Curry Leaves Benefits On Hair : కరివేపాకే కదా అని తీసిపారేయడం మనకు అలవాటు. కూరల్లో అది వస్తే పక్కన పెట్టేస్తాం. కరివేపాకు(Curry Leaves)మనకు లభించడం మన అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే అది వంటలకు రుచి, సువాసన ఇవ్వడమే కాదు... వాటిని రోజూ వాడితే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలూ(Benfits)కలుగుతాయి. దాని లక్షణాల కారణంగా, దీనిని చాలా చోట్ల తీపి వేప అని కూడా పిలుస్తారు. శరీరంలోని విష వ్యర్థాల్ని కరివేపాకులు తరిమేస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్యకు చెక్ పెడతాయి. కరివేపాకు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా మన జుట్టుకు పోషణ అందించడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. జుట్టు(Hair)అందాన్ని పెంచడంలో కరివేపాకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. జుట్టుకు కరివేపాకులను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు పెరగడమే కాకుండా జుట్టు ఒత్తుగా, మెరుస్తూ ఉంటుంది. అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉండే కరివేపాకులను ఏ జుట్టు సమస్యలలో ఉపయోగించవచ్చో ఈ ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు మెరుపు కోసం -
మీ జుట్టు నిస్తేజంగా లేదా దెబ్బతిన్నట్లు కనిపిస్తే, కరివేపాకును ఉపయోగించండి. పచ్చసొన, పెరుగుతో కరివేపాకు పేస్ట్ మిక్స్ చేసి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత జుట్టును కడగాలి. అప్పుడు మీ జుట్టు యొక్క మెరుపు త్వరగా తిరిగి వస్తుంది. మీరు దీన్ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయొచ్చు.
Weight Loss Tips : బరువు తగ్గాలనుకునేవాళ్లు ఇవి తినండి..ఇట్టే బరువు తగ్గిపోతారు!
మీ జుట్టును సహజంగా నల్లగా మార్చుకోండి
చాలా మందికి చిన్న వయస్సులోనే తల వెంట్రుకలు తెల్లగా మారే సమస్యలు మొదలవుతాయి. మీ జుట్టు తెల్లగా మారే ప్రారంభంలోనే కరివేపాకును ఉపయోగిస్తే, మీ జుట్టు తెల్లగా మారేది తగ్గుతుంది. దీని కోసం కరివేపాకును పేస్ట్ లా చేసి గోరింటాకుతో వాడాలి.
జుట్టు పెరుగుదలను పెంచడానికి
మీ జుట్టు పొడవుగా ఉండాలనుకుంటే.. మెంతులు, ఉసిరి, కరివేపాకులను పేస్ట్ చేయండి. వీటన్నింటినీ ప్రెష్ గా తీసుకుని గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టుపై అరగంట పాటు ఉంచిన తర్వాత, సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఐటమ్స్(మెంతులు, ఉసిరి, కరివేపాకు) తాజాగా అందుబాటులో లేకుంటే, వాటి నుండి పొడిని తయారు చేయండి.
Walk forr fitness : వాకింగ్ తో బోలెడు ప్రయోజనాలు...ఫిట్ నెస్ కోసం ప్రతి రోజూ ఎంత నడవాలో తెలుసా
జుట్టు రాలడాన్ని తొలగించండి
మీరు జుట్టు రాలడం సమస్యతో ఇబ్బంది పడుతుంటే, కరివేపాకు మీ సమస్యను పరిష్కరించగలదు. యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్ అధికంగా ఉండే కరివేపాకులను కొబ్బరి నూనెలో బాగా నానబెట్టండి. ఇప్పుడు ఈ నూనెను ఫిల్టర్ చేసి గాజు సీసాలో ఉంచండి. ఈ నూనెను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hair Loss, Hair problem tips, Lifestyle