Home /News /life-style /

DEMAND FOR PARACETAMOL INCREASES WHAT IS THE EXACT DOSE OF PARACETAMOL KNOW THE EXACT DOSE OF CROCIN CALPOL DOLO SUMO BY WEIGHT AND AGE SK

Paracetamol: పారాసెటమాల్ టాబ్లెట్ వాడుతున్నారా? మీకే ఈ వార్నింగ్.. తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Paracetamol: జ్వరాన్ని తగ్గించే పారాసెటమాల్ వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎక్కువ మోతాదులో ఈ మందు తీసుకోవడం మంచిది కాదు. అలెర్జీలు, చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి.

    మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. కొత్త కేసులు విపరీతంగా పెరగడంతో ప్రజల్లో ఆందోళన మొదలయింది. కరోనా లక్షణాలు ఏమాత్రం కనిపించినా వెంటనే అప్రమత్తమవుతున్నారు. ప్రభుత్వం సూచించిన మందులు వేసుకుంటున్నారు. అందులో పారాసెటమాల్ మొదటి స్థానంలో ఉంది. కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మనదేశంలో పారాసెటమాల్ వినియోగం బాగా పెరిగింది. కాస్త తలనొప్పి వచ్చినా.. జ్వరంగా అనిపించినా.. పారాసిటమాల్ మందు కాల్పోల్, క్రోసిన్, డోలో లాంటివి వేసుకుంటున్నారు. కానీ చాలా మందికి దాని డోసేజ్ గురించి తెలియదు. ఎంత తీసుకోవాలో.. ఎప్పుడు వేసుకోవాలో తెలియనప్పటికీ.. ఇష్టానుసారం వినియోగిస్తున్నారు.

    మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఐదు హెల్తీ డ్రింక్స్ తప్పక తీసుకోండి

    పారాసెటమాల్ మాత్రలను సాధారణంగా జ్వరం, మైగ్రేన్, పీరియడ్స్ నొప్పి, తలనొప్పి, పంటి నొప్పి, శరీర నొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు వినియోగిస్తారు. కాల్పోల్, క్రోసిన్, డోలో, సుమో ఎల్, కబిమోల్, పాసిమోల్ వంటి అనేక పేర్లతో మెడికల్ షాప్స్‌లో లభ్యమవుతోంది. కరోనా థర్డ్ వేవ్ సమయంలో డోలోకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఐతే పారాసెటమాల్‌ని ఇష్టమొచ్చినట్లు వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే అందులో స్టెరాయిడ్స్ ఉంటాయి. వాటిని ఎక్కువ మోతాదు తీసుకుంటే హాని కలిగిస్తుంది.

    రక్తదానం చేస్తే.. కేన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందా? మరో 7 లాభాలు..!

    US మార్గదర్శకాల ప్రకారం.. పెద్దలకు జ్వరం ఉంటే సాధారణంగా 325 mg నుంచి 650 mg వరకు పారాసెటమాల్ మోతాదును 4-6 గంటల వ్యవధిలో ఇవ్వవచ్చు. 8 గంటల వ్యవధిలో 1000 mg వరకు తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక వ్యక్తిలో గతంలో ఉన్న వ్యాధులు, బరువు, ఎత్తు ఆధారంగా కూడా మోతాదును నిర్ణయిస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. జ్వరం వచ్చిన 6 గంటల తర్వాత మాత్రమే 500 mg పారాసెటమాల్ మాత్రలను తీసుకోవాలి. ఇక చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి పారాసెటమాల్ ఇచ్చేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెల కంటే తక్కువ వయసున్న పిల్లలకి జ్వరం వస్తే 4-6 గంటల వ్యవధిలో ఒక కిలో బరువుకు 10 - 15 mg పారాసెటమాల్ ఇవ్వవచ్చు. 12 సంవత్సరాల వరకు పిల్లలకు 6-8 గంటల వ్యవధిలో అదే పరిమాణంలో ఇవ్వాలి.

    కరోనా సీజన్‌లో అందరి నోళ్లలో నానుతున్న Dolo650.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..

    వెబ్‌ఎమ్‌డి కథనం ప్రకారం.. మీకు జ్వరంగా ఉండి మూడు రోజుల పాటు పారాసెటమాల్ మందులను తీసుకున్నప్పటికీ..ఎలాంటి ఉపశమనం కలగకపోతే వెంటనే అప్రమత్తమవ్వాలి. పారాసెటమాల్‌ను ఆపేసి తక్షణం వైద్యుడిని సంప్రదించండి. ఎలాంటి జ్వరం ఉన్నా 10 కన్నా ఎక్కువ రోజులు పారాసెటమాల్ మాత్రలను అస్సలు తీసుకోకూడదు. ముఖ్యంగా కాలేయం, కిడ్నీ సమస్య, బరువు తక్కువగా ఉన్న సందర్భాల్లో వైద్యుల సలహా లేకుండా పారాసిటమాల్‌ను వాడకూడదు.

    సింగిల్ అయ్యారని బాధపడకండి.. మీకున్న ప్రయోజనాలు తెలుసుకోండి..

    జ్వరాన్ని తగ్గించే పారాసెటమాల్ వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎక్కువ మోతాదులో ఈ మందు తీసుకోవడం మంచిది కాదు. అలెర్జీలు, చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. విరేచనాలు, విపరీతమైన చెమటలు పట్టడం, ఆకలి లేకపోవటం, విశ్రాంతి లేకపోవటం, వాంతులు, కడుపునొప్పి, ఉబ్బరం, నొప్పి, పొత్తికడుపు తిమ్మిర్లు వంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశముంది. పారాసెటమాల్‌ ఇష్టానుసారం వేసుకుంటే కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే పారాసెటమాల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Covid-19, COVID-19 cases, Paracetamol

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు