COUPLE LIVING NAKED FOR TEN YEARS IN ENGLAND AND EVEN NOT USING POWER PRV
Nude couple: పదేళ్లుగా బట్టలు లేకుండా నగ్నంగానే బతికేస్తున్న దంపతులు.. ఎక్కడంటే
ఫొటో: పాల్ నికోలస్
ఇద్దరూ 24 గంటలూ అడవిలో బట్టలు వేసుకోకుండానే గడుపుతారు. విద్యుత్‌ను వాడరు. సహజంగా ప్రకృతిలో లభించే నీటిని తప్ప.. కుళాయిల ద్వారా వచ్చే నీటిని వినియోగించరు. వీరిది పూర్తిగా ప్రకృతితో మమేకమైన జీవనం. నగరంలోకి వెళ్లాల్సి వచ్చినపుడు కూడా..
ఇంగ్లాండ్‌లో జాన్(john), హెలెన్(Helen) దంపతుల(couple) జీవన విధానం గురించి తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే! ఎందుకంటే వారు కరెంటు(power) వాడరు. అందుబాటులో ఉన్నా వినియోగించరు. పైప్‌ల ద్వారా, కుళాయిల ద్వారా వచ్చే నీటిని అస్సలే వాడరు. ప్రకృతి ప్రసాదించిన నదులు, కాలువల ద్వారా వచ్చే నీటిని వాడుతారు(use). అంతేకాదు.. అసలు బట్టలే(dress) వేసుకోరంటే నమ్మండి. వీరు ఇద్దరు ఊరికి దూరంగా అటవీ ప్రాంతంలో పాత వాహనంలో ప్రకృతి(nature) మధ్య జీవనం సాగిస్తున్నారు. వీరు నగరంలోకి వెళ్లాల్సి వచ్చినా బట్టలు వేసుకోరు. నగ్నం(nude)గానే వెళ్లి తమ పనులు చక్కబెట్టుకుని వస్తారు. ఇంగ్లండ్(England)లోని చిప్పెన్హామ్ ప్రాంతానికి చెందిన ప్రకృతి ప్రేమికులు జాన్, హెలెన్ దంపతుల(couples) జీవన విధానం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
2011లో పురాతన పద్ధతిలో జాన్, హెలన్ పెళ్లి(marriage) చేసుకున్నారు. 2006 నుంచి హెలెన్ నేచరిస్ట్గా జీవనం సాగిస్తున్నాడు. అయితే హెలెన్‌ను ఇష్టపడిన జాన్.. 2011 నుంచి పెళ్లి అనంతరం తను కూడా అలా మారిపోయారు. ఇద్దరూ 24 గంటలూ అడవిలో బట్టలు వేసుకోకుండానే గడుపుతారు. విద్యుత్(electricity)ను వాడరు. సహజంగా ప్రకృతిలో లభించే నీటిని(water) తప్ప.. కుళాయిల ద్వారా వచ్చే నీటిని వినియోగించరు. వీరిది పూర్తిగా ప్రకృతి(nature)తో మమేకమైన జీవనం. నగరంలోకి వెళ్లాల్సి వచ్చినపుడు కూడా వీరు నగ్నం(nude)గానే అంటే బట్టలు లేకుండానే వెళ్తారట. ఇరువురు ఇంటిలో కాకుండా ఓ పాత వాహనంలోనే జీవనం కొనసాగిస్తారు. అయితే అప్పుడప్పుడు వీరిద్దరిని చూడటానికి టూరిస్టుల్లా పలువురు వచ్చి పోతూ ఫొటోలు దిగి పోతుంటారు.
మేం న్యూడిస్టులం (nudists) కాదు..
హెలెన్ మాట్లాడుతూ.. `మాది ఓ ప్రత్యేకమైన వినూత్న జీవన విధానం. అందరూ పాటించాల్సినది అయితే కాదు. ఇలా జీవించమని మేం ఎవరినీ కూడా బలవంతం చేయము. మాకు ఇలా జీవించాలని అనిపించింది. జీవిస్తున్నాం. మేం న్యూడిస్ట్‌లం కాదు.. నేచురలిస్ట్‌లం. రెండు టవల్స్ తప్ప మా దగ్గరం ఇంకెలాంటి దుస్తులూ ఉండవు. కరెంటును కూడా ఉపయోగించం. మేం అటవీ ప్రాంతంలో నివసిస్తున్నాం కాబట్టి.. జంతువులు, కీటకాల నుంచి ప్రమాదం లేకుండా ఉండటం కోసం వ్యాన్‌లో ఉంటున్నామ`ని చెప్పారు. కాగా, ఇంగ్లాండ్‌లోని మరో జంట కూడా ఇలాగే ప్రకృతిని ప్రేమిస్తూ నగ్నంగానే నివసిస్తున్నారు. 69 ఏళ్ల జాన్, ఆయన భార్య క్లార్క్ డోనా (55) ఇరువురు కూడా ఇంగ్లాండ్‌లోని లింకన్సైర్లో నివసిస్తారు. మొదట వారిని చూసి స్థానికులు భయపడినా.. ఒక ఏడాది తర్వాత వారిని చుట్టుపక్కల వారు అర్థం చేసుకోవడం మొదలపెట్టారంట. ఇంకే వారి జీవితం సాఫీగానే సాగిపోతోంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.