Daredevil David Blaine: సాహసవీరుడు, కేవలం బెలూన్ల సాయంతో 25వేల అడుగుల ఎత్తులోకి

ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా 25వేల అడుగుల ఎత్తుకి ఎగిరాడు. గాల్లో బెలూన్లు పట్టుకుని అలా విహరించాడు. ఈ సాహసకృత్యాన్ని యూట్యూబ్ ఒరిజినల్స్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

news18-telugu
Updated: September 3, 2020, 4:33 PM IST
Daredevil David Blaine: సాహసవీరుడు, కేవలం బెలూన్ల సాయంతో 25వేల అడుగుల ఎత్తులోకి
బెలూన్లతో డేర్ డెవిల్ డేవిడ్ సాహసం (Image;Reuters)
  • Share this:
ఒళ్లు గగుర్పొడిచే సాహసాలతో ప్రేక్షకులను ఊపిరిబిగబట్టేలా చేసే డేర్ డెవిల్ డేవిడ్ బ్లైన్ మరో సాహసం చేశాడు. బెలూన్ల సాయంతో ఏకంగా 25000 అడుగుల ఎత్తు వరకు ఎగిరాడు. సహజంగా విమానాలు మాత్రమే ఇంత ఎత్తులో ప్రయాణిస్తాయి. అరిజోనాలో ఈ సాహసం చేశాడు డేవిడ్. గంపగుత్తగా బెలూన్లలో హీలియం నింపాడు. అవన్నీ కలిపి తాళ్లు కట్టాడు. ఈ సాహసాన్ని రికార్డు చేయడానికి ఓ రెండు కెమెరాలు ఏర్పాటు చేశాడు. చక్కగా బెలూన్ల సాయంతో పైకి ఎగిరాడు. అలా ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా 25వేల అడుగుల ఎత్తుకి ఎగిరాడు. గాల్లో బెలూన్లు పట్టుకుని అలా విహరించాడు. ఈ సాహసకృత్యాన్ని యూట్యూబ్ ఒరిజినల్స్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. కొంతదూరం వెళ్లిన తర్వాత మెల్ల మెల్లగా తన బరువుని తగ్గించుకోవడానికి కొన్ని వస్తువులను కింద పడేశాడు. అలా మరికొంత పైకి వెళ్లిన తర్వాత ఆక్సిజన్ తక్కువగా ఉండడంతో, ఆక్సిజన్ మాస్క్ తగిలించుకున్నాడు. అలా మరికొంత సేపు ఎగిరాడు. 25వేల అడుగుల ఎత్తుకు ఎదిగిన తర్వాత ఆ బెలూన్లను వదిలేశాడు. 30 సెకన్ల పాటు ఎలాంటి ఆసరా లేకుండా గాల్లో కిందకు పడ్డాడు. 30 సెకన్ల తర్వాత పారాషూట్ ఓపెన్ చేశాడు. చక్కగా కిందకు దిగాడు. అరిజోనాలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు ఈ సాహసం చేశాడు.


47 సంవత్సరాల డేవిడ్ ఇలాంటి సాహస క్రీడలు చేయడంలో నిష్ణాతుడు. గతంలో ఫిష్ బౌల్‌లో తనను తాను లాక్ చేసుకున్నాడు. రెండు రోజుల పాటు ఐస్ బ్లాక్‌లో ఉన్నాడు. న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్లో అతి సన్నని పిల్లర్ మీద 35 గంటల పాటు కూర్చున్నాడు. తాజాగా బెలూన్ల స్టంట్ 30 నిమిషాల పాటు చేశాడు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 3, 2020, 4:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading