Sex Toys: ఆ దేశంలో పెరిగిన సెక్స్ టాయ్స్ వాడకం.. అమ్మాయిలే ఎక్కువ.. అదే అసలు కారణం

Sex Toys: కరోనా వైరస్ కారణంగా సోషల్ డిస్టెన్స్‌ పాటిస్తూ జీవిత భాగస్వాములు శృంగారానికి దూరంగా ఉండటం, పబ్లిక్ ఎంటర్‌టైన్మెంట్ ప్లాట్‌ఫామ్లను సుదీర్ఘంగా మూసివేయడంతో ఈ డిమాండ్ పెరిగినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: October 20, 2020, 8:42 PM IST
Sex Toys: ఆ దేశంలో పెరిగిన సెక్స్ టాయ్స్ వాడకం.. అమ్మాయిలే ఎక్కువ.. అదే అసలు కారణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒకపక్క కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచం మొత్తం విలవిల్లాడుతుంటే మరోపక్క చైనాలో సెక్స్ టాయ్స్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద బెడ్రూమ్ ప్రోడక్ట్స్ ఎగుమతిలో ఇప్పటికే ముందంజలో ఉన్న చైనా.. బిలియన్ డాలర్ల మార్కెట్‌ను కలిగి ఉంది. చైనా సెక్స్ టాయ్ ఇండస్ట్రీకి ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా సోషల్ డిస్టెన్స్‌ పాటిస్తూ జీవిత భాగస్వాములు శృంగారానికి దూరంగా ఉండటం, పబ్లిక్ ఎంటర్‌టైన్మెంట్ ప్లాట్‌ఫామ్లను సుదీర్ఘంగా మూసివేయడంతో ఈ డిమాండ్ పెరిగినట్టు తెలుస్తోంది.

అయితే సెక్స్ టాయ్స్ వాడకంలో పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనిపై సెక్స్ అండ్ రిలేషన్స్ అడ్వైజ్ బ్లాగర్ యి హెంగ్ మాట్లాడుతూ " అనేక మంది లైంగికంగా చురుకైన మహిళలు సెక్స్ టాయ్స్‌ను ఉపయోగించడం పట్ల చాలా ఓపెన్ యాటిట్యూడ్తో ఉన్నారు, సెక్స్ టాయ్స్ వాడకాన్ని వారు చాలా సహజంగా మరియు సాధారణమైనదిగా చూస్తున్నారు." అని అన్నారు.

చైనా ప్రభుత్వం సాధారణంగా సెక్స్ పట్ల సాంప్రదాయిక ప్రజా వైఖరితో వ్యవహరిస్తుంది. ఇందులో భాగంగానే అక్కడి ప్రభుత్వం పోర్నోగ్రఫీని నిషేధించింది. అంతేకాక, ఎవరైనా ఆన్లైన్లో "అసభ్యకరమైన" కంటెంట్‌ను షేర్ చేస్తే వారిపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే, సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చే చైనాలో గత ఏడాది రికార్డు స్థాయిలో 3.1 మినియన్ల -విడాకుల కేసులు నమోదయ్యాయి.

ఇది చైనా ప్రజల సామాజిక విలువల్లో వచ్చిన మార్పుకు సంకేతమని యి హెంగ్ అభిప్రాయపడింది. ‘‘తమ భాగస్వాములు వారినిసంతృప్తిపర్చలేకపోవడం, తమను తాము సంతోషపెట్టుకోవాలి అనుకోవడం వంటివి చైనాలో సెక్స్ టాయ్స్ అమ్మకాలు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణాలని చైనా పరిశోధనా సంస్థ ఐఐ మీడియా పేర్కొంది.

అయితే ప్రస్తుతం దేశంలోని సెక్స్ టాయ్స్ మార్కెట్ విలువ 100 బిలియన్ యువాన్లు (14.7 బిలియన్ డాలర్లు)గా ఉందని, గూగుల్‌లో "సెక్స్ టాయ్స్" అనే కీవర్ట్ను ఎక్కువ మంది సెర్చ్ చేశారని షాంఘైకి చెందిన డాక్స్యూ కన్సల్టింగ్ విశ్లేషకుడు స్టెఫీ నోయెల్ తెలిపారు. కానీ మహమ్మారి సమయంలో దేశీయంగా పెరిగిన సెక్స్ టాయ్స్ డిమాండ్ దీర్ఘకాలిక వృద్ధికి దారితీయకపోవచ్చునని, ఈ డిమాండ్ తాత్కాలికమే అని ఆమె అన్నారు.

అయితే, మహమ్మారి సమయంలో సెక్స్ టాయ్స్ కొన్న వారిలో ప్రధానంగా మిలీనియం తరానికి చెందిన యువతులే ఉన్నారని, అంతేకాక వారిలో ఎక్కువ మంది మొదటిసారి కొనుగోలు చేసేవారే" అని నోయెల్ చెప్పారు. సెక్స్ టాయ్స్ ఎగుమతుల్లో 70 శాతం ఉత్పత్తితో ప్రపంచంలోనే ముందంజలో ఉన్న చైనాకు ఫ్రాన్స్, ఇటలీ మరియు అమెరికా దేశాల నుండి ఆర్డర్లు పెరిగాయని నోయెల్ చెప్పారు.
Published by: Kishore Akkaladevi
First published: October 20, 2020, 8:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading