• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • COUPLE HAD MOVED THE HIGH COURT EARLIER THIS YEAR AS THE MATERNAL GRANDMOTHER OF THEIR CHILD REFUSED TO PART WITH HIM GH SSR

Bombay high court: బామ్మ గొప్పదే.. కానీ తల్లిదండ్రుల ప్రేమను తను భర్తీ చేయలేదన్న బాంబే హైకోర్ట్.. ఎందుకలా చెప్పిందంటే..

Bombay high court: బామ్మ గొప్పదే.. కానీ తల్లిదండ్రుల ప్రేమను తను భర్తీ చేయలేదన్న బాంబే హైకోర్ట్.. ఎందుకలా చెప్పిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

బామ్మ, తాతలకు మనవళ్లకు మధ్య ఉండే బంధం గొప్పదైనప్పటికీ.. అది తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య ఉండే సహజమైన బంధాన్ని భర్తీ చేయలేదని బాంబే హై కోర్టు తెలిపింది. ఒక కేసు విచారణ సందర్బంగా న్యాయస్థానం ఇలా వ్యాఖ్యానించింది. కొన్ని నెలలుగా తనతో ఉంటున్న...

  • Share this:
బామ్మ, తాతలకు మనవళ్లకు మధ్య ఉండే బంధం గొప్పదైనప్పటికీ.. అది తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య ఉండే సహజమైన బంధాన్ని భర్తీ చేయలేదని బాంబే హై కోర్టు తెలిపింది. ఒక కేసు విచారణ సందర్బంగా న్యాయస్థానం ఇలా వ్యాఖ్యానించింది. కొన్ని నెలలుగా తనతో ఉంటున్న మనవడిని.. అతడి తల్లిదండ్రుల దగ్గరకి పంపేందుకు ఒప్పుకోలేదు ఒక బామ్మ. దీంతో తమ కొడుకును అప్పగించాలని బాబు తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. తన 12 ఏళ్ల మనవడిని వెంటనే అతడి తల్లిదండ్రులకు అప్పగించాలని మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఒక వృద్ధురాలిని న్యాయస్థానం ఆదేశించింది. బాబు బాధ్యతలను పుణెకు చెందిన అతడి తల్లిదండ్రులకు అప్పగించింది.

బాబు తల్లికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆమెకు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు చెప్పారు. దీంతో 2019లో బాబుతో సహా నాసిక్‌లో ఉంటున్న తన తల్లి వద్దకు వెళ్లిందామె. ఆ బాబును నాసిక్‌లోని ఒక పాఠశాలలో చేర్పించారు. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న తరువాత తల్లి ఆరోగ్యం మెరుగైంది. దీంతో 2020-21 విద్యా సంవత్సరం కోసం పుణెకు తిరిగి వెళ్లాలనుకున్నారు. కానీ అప్పటికే కరోనా విజృంభించడంతో సాధ్యపడలేదు. 2020 మే లో బాబును తన తల్లి వద్దే ఉంచి, ఆ మహిళ మాత్రమే పుణెకు వెళ్లింది. ఈ సంవత్సరం బాబుకు పుణెలోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకున్నారు. అతడు నాసిక్‌లోనే ఉంటూ ఆన్‌లైన్ క్లాసులు వింటున్నాడు. ఇటీవల ఆ దంపతులు బాబును తీసుకెళ్లేందుకు నాసిక్‌ వెళ్లారు. కానీ బాబు అమ్మమ్మ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు.

పోలీసులను, చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించి కేసు పెట్టింది. బాబు తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉన్నాయని ఆమె పోలీసులకు తెలిపింది. ఇది 12 ఏళ్ల పిల్లవాడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పింది. ఈ సమయంలో బాబు తనవద్దే ఉండటం మంచిదని వాదించింది. దీంతో బాబు తల్లిదండ్రులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బాబును తమకు ఇప్పించాలని కోరారు. ఈ కేసును జస్టిస్ ఎస్.ఎస్.షిండే, మనీష్ పితాలేలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిల్లల పెంపకం, ఆరోగ్యం, విద్య, వికాసం, శ్రేయస్సు భవిష్యత్తు.. వంటి బాధ్యతలన్నీ తల్లిదండ్రులవేనని ధర్మాసనం తెలిపింది. ఆ బామ్మ ఏమాత్రం చదువుకోలేదు. ఆమె ఆర్థిక పరిస్థితులు సైతం ఏమంత గొప్పగా లేవు. అయినా కూడా ఒక కంపెనీలో మంచి ఉద్యోగంలో ఉన్న బాబు తండ్రిని కోర్టు వరకు తీసుకెళ్లడం గమనార్హం.
Published by:Sambasiva Reddy
First published:

అగ్ర కథనాలు