కొత్తగా పెళ్లి అయ్యిందా...మీ పార్ట్‌నర్‌తో సెక్స్ గురించి ఎలా మాట్లాడాలో తెలియక తికమకపడుతున్నారా...

శృంగారం గురించి ఆలుమగలు మనసు విప్పి మాట్లాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే దాంపత్య జీవితంపై ఇద్దరూ ఒక అభిప్రాయానికి రావడానికి అవకాశం ఉంటుందట.

news18-telugu
Updated: November 17, 2020, 7:08 PM IST
కొత్తగా పెళ్లి అయ్యిందా...మీ పార్ట్‌నర్‌తో సెక్స్ గురించి ఎలా మాట్లాడాలో తెలియక తికమకపడుతున్నారా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చాలామంది దంపతులు సెక్స్ గురించి మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడతారు. కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, పెరిగిన వాతావరణం వంటివి ఇందుకు కారణం కావచ్చు. కానీ శృంగారం గురించి ఆలుమగలు మనసు విప్పి మాట్లాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే దాంపత్య జీవితంపై ఇద్దరూ ఒక అభిప్రాయానికి రావడానికి అవకాశం ఉంటుందట. మీ బంధం సజావుగా సాగాలంటే ఈ అంశంపై భాగస్వామితో చర్చించుకోవాలి. ఇందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటంటే...

సెక్స్ గురించి చాటింగ్

సెక్స్ గురించి లోతుగా చర్చించుకోవడానికి సెక్స్‌టింగ్ (sexting) బాగా ఉపయోగపడుతుంది. సన్నిహిత ఆలోచనలను పంచుకోవడానికి, సెక్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు. శృంగారంపై భాగస్వామి అభిప్రాయాలు, ఆలోచనలను తెలుసుకోవడానికి స్వేచ్ఛగా సెక్స్‌టింగ్ చేయవచ్చు. ఇది కూడా ఒక రకమైన ఫోర్‌ప్లే కిందకే వస్తుందని సెక్స్ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

సినిమాల్లో శృంగార సన్నివేశాలు
శృంగారం గురించి మాట్లాడుకునే అవకాశాన్ని సినిమా ద్వారా కల్పించుకోవచ్చు. సినిమాల్లో శృంగార సన్నివేశం వచ్చినప్పుడు, దానిపై మీ భాగస్వామి పీలింగ్‌ ఎలా ఉందో అడిగి తెలుసుకోండి. కానీ ఇలాంటి విషయాల్లో భాగస్వామి వద్ద నిజాయతిగా ఉండాలి. ఆ ప్రత్యేక సన్నివేశం మీకు ఎందుకు నచ్చిందో లేదా ఎందుకు నచ్చలేదో చర్చించండి. ఈ విషయాల గురించి భాగస్వామికి తెలియజేయడం చాలా ముఖ్యం. తద్వారా ఎదుటివారికి నచ్చిన, నచ్చని విషయాల గురించి తెలుసుకోవచ్చు.

మాట్లాడే సమయం ముఖ్యం
మీ భాగస్వామితో మాత్రమే మాట్లాడగలిగే శృంగారపరమైన అంశాల గురించి స్ట్రయిట్ ఫార్‌వర్డ్‌గా ఉండాలి. కానీ ఇలాంటి విషయాల గుర్చించి మాట్లాడుకునే సందర్భం సరైనదా కాదా అనేది తెలుసుకోవాలి. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించుకోవాలి. వేరే పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాల గురించి ప్రస్తావిస్తే చిరాకుపడే అవకాశం ఉంది.

సరదా ప్రశ్నలు
సెక్స్ గురించి మాటలు ప్రారంభించడానికి ఇది ఒక మంచి మార్గం. ఒకరినొకరు సరదాగా పలకరించుకుంటూ, చమత్కారమైన ప్రశ్నలు అడగడం ద్వారా సంభాషణను కొనసాగించవచ్చు. కేవలం శృంగారం గురించి మాత్రమే కాకుండా దానితో ముడిపడి ఉండే అన్ని విషయాల గురించి ఎదుటివారి అభిప్రాయం తెలుసుకోవచ్చు. లైంగిక జీవితం గురించి మీ అభిప్రాయాలను చెబుతూ ఎదుటి వారిని అలాంటి ప్రశ్నలు అడగవచ్చు.

సీరియస్‌గా ఉండకూడదు
లైంగికపరమైన విషయాల గురించి మాట్లాడాలనుకునే ముందు ఎదుటివారు ఎలా ఫీలవుతున్నారో పరిశీలించాలి. వారితో కటువుగా ఉంటూ సీరియస్‌గా మాట్లాడితే ఉపయోగం ఉండదు. పైగా ఒకరిపై మరొకరికి ఉండే ఇంప్రెషన్‌ కూడా పోతుంది. అందువల్ల ముందు ఫన్నీగా మాట్లాడాలి. సెక్స్ ఒక సరదా అయితే, సెక్స్‌ గురించి మాట్లాడటం కూడా అంతే సరదాగానే ఉండాలని గుర్తుంచుకోండి. ఇద్దరికీ అనుకూలంగా ఉండే సమయాల్లో శృంగారం, లైగింక జీవితం గురించి మాట్లాడుకోవడం వల్ల ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు, అసౌకర్యాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తపడవచ్చు.
Published by: Krishna Adithya
First published: November 17, 2020, 7:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading