Home /News /life-style /

COUPLE AND LOVERS HAVE RELATIONSHIP WITH NATURE SA

ప్రేమ జంటలు... చూడాగానే అనుభవించాలనే కోరిక!

lovers

lovers

సెక్స్ లేకుండానే ఇద్దరి మధ్య రొమాంటిక్ రిలేషన్‌షిప్ ఉండవచ్చు. ఇది ఇద్దరి మధ్య ఉండే లైంగిక సంబంధాలు, భాగస్వామిపై ఉండే కోరికలు, అవగాహనపై ఆధారపడి ఉంటుంది



    ప్రతి జీవిలో లైంగిక అంశం అత్యంత ప్రాధన్యంతో కూడుకున్నది. అయితే లైంగిక తృప్తి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. చాలా మంది సురిక్షితమైన శృంగార భావాలను కలిగి ఉండారు. యాధృచ్చికంగా జరిగే లైంగిక చర్యలో పాల్గో్ంటు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా చాలా మందిలో ఫ్రే సెక్సువల్ లక్షణాలు ఉంటాయి. ఎదుటివారి గురించి పెద్దగా తెలుసుకోకముందే వారిపై కోరికలు కలగడాన్ని ఫ్రే సెక్సువాలిటీ అంటారు. కానీ ఇద్దరి మధ్య బంధం బలపడుతున్నా కొద్దీ వారిపై కోరికలు తగ్గిపోతాయి. ఇది లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్‌పై ప్రభావం చూపుతుంది. ఫ్రే సెక్సువల్ వ్యక్తులకు బాగా దగ్గరైన భాగస్వామిపై క్రమంగా కోరికలు తగ్గుతాయి. వీరు సెక్స్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా రొమాంటిక్ రిలేషన్‌షిప్‌పై దృష్టిపెట్టడం ద్వారా భాగస్వామి ప్రేమను పొందుతూ, వారితో రిలేషన్‌షిప్‌ను కొనసాగించవచ్చు. రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో సెక్స్ అవసరం లేదని ఇద్దరూ భావించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.

    సెక్స్ లేకుండానే ఇద్దరి మధ్య రొమాంటిక్ రిలేషన్‌షిప్ ఉండవచ్చు. ఇది ఇద్దరి మధ్య ఉండే లైంగిక సంబంధాలు, భాగస్వామిపై ఉండే కోరికలు, అవగాహనపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రేమలో ఉండే జంటలు, పెళ్లి చేసుకునేవారు ఫ్రే సెక్సువల్‌గా ఉండాలనుకుంటారు. కానీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారిలో ఒకరికి సెక్స్ కావాలనిపించి, మరొకరు వద్దని చెప్పినప్పుడు ఇద్దరి మధ్య తేడాలు వస్తాయి. అందువల్ల ఈ విషయాల గురించి భాగస్వామితో చర్చించి, వారి అభిప్రాయాలను గౌరవించగలగాలి. ఫ్రే సెక్సువల్ వ్యక్తులకు ఇది ఒక సవాలుగా చెప్పుకోవచ్చు.

    భాగస్వామితో ఎలాంటి రిలేషన్‌షిప్ కోరుకుంటున్నారనేది ఇద్దరూ కలిసి చర్చించుకోవాలి. ఏదీ దాచకుండా ఉంటేనే ఇద్దరి మధ్య అన్నిరకాల బంధాలు బలపడతాయి. సెక్స్ అవసరం లేకుండా రొమాంటిక్ రిలేషన్‌షిప్ ఎంతవరకు సాధ్యమవుతుందో చర్చించుకోవాలి. ఇద్దరూ ఒకరి అనుమతితో మరొకరు పాలిమరీ రిలేషన్‌షిప్‌ను ఎంచుకొని సెక్స్ కోసం వేరొకరికి దగ్గరవ్వడం వల్ల మీ బంధం ఎంతవరకు నిలబడుతుందో ఆలోచించాలి. ఇవన్నీ తెలుసుకున్న తరువాతే ముందడుగు వేయాలి. భాగస్వామితో ప్రేమే ముఖ్యమనే నిర్ణయానికి వచ్చినవారు ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచి రిలేషన్‌షిప్‌ను కొనసాగించడం మంచిది.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: Lovers

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు