హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Dating Apps: అమ్మాయిలూ.. జాగ్రత్త..!! డేటింగ్ యాప్స్ తో మానసిక ఒత్తిడి.. ఆందోళన..

Dating Apps: అమ్మాయిలూ.. జాగ్రత్త..!! డేటింగ్ యాప్స్ తో మానసిక ఒత్తిడి.. ఆందోళన..

డేటింగ్ యాప్స్.. ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా దీనికి అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత.. పూటకో డేటింగ్ యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కానీ ఇందులో ఎక్కువ సేపు గడపడం వల్ల అమ్మాయిలు వారికి తెలియకుండానే మానసి ఒత్తిళ్లకు, ఆందోళనకు లోనవుతారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :

డేటింగ్ యాప్స్ తో (dating apps)టైం పాస్.. ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకునేవారూ తస్మాత్ జాగ్రత్త. మీకు బోలెడన్ని మానసిక వ్యాధులను అంటగట్టేలా ఈ యాప్స్ తయారయ్యాయి. సరైన అవగాహన లేక ఈ ఊబిలో చిక్కుకుంటే ఇక బయటికి రావడం చాలా కష్టమని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. డేటింగ్ యాప్స్ లో చురుగ్గా ఉన్న మహిళల్లో కొంతకాలం తరువాత ఒత్తిడి (depression) లక్షణాలు, సామాజిక ఆందోళన (Social anxiety) స్పష్టంగా కనిపిస్తున్నట్టు అధ్యయనాలు (study) తేటతెల్లం చేస్తున్నాయి. అందుకే వీలైనంత వరకు ఈ మొబైల్ డేటింగ్ యాప్స్ కు దూరంగా మెలగడం మంచిదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. టిండర్ (tinder), బంబుల్ (bumble) లో యాక్టివ్ గా ఉన్న యువతులు.. మానసిక కుంగుబాటుకు లోనవ్వడం తరచూ కనిపించినట్టు అధ్యయనకర్తలు వివరిస్తున్నారు.

జర్నల్ చెబుతోందిదే..

'సైబర్ సైకాలజీ (cyber psychology), బిహేవియర్, అండ్ సోషల్ నెట్వర్కింగ్ అనే జర్నల్' లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. డేటింగ్ యాప్స్ లో తరచూ జరిగే సంభాషణలు, పెరిగే పరిచయాలు, అంతకంతకూ పెరిగే చనువు, సాన్నిహిత్యం వెరసి వీరిలో మానసిక సమస్యలు సృష్టిస్తున్నాయి.

dating apps, flesh trade, apps, exploitation, tinder, dating apps news, teenagers, anxiety, bumble, mafia gangs, human trafficking, cyber crime, apps crime

ఓవర్ పొసెసివ్ నెస్.. : డేటింగ్ యాప్స్ లో తమకు పరిచయమైన అబ్బాయిలు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అమ్మాయిలు తట్టుకోలేరు. పైపెచ్చు ఇలా పరిచయమైన మగవారిని తమకు మాత్రమే సొంతమైనట్టు అధికారం చెలాయించాలని చూసే మహిళలకు కొరతేం లేదు. కానీ ఇది తాత్కాలిక బంధమే అనేది వారికి అర్థం కాదు. సరిగ్గా చెప్పాలంటే ఇది క్షణికమైన బంధం మరి వీరితో అనుబంధాన్ని లోతుగా పెనవేసుకున్నట్టు ప్రవర్తిస్తే అటువైపు ఉన్న వ్యక్తి దాన్ని అర్థం చేసుకుని, ఆమె ఆలోచనలకు తగ్గట్టే ప్రవర్తించాలనే నియమం ఏమీ లేదుకదా.

ఎమోషనల్ : ఎమోషనల్ గా బలమైన మహిళల (emotional women) కు ఆ ఎమోషన్స్ వారి బలహీనత అని అర్థం చేసుకునే విచక్షణ ఉంటే ఇలాంటి మానసిక రుగ్మతలకు బలయ్యే ప్రమాదం అస్సలు ఉండదు. సాధారణంగా మహిళలు ఏవిషయమైనా ఎమోషనల్ గానే ఆలోచిస్తారు. కాబట్టి తమను దూరం పెడుతున్నారన్న ఆలోచన వీరిని తెగ వేధించి, అది మానసిక సమస్యలకు మూలకారణంగా మారేలా చేస్తుంది. ఇక డేటింగ్ యాప్స్ లో కొందరు కంత్రీలు అమ్మాయిలకు వల వేయడాన్ని పనిగా పెట్టుకుని వంచించే ప్రమాదాలు అత్యధికం కనుక ఇవి అంత సురక్షితమైన సేవలు కావనే విషయాన్ని మహిళా నెటిజన్లు గ్రహిస్తే సరి.

dating apps, flesh trade, apps, exploitation, tinder, dating apps news, teenagers, anxiety, bumble, mafia gangs, human trafficking, cyber crime, apps crime

అత్యుత్సాహం చూపే అమ్మాయిలు : కొత్తదనం కోరుకునే నేటి తరం అమ్మాయిలకు, మంచి తోడు కావాలని అత్యుత్సాహం చూపే అమ్మాయిలు ఇలాంటి మొబైల్ డేటింగ్ యాప్స్ కు ఆకర్షితులవుతున్నారు. 374 మంది అమ్మాయిలపై జరిగిన ఈ అధ్యయనంలో యాప్స్ అమ్మాయిల మెదడుపై తీవ్ర ప్రభావం చూపినట్టు తేలింది. సోషల్ యాంక్జైటీ, డిప్రెషన్ లక్షణాలు ఎక్కువైన అబ్బాయిలు మాత్రం డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయమైన వారితో పెద్దగా మాట్లాడేందుకు, కలిసేందుకు ఆసక్తి చూపరు. అదే అమ్మాయిలు అయితే దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. కెనడాలోని రియర్సన్ యూనివర్సిటీ జరిపిన ఈ అధ్యయనంలో పాల్గొన్న మార్టిన్ ఆంటోనీ మాటలు మన భారతీయ మహిళలకు అతికినట్టు సరిపోతాయి.

టీనేజ్ అమ్మాయిలు..:

టీనేజ్ అమ్మాయిలు (teenagers)కూడా డేటింగ్ యాప్స్ కు బానిసలవుతున్న నేటి రోజుల్లో ఉద్యోగులైన మహిళలు (working women), ఒంటరి మహిళలు (Single women), డేటింగ్ యాప్స్ లో చురుగ్గా ఉండటాన్ని స్టేటస్ సింబల్ గా (status symbol) భావిస్తున్నారు. ఇక వీకెండ్ (weekend) వచ్చిందంటే డేటింగ్ యాప్స్ లో పరిచయమైన వారితో బిజీగా గడిపేస్తారు.

మాఫియాలకు అడ్డాలు :

ఇక అమ్మాయిలు ట్రాప్ చేసే ముఠాలు, బ్లాక్ మార్కెట్ దంధా చేసే మాఫియా గ్యాంగులు (mafia gangs), అమ్మాయిలపై వలపు వల విసిరే అబ్బాయిలు ఇలా ఒక్కరేమిటి అమ్మాయిలు చాలా సాఫ్ట్ టార్గెట్స్ (soft targets) కాబట్టి సమాజంలోని దుష్టశక్తులకు డేటింగ్ యాప్స్ అడ్డాలుగా మారాయి. యాప్స్ లో తమకు నచ్చిన అమ్మాయిని ఎంపిక చేసుకుని, పరిచయాలు పెంచుకుని ఆతరువాత వ్యభిచార కూపంలోకి (flesh trade) తోసే వ్యాపారాలు విచ్ఛలవిడిగా జరుగుతున్న సమయంలో అమ్మాయిలు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దోపిడీకి (exploitation) గురయ్యేలా ఈ యాప్స్ బ్యాడ్ బాయ్స్ కు (bad boys) సాయం చేస్తున్నాయి. కేవలం సరదా కోసం యాప్స్ లో వ్యక్తిగత డేటా పెట్టడం, అందంగా తయారై, ఫొటో షూట్ లు(photo shoots) చేసి డేటింగ్ యాప్స్ లో అప్ లోడ్ చేసే అమ్మాయిలు మానసిక వేధింపులకు బలవుతూ, దీర్ఘకాలంలో మానసిక రోగులుగా మారుతున్నాయి.

First published:

Tags: Dating, Dating App, Depression, FAKE APPS, Women

ఉత్తమ కథలు