Home /News /life-style /

dandruff treatment: జుట్టులో చుండ్రు ఎక్కువగా ఉందా? అయితే ఈ సులభమైన పద్దతితో దూరం చేసుకోండి

dandruff treatment: జుట్టులో చుండ్రు ఎక్కువగా ఉందా? అయితే ఈ సులభమైన పద్దతితో దూరం చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అందమైన జుట్టు(hair) అందరికీ ఉండేది. చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె అప్లై చేయరు. దానివలన తలలో చర్మం పొడిబారి చుండ్రు (dandruff), జుట్టు రాలే సమస్యలు వస్తాయి. కొన్ని సహజ పద్దతులతో జుట్టుని కాపాడుకోవచ్చు

    చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం ( hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు (hair) ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్లజుట్టు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (dandruff treatment) మంచి ఫలితాలను ఇస్తాయి.

    మారుతోన్న జీవన విధానం..

    ఒకప్పుడు ప్రకృతిలో దొరికే శీకాయ, కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారు. ప్రతివారం నూనె(oil)తో తలస్నానం చేయడం వల్ల అందమైన జుట్టు(hair) అందరికీ ఉండేది. చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె అప్లై చేయరు. దానివలన తలలో చర్మం పొడిబారి చుండ్రు (dandruff), జుట్టు రాలే సమస్యలు వస్తాయి. కొన్ని సహజ పద్దతులతో జుట్టుని కాపాడుకోవచ్చు. మారుతోన్న జీవన విధానం, నీటి, వాయు కాలుష్యం (air pollution) పెరగడం వల్ల కూడా చుండ్రు సమస్య (dandruff problem) పెరుగుతుంది. ఇక బైక్‌లు నడిపించే వారు హెల్మెట్లు వాడడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతోంది. ఎన్ని రకాల షాంపూలు, ఆయిల్స్‌ వాడినా కొద్ది సమయం తగ్గినట్లే తగ్గి మళ్లీ వచ్చేస్తుంది. అయితే ఉల్లితో చుండ్రు సమస్యకు చెక్‌ పెట్టవచ్చనే విషయం మీకు తెలుసా.?

    ఉల్లి (Onions)తో తయారు చేసే మిశ్రంతో చుండ్రును పరార్‌ అయ్యేలా చేయొచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటేకొన్ని ఉల్లిపాయలను (Onions) తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కులగా కట్‌ చేయాలి. అనంతరం స్టవ్‌పై ఓ పాత్రను ఉంచి.. అందులో కొబ్బరి నూనె పోయాలి. తర్వాత ఆ నూనె (oil)లో ఉల్లిపాయ ముక్కులను వేసి ఫ్రై చేయాలి.

    ఉల్లిపాయ ముక్కలు నలుపు రంగులోకి మారగానే స్టవ్‌ను ఆఫ్‌ చేయాలి. అనంతరం ఆ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసిన నూనెను కుదుళ్లకు తగిలేలా బాగా మర్దనా చేయాలి. ఇలా చేసిన గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే వెంటనే చుండ్రు (dandruff) తగ్గిపోతుంది. ఒక్క చుండ్రు మాత్రమే కాకుండా.. జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా మారుతుంది. మరెందుకు ఆలస్యం ఈ సింపుల్‌, నేచురల్‌ టిప్‌ను మీరూ ఫాలో అవ్వండి మంచి ఫలితం పొందండి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Dandruff, Hair fall, Onion

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు