 4–6 గంటలు మాత్రమే ప్రొటెక్షన్‌ ఇస్తాయి.

ప్రమాదకరంగా మారుతున్న డీ2 డెంగ్యూ స్ట్రెయిన్‌.. విజృంభిస్తోన్న జ్వరాలు.. లక్షణాలివే..


ముఖ్యంగా దోమలు మన శరీరం నుంచి విడుదలయ్యే కార్బన్‌ డై ఆక్సైడ్‌ ద్వారా గుర్తిస్తాయి. ఈ మస్కిట్‌ రెప్పలెంట్స్‌ వాసన ఉంటే దోమలు గుర్తించలేవు. ఈ వాసన వాటికి పడవు. కొంతమందికి ఎక్కువ దోమలు కుడతాయి. వారు కచ్ఛితంగా రెప్పలెంట్‌ వాడాలి. డెంగీ నుంచి రక్షణ పొందాలంటే ఇవి కచ్ఛితంగా వాడాలి. పపాయా ఆకులతో ప్లేట్‌లేట్స్‌ కౌంట్‌ను పెంచుకోవచ్చు. దీనికి సంబంధించిన సిరప్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.
Published by:Renuka Godugu
First published:

Tags: Dengue fever

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు