Health Tips : అధికబరువుని తగ్గించే బంకమట్టి..

బంకమట్టి ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు పరిశోధకులు. అయితే, దీన్ని నేరుగా తినకూడదు.. ఈ మట్టి ద్వారా ఎలా ఆరోగ్యంగా ఉండొచ్చో ఇప్పుడు చూద్దాం..

Amala Ravula | news18-telugu
Updated: June 13, 2019, 12:39 PM IST
Health Tips : అధికబరువుని తగ్గించే బంకమట్టి..
అధికబరువుతో ఇబ్బందులు అధికమవుతాయి. కాబట్టి బరువుని అదుపు చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఎప్పటికప్పుడూ బరువు చెక్ చేసుకోవడం మంచిది.
Amala Ravula | news18-telugu
Updated: June 13, 2019, 12:39 PM IST
చిన్నతనంలో మట్టి తింటే పెద్దవారు కొట్టేవారు. కడుపునొప్పి వస్తుందంటూ భయపెట్టేవారు. కానీ, కొన్నిరకాల మట్టి ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు పరిశోధకులు. అయితే, మంచిది కదా అని నేరుగా బంకమట్టిని తినకూడదని సూచిస్తున్నారు. అది ఆరోగ్యమివ్వడం పక్కనపెడితే విషంగా మారుతుందని.. పరీక్ష చేసిన బంకమట్టినే తీసుకోవాలని చెబుతున్నారు. అవన్నీ కష్టం కాబట్టి మట్టి పాత్రల్లో వండుకున్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యప్రయోజనాలుంటాయని చెబుతున్నారు.

గతంలో పెద్దలు వంటలు చేసేందుకు మట్టిపాత్రలు వాడేవారు. దీంతో వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉండేవి కావు. ఈ విధంగానే ఆలోచించిన సౌత్ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.

మట్టిపాత్రల్లో వండిన వంటలను తింటేనే ఆరోగ్యంగా ఉండేవారు. మరి బంకమట్టినే నేరుగా తింటే ఎలా ఉంటుందని ఎలుకల మీద అధ్యయనం చేశారు. ఆ పరిశోధనల్లో నివ్వేరపోయే నిజాలు తెలిశాయి. బంకమట్టి తినడం వల్ల ఆరోగ్యంగా మారడమే కాకుండా పొట్ట కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు
.

బంకమట్టిలోని ఓ ప్రత్యేక పదార్థమేనని, అది పేగుల్లోని అధిక కొవ్వుని పీల్చేస్తుందని గుర్తించారు. అయితే, అది ఎక్కడపడితే అక్కడ దొరికే బంకమట్టి కాకుండా..పరీక్ష చేసిందే తీసుకోవాలి. అయితే, అందరికీ అలా కుదరదతు కాబట్టి.. మట్టిపాత్రల్లో వండుకుని తినొచ్చని సూచిస్తున్నారు. మట్టిపాత్రల్లో వండుకుని తిన్నా కూడా ఇలాంటి అద్భుత ప్రయోజనాలే ఉంటాయని ముఖ్యంగా అధికబరువు ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.
First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...