వర్షాకాలం వ్యాధుల కాలం. ముఖ్యంగా ప్రాణంతకంగా మారే డెంగీ వ్యాధి (dengue virus)విజృంభణ కాలం. డెంగీ.. వైరస్ ఫీవర్. ఇది ఎడిస్ ఈజిప్టే అనే దోమ వల్ల వ్యాపిస్తుంది. ఈ దోమ కుట్టిన 5–6 రోజులకు వ్యాపిస్తుంది. దాదాపు 18 ఏళ్ల కిందట మనకు డెంగీ అంటే తెలీదు. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు. ఈ వ్యాధిలో ప్రధానంగా రక్తంలో ప్లేట్లేట్ (platelets)కణాలు తగ్గిపోతాయి. అందుకే చాలామంది భయభ్రాంతులకు గురవుతారు. ఇది కాంప్లికేట్ కాకముందే వైద్యులను సంప్రదించాలి. వ్యాధి లక్షణాలు ఇతర వివరాలు తెలుసుకుందాం.
డెంగీ లక్షణాలు..
ఫీవర్ రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది. వారం రోజులైన తగ్గకుండా ఉంటుంది.
ప్రధానంగా వెన్నుపూస నొప్పి, కండరాల నొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి.
ఒంటి మీద చిన్న చుక్కలు వంటివి రావడం. ఒక్కోసారి యూరిన్లో బ్లడ్ కూడా వస్తుంది.దీన్ని ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవచ్చు. అంటే వ్యాధిని తగ్గించుకోవచ్చు.
ఈ వ్యాధిని శరీరంలో రక్తం పర్సెంటేజీ ఎంత ఉంది? ప్లేట్లేట్స్ కణాల సంఖ్య ఆధారంగా చేసే పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఖరీదైన టెస్ట్ కాదు.
ఒకవేళ ఈ వ్యాధికి గురైనవారు ఆకస్మికంగా పడిపోవడం, కామెర్లలాగా చర్మం మారిపోవడం, ఎక్కువ దగ్గు రావడం వంటివి జరిగితే.. వ్యాధి తీవ్రంగా మారినట్లు.
కణాల సంఖ్యను చూసుకంటే.. ఒకవేళ ఈ ప్లేట్లేట్స్ కణాల సంఖ్య లక్ష కంటే పైగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. చిన్న జాగ్రత్తలు.. డాక్టర్ల సలహాలతో ఇంటి వద్దే వైద్యం చేసుకోవచ్చు.
ఒకవేళ కణాలు కేవలం ఒకరోజు తేడాతోనే సడన్గా పడిపోతే... లేదా ఇతర వ్యాధి లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్ పర్యావేక్షన ముఖ్యం. డెంగీకి ప్రత్యేకంగా మందులు లేవు. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తించాలి. అరికట్టడం, ముందుగానే సరైన వెద్యం తీసుకోవడం ముఖ్యం.
డెంగీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఈ వైరస్ ముఖ్యంగా నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వృద్ధి చెందడంతో వ్యాపిస్తుంది. అందుకే ఎప్పుడూ ఇంటి పరిసరాలను తడి లేకుండా చూసుకోవాలి.
కిచెన్లో కూడా ఇంటి సామగ్రీ శుభ్రం చేసుకున్న తర్వాత వాటిలో నీరు లేకుండా బోర్లించి పెట్టుకోవాలి.
నీటి కంటైనర్లకు మూత పెట్టి ఉంచాలి. తినే ఆహార పదార్థాలకు ఎల్లప్పుడూ మూత పెట్టి.. జాగ్రత్తలు వహించాలి.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.