Relationship: ఆఫీసులు తెరచుకుంటున్నాయి.. ఆలుమగలు ఈ తప్పులు చేయకండి!

జంటలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే.. వారి సంబంధం మరింత బలపడుతుంది. దీన్ని మరింత తెలివిగా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నించాలి. వైవాహిక జీవితంలో అనేక సమస్యలు సర్వసాధారణం. కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. దీనిపై అవగాహన ఉన్న జంటలు కచ్ఛితంగా తమ వివాహబంధంలో విజయవంతంగా ముందుకు సాగుతారు.

జంటలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే.. వారి సంబంధం మరింత బలపడుతుంది. దీన్ని మరింత తెలివిగా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నించాలి. వైవాహిక జీవితంలో అనేక సమస్యలు సర్వసాధారణం. కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. దీనిపై అవగాహన ఉన్న జంటలు కచ్ఛితంగా తమ వివాహబంధంలో విజయవంతంగా ముందుకు సాగుతారు.

  • Share this:
ప్రేమ, నమ్మకం, అవగాహన సామర్థ్యం వివాహా బంధంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. లాక్డౌన్‌ lockdown సమయంలో భాగస్వాముల couples మధ్య ఇది బాగా కనిపించింది. అంటే ఒకరికి మరొకరు పనుల్లో సాయం చేసుకోవడం, ఎక్కువ సమయం కుటుంబంతో గడపడం వంటివి. కానీ, ఇప్పుడు మళ్లీ ఆఫీసులు తెరుచుకుంటున్నాయి. ఇక ఆఫీసు ప్రారంభమైన తర్వాత భార్యాభర్తలు మధ్య కాస్త గొడవులు పెరగవచ్చు. మీ సంబంధం బలంగా ఉండటానికి చిన్న విషయాలను గుర్తుంచుకోండి.

మీ పనితోపాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా సమతూల్యం చేసుకోవాలి. అప్పుడే బంధం బలంగా ఉంటుంది. చాలా రోజుల నుంచి ఒకరితో మరొకరు ఎక్కువ సమయాన్ని గడిపారు. అందుకే ఎల్లప్పుడూ ఇలా కలిసి ఉండటాన్ని అలవాటు చేసుకోవాలి. అయితే, ప్రస్తుతం ఆఫీసులు తెరచుకుంటున్నాయి కాబట్టి..మీ భాగాస్వామికి దూరంగా ఉన్నపుడు వారి జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతుంటాయి. అయితే, అలా అని వారు పనిలో ఉన్న సమయంలో పదేపదే కాల్‌ చేయడం సమంజసం కాదు.

అది వారికి పని ఒత్తిడి వల్ల చిరాకు తెప్పించవచ్చు. అప్పుడు మీరు వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇంట్లో ఉన్న సమయంలో తమ పనులను షేర్‌ చేసుకున్నారు. అలాగే ఆఫీసులకు వెళ్లిన తర్వాత మీ పని మరింత పెరుగుతుంది. వంట చేయడం, క్లీనింగ్‌ నుంచి లాండ్రీ వరకు మీ కార్యాలయ పనులతోపాటు ఈ పనులు కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడు చిన్నపాటి విషయాలకు కూడా గొడవలు పడకుండా.. ఒకరికి మరొకరు సాయపడుతూ.. బాధ్యతలు తెలివిగా పంచుకోవాలి.

క్వీన్‌ ఎలిజబెత్‌ II లాంగ్‌ లైఫ్‌ సీక్రెట్‌.. ఈ డ్రింక్‌ ఆమె ఫెవరెట్‌ !ఆఫీసులకు వెళ్లిన తర్వాత మీ లైఫ్‌స్టైల్‌ పూర్తిగా మారిపోతుంది. ఇందులో సందేహం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సమయం కాస్త తక్కువే ఉంటుంది. మీ భాగస్వామికి సమయం కేటాయించడం కష్టమవుతుంది. అప్పుడు మీరు కలిసి సెలెబ్రేట్‌ చేసుకున్న సమయాలను మర్చిపోవద్దు. ఆఫీసు పని ఎక్కువగా ఉండటం వల్ల అలసినట్లుగా ఉంటుంది. ఇది మీ రొమాంటిక్‌ జీవితంపై ప్రభావం చూపుతుంది.

ఒత్తిడి కారణంగా మీ భాగస్వామితో లైంగిక జీవితాన్ని ఆస్వాదించలేకపోవచ్చు. దీంతో వారి మధ్య దూరం పెరుగుతుంది. అటువంటి సమయంలో జంటలు కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి రాగానే పప్పు, ఉప్పు తక్కువైందని విరుచుకుపడకూడదు. భాగస్వామితో కలిసి భోజనం చేయడానికి ప్రయత్నించాలి. దీంతో ఆహార రుచిని కాదు మీ మాటలతో భాగస్వామికి కాస్త రీఫ్రెష్‌ అవుతుంది. దీంతో మీ సంబంధంలో ఏ గొడవలు ఉండవు.
Published by:Renuka Godugu
First published: