news18-telugu
Updated: November 4, 2019, 10:49 PM IST
ప్రతీకాత్మకచిత్రం
మన దేశంలో జనాభా ఒక సమస్యగా మారింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఉద్యోగాల కల్పన, అలాగే నివాసం కల్పించడం ప్రభుత్వానికి పెద్ద సమస్య అనే చెప్పవచ్చు. అయితే దక్షిణ కొరియాలో మాత్రం జనాభా తగ్గిపోతోందని కలవరం చెందుతోంది. దేశంలో రానున్న పాతికేళ్లలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి యువకుల సంఖ్య బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యువత వివాహాలకు దూరం అవ్వడం, అలాగే పెళ్లిల్లు మానేయడం కూడా కారణంగా తెలుస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం వారికి సెలవలు ఇచ్చి మరీ శృంగారం చేసుకోమని ప్రోత్సాహకాలు అందిస్తోంది. ముఖ్యంగా పిల్లలను కంటే ప్రమోషన్లతో పాటు మంచి ఫ్లాట్, అలాగే షాపింగ్ కూపన్లను కూడా ఇస్తోంది. అలా దగ్గరుండి మరీ దంపతులను శృంగారం చేసుకోమని ప్రోత్సహిస్తోంది. అయినప్పటికీ జనాభా పెరుగుదలలో పెద్దగా మార్పులేమి లేకపోవడంతో అధికారులు తలల పట్టుకుంటున్నారు.
Published by:
Krishna Adithya
First published:
November 4, 2019, 10:49 PM IST