పాలల్లో ఖర్జూరం నానబెట్టి తింటే...సెక్స్‌లో మిమ్మల్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదేమో...

ఖర్జూరంలో ఉండే మినరల్స్ వల్ల శరీరంలో మంచి రక్తకణాలు ఉత్పత్తి అవుతాయట. రక్త సరఫరా మెరుగుపడటంతో పాటు బలం కూడా వస్తుంది. తద్వారా శృంగారంలో మంచి పట్టు సాధించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

news18-telugu
Updated: November 13, 2019, 10:51 PM IST
పాలల్లో ఖర్జూరం నానబెట్టి తింటే...సెక్స్‌లో మిమ్మల్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదేమో...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ప్రతిరోజూ పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకుంటే శృంగారంలో తిరుగుండదని నిపుణులు సెలవిస్తున్నారు. ముఖ్యంగా ఖర్జూరంలో ఉండే మినరల్స్ వల్ల శరీరంలో మంచి రక్తకణాలు ఉత్పత్తి అవుతాయట. రక్త సరఫరా మెరుగుపడటంతో పాటు బలం కూడా వస్తుంది. తద్వారా శృంగారంలో మంచి పట్టు సాధించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కొంతమంది చాలా బలహీనంగా ఉంటారు. ఏ పనీ చేయలేరు. త్వరగా అలసిపోతారు, నీరసంగా కూడా ఉంటారు. దీనికి అనారోగ్యం, పౌష్టికాహార లోపం, పని ఒత్తిడి వంటి పలు కారణాలు ఉన్నాయి. అలాంటి వారు శృంగార జీవితంలో కూడా రాణించలేకపోతున్నారు. అలాంటి వారు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను తినకూడదు. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే అలసట తొలగిపోతుంది. అంతేకాదు నిద్ర మనకు చాలా ముఖ్యం. నిద్రలేమి వలన అనేక అనారోగ్యాలు వస్తాయి. మంచి నిద్రపట్టాలంటే రాత్రివేళలో పాలలో కొద్దిగా మిరియాల పొడి, తేనె, చక్కెర కలిపి సేవిస్తే సరిపోతుంది.
First published: November 13, 2019, 10:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading