హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Cervical cancer : సెకన్లలోనే సర్వైకల్ కాన్సర్‌ని గుర్తించే పరికరం

Cervical cancer : సెకన్లలోనే సర్వైకల్ కాన్సర్‌ని గుర్తించే పరికరం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

క్షణాల వ్యవధిలోనే మలేరియా, క్షయ, గర్భాశయ కాన్సర్ వంటి సమస్యలను గుర్తించే పరికరాన్న ఢిల్లీ పరిశోధకులు కనిపెట్టారు.

ఏదైనా సమస్య ఉందని హాస్పిటల్స్‌కి వెళ్తే జబ్బు ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి గంటల సమయం పడుతుంది. సర్వైకల్ కాన్సర్ వంటి జబ్బుకి ఇంకాస్తా ఎక్కువగానే టైమ్ పడుతుంది. ఈ సమస్య తీర్చేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఢిల్లీ సరికొత్త పరిశోధన చేసింది. సెకన్లలోనే జబ్బులను గుర్తించే ఆర్టిఫీషియల్ ఇంటెలెజెన్స్‌ వచ్చేసింది. ఇప్పటికే ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లు సేవలందిస్తున్నప్పటికీ వాటికంటే ముందే వ్యాధులను గుర్తించేస్తుంది ఈ సరికొత్త పరికరం. ఈ పరికరం సాయంతో మలేరియా, గర్భాశయ కాన్సర్, క్షయ వంటి ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించొచ్చు.

ఢిల్లీ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ సరికొత్త పరికరం చేతిలో ఇమిడేలా ఉండి.. తక్కువ శక్తితో నడుస్తుంది. దీంతో ఎప్పుడైనా.. ఎక్కడికైనా ఈ డివైజ్‌తో సమస్యను గుర్తించొచ్చు.

కొత్తగా కనుగొన్న ఈ పరికరం ద్వారా క్షణాల వ్యవధిలో జబ్బు గుర్తించొచ్చు. దీని ద్వారా పేషెంట్స్ టెన్షన్‌ని తగ్గించొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

First published:

Tags: Cancer, Health Tips

ఉత్తమ కథలు