Fitness : పొట్ట తగ్గాలా... రోజూ ఇవి తినండి... బెస్ట్ డైట్...

Fitness : పొట్ట అనేది ఈ రోజుల్లో చాలా మందికి పెద్ద సమస్య. దాన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కాక సతమతం అవుతుంటారు. ఈ సింపుల్ చిట్కా పాటించండి. పొట్ట దానంతట అదే తగ్గిపోతుంది.

news18-telugu
Updated: November 8, 2020, 3:20 AM IST
Fitness : పొట్ట తగ్గాలా... రోజూ ఇవి తినండి... బెస్ట్ డైట్...
Fitness : పొట్ట తగ్గాలా... రోజూ ఇవి తినండి... బెస్ట్ డైట్...
  • Share this:
Fitness : మనం ఏదైనా వస్తువును మోస్తూ ఉంటే... అది బరువుగా ఉన్నట్లు అనిపించగానే... కింద పెడతాం. లేదా ఆ చేతిలోంచీ ఈ చేతిలోకి మార్చుకుంటాం. అదే పొట్ట బరువుగా ఉంటే... అలా చెయ్యలేం. దాన్ని భరించాల్సిందే. ఈ పొట్ట సమస్య ప్రతీ ఇంట్లో... చాలా మందికి ఉంటోంది. దీన్ని ఎలా తగ్గించుకోవాలో, పొట్ట లోపల పేరుకుపోయిన కొవ్వును ఎలా కరిగించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని ఎక్సర్‌సైజులు చేసినా, వర్కవుట్లు చేసినా... పొట్ట మాత్రం వేలాడుతూనే ఉంటుంది. వేసుకునే డ్రెస్సులు కూడా ఇరుకైపోయి ఇబ్బంది కలిగిస్తాయి. ఈ పొట్టను భరించలేక నరకం చూస్తుంటారు చాలా మంది. ఓ కిలోమీటర్ నడిస్తే చాలు... ఆయాసం వచ్చేస్తుంటుంది వారికి. పొట్టలో కొవ్వు కరిగేందుకు... ఉలవలు (కుల్తీ దాల్), ఎర్ర కందిపప్పు (మసూర్ దాల్), పెసరపప్పు (మూంగ్ దాల్) చక్కగా ఉపయోగపడతాయి. ఇవి తింటూ ఉంటే... పొట్ట ఆటేమేటిక్‌గా తగ్గిపోతుంది. అదెలా సాధ్యమో తెలుసుకుందాం.

పప్పుల్ని రకరకాలుగా వండుకోవచ్చు. మన ఇళ్లలో పప్పు వంటలు కామన్. పప్పుల్ని అలాగే వండుకోవచ్చు... కొంతమంది చికెన్, మాంసంతో కూడా పప్పుల్ని కలిపి వండుకుంటారు. ఊదాహరణకు... ఉలవచారు, బిర్యానీ కలిపి తింటే... ఆ టేస్టే వేరంటారు. ఇవి వండుకోవడం తేలిక... పొట్టలో పెద్దగా బరువు అనిపించవు. ఇప్పటివరకూ మీరు ఎలాంటి డైట్ జాగ్రత్తలు తీసుకుంటున్నారో అవి అప్రస్తుతం. ఇకపై మీ డైట్‌లో ఈ మూడు పప్పుల్నీ చేర్చుకోండి. ఆ తర్వాత పొట్ట... పెట్టే బెడా సర్దుకొని వెళ్లిపోతుంది.

పెసరపప్పు (Moong Dal) : వేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్యీ కలుపుకొని... అప్పడం నంజుకుంటూ తింటే ఉంటుందీ... ఆ టేస్టే వేరు. రకరకాల వ్యాధుల అంతు చూసే గుణం పెసరపప్పుకి ఉంది. ఈ పప్పు ఈజీగా అరుగుతుంది. దీని నిండా పోషకాలే. ఇది బరువు తగ్గేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువే. అందువల్ల దీన్ని తింటే... ఇంకేమీ తినబుద్ధి కాదు. ఫలితంగా బరువు తగ్గొచ్చు. అంతేకాదు... ఇది ప్రతీ షాపులో దొరుకుతుంది. 10-15 నిమిషాల్లో వంట అయిపోతుంది. ఇది పొట్టే కాదు... శరీర బరువు కూడా తగ్గేందుకు వీలు కల్పిస్తుంది.

ఎర్రపప్పు (Masoor Dal) : ఇది మనం ఎప్పుడో గానీ వండుకోం. కానీ ఈ పప్పు కూడా చాలా మంచిది. ఈజీగా జీర్ణం అవుతుంది. దీన్లో చక్కటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అవి బాడీకీ చాలా అవసరం. పైగా ఈ పప్పులో కొవ్వు తక్కువ. ఫైబర్ ఎక్కువ. పైన చెప్పుకున్నట్లు ఫైబర్ వల్ల ఈ పప్పు తిన్నాక... పొట్ట నిండిన ఫీల్ కలుగుతుంది. ఇంకేమీ తినబుద్ధి కాదు. అందువల్ల అధిక బరువు సమస్య తగ్గుతూ ఉంటుంది. సో... ఎర్రపప్పు ఓ అరకేజీ కొన్నారంటే... వారానికో రెండుసార్లు వండుకొని తింటే... మీ పని మీరు చేసుకోవచ్చు... పొట్టలో కొవ్వు కరిగించే పనిని ఎర్రపప్పు చూసుకుంటుంది.

ఉలవలు (Kulti Dal - Horse Gram) : ఉలవలు వల్ల బరువు తగ్గడమే కాదు... ఓవరాల్ హెల్త్‌కి కూడా ఇవి చాలా మంచివి. బాడీకి కావాల్సిన అన్ని పోషకాలూ వీటిలో ఉంటాయి. ఉలవలు... పొట్టలో కొవ్వుపై ఎక్కువ ఫోకస్ పెడతాయి. పొట్టలోకి వెళ్లగానే... అక్కడ తిష్టవేసిన కొవ్వును... "ఛల్... పో అవతలకి" అంటూ తరిమికొడతాయి. కిడ్నీలో రాళ్ల అంతు కూడా చూస్తాయి. అందువల్ల ఉలవల్ని రెగ్యులర్‌గా వాడేయాలి. ఉలవచారూ... బిర్యానీ చేసుకొని తింటే... అదిరిపోయే టేస్టీ ఫుడ్ తిన్న ఫీల్ కూడా కలుగుతుంది.
Published by: Krishna Kumar N
First published: November 8, 2020, 3:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading