Home /News /life-style /

DANDRUFF HOME REMEDIES IN TELUGU LIKE WHITE VINEGAR NEEM PACK CLICK HERE TO KNOW FULL DETAILS PRV

dandruff home remedies in telugu: మీ జుట్టులో డాండ్రఫ్​ ఎక్కువగా వస్తోందా? అయితే ఈ సింఫుల్​ టిప్స్​ ఫాలో అవండి.. చాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలామందికి చుండ్రు చిన్న వయసులోనే వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ (Products) కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (dandruff home remedies in telugu) మంచి ఫలితాలను ఇస్తాయి

    మనిషి అందానికి కేశాలు (hair) కూడా ముఖ్యమే. కానీ, సగటు జీవిలో జుట్టు రాలిపోతుండటాన్ని (hair loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని (beauty) రెట్టింపు చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (fall) జరుగుతుంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు (hair) ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్ల జుట్టు (white hair), చుండ్రు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ (Products) కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (dandruff home remedies in telugu) మంచి ఫలితాలను ఇస్తాయి.

    శీకాయ, కుంకుడు కాయలతో..

    ఒకప్పుడు ప్రకృతిలో దొరికే శీకాయ, కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారు. ప్రతివారం నూనె (oil)తో తలస్నానం చేయడం వల్ల అందమైన జుట్టు (hair) అందరికీ ఉండేది. చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె అప్లై (apply) చేయరు. దాని వలన తలలో చర్మం పొడిబారి చుండ్రు (dandruff), జుట్టు రాలే సమస్యలు వస్తాయి. కొన్ని సహజ పద్దతులతో జుట్టుని కాపాడుకోవచ్చు (save hair). చుండ్రు సమస్యతోను, అలాగే జుట్టు రాలిపోయే (hair fall) సమస్యతో బాధ పడుతూ ఉంటారు. ఇక అలా అనేక జుట్టు సమస్యలతో బాధ పడేవారు ఈ పద్ధతులు (dandruff home remedies in telugus) పాటించండి.

    శిలీంధ్రాల పెరుగుదలను నివారిస్తుంది..

    వైట్ వెనిగర్ (White vinegar) చుండ్రుకు ఉత్తమమైన ఇంటి నివారణలలో ఒకటి. వెనిగర్‌లోని ఎసిటిక్ యాసిడ్ తలపై శిలీంధ్రాల పెరుగుదలను నివారిస్తుంది మరియు దురద నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఒకటిన్నర కప్పు వైట్ వెనిగర్‌ను 2 కప్పుల నీటిలో కలపండి,  తల మరియు జుట్టును శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితాలను చూడవచ్చు.

    వేప (Neem)లో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి చుండ్రును సరిచేయడానికి మరియు వివిధ జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. 4 కప్పుల నీటిలో కొన్ని వేపాకులు వేసి మరిగించాలి. తర్వాత వడగట్టి మరియు చల్లగా తలకు అప్లై చేయాలి , అరగంట తర్వాత జుట్టు శుభ్రం చేయాలి. 2 నుండి 3 సార్లు ఒక వారంలో వేసుకోవచ్చు. ఇది చుండ్రును త్వరగా వదిలించుకోవడానికి మీకు సహాయపడుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    ఇది కూడా చదవండి : రైతులకు సీఎం కేసీఆర్​ చెబుతానన్న గుడ్​న్యూస్​ అదేనా.. రైతులకు ఫించన్ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కారు?
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Dandruff, Hair fall, Life Style

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు