House for sale: అమ్మకానికి సముద్రం మధ్యలోని అంద‌మైన ఇల్లు.. ధ‌ర ఎంతంటే..?

(Image Credit: Purplebricks)

నార్త్ వేల్స్‌లోని ఆంగ్లేస్సీ ఐలాండ్‌లో ఉన్న ఓ అద్భుత‌మైన కుటీరం అమ్మ‌కానికి వ‌చ్చింది. ఈ ఇల్లు కొనుక్కుంటే మీ చుట్టూ ఎవరూ కనిపి

  • Share this:
పెళ్లి చేసి చూడు.. ఇళ్లుక‌ట్టి చూడు అని సామెత‌ గుర్తుండే ఉంటుంది. జీవితంలో ఈ రెండూ క‌ష్ట‌మైన ప‌నుల‌ని పెద్దలు చెపుతుంటారు.ఎందుకంటే, ఇళ్లుకొన‌డం అంతా ఆషామాషీ కాదు. మన దగ్గర కావాల్సినడబ్బు ఉండాలి.కొనబోయే ఇళ్లు న‌కు న‌చ్చాలి. మ‌న అభిరుచికి త‌గిన‌ట్టు ఉండాలి. గాలి వెలుతురు రావాలి. అయితే, ఇదంతా అపార్ట్‌మెంట్స్‌లో కుద‌ర‌దు. ఇండిపెండెంట్ ఇల్లు కొంటే మ‌న టేస్ట్‌కు త‌గిన‌ట్టుగా మ‌లుచుకోవ‌చ్చు.. లేదా మ‌న టేస్ట్‌కు త‌గిన‌ది కొనుక్కోవ‌చ్చు. అస‌లే క‌రోనా కాలం క‌దా... ప్ర‌జ‌లు అపార్ట్‌మెంట్లంటేనే భ‌య‌ప‌డుతున్నారు. భౌతిక దూరం ఒక క‌నీస అవ‌స‌రంగా మారిన వేళ‌... స‌ముద్రం మ‌ధ్య‌లో ఓ ఇల్లు కొనుక్కుంటే ఎంతో హాయిగా ఉంటుంది.. అదీ ఆ స‌ముద్రం ఏ టౌన్‌కో వాక‌బుల్‌గా ఉందనుకోండి మ‌రీ మంచిది.. ఇదేదో బానే ఉంది. ఇలాంటి ఇల్లు కొందామ‌ని మ‌న‌సు ఉవ్విళ్ళూరుతోందా... అయితే మీరు నార్త్ వేల్స్‌లో ఉన్న ఆంగ్లేస్సీ వెళ్లాలి.

అక్క‌డ ఓ ఐలాండ్‌లో ఉన్న రెండు ఇళ్ళ‌లో ఓ అద్భుత‌మైన కుటీరం అమ్మ‌కానికి వ‌చ్చింది. ఈ ఇల్లు కొనుక్కుంటే మీ చుట్టు ప్రక్కన ఎవరూ ఉండరు. ఏ ఒత్తిడిలేకుండాహాయిగా అక్కడ సేదతీరవచ్చు.1700 సంవ‌త్స‌రంలో ఈ కుటీరాన్ని నిర్మించార‌ట‌. అప్ప‌ట్లో ఓ ఇద్ద‌రు మ‌త్య్స‌కారులు ఇందులో ఉండేవారు. త‌రువాత అది స్నానాల‌గ‌దులుగా మార్చారు.ఆపైన ఓ ఫామ్​ హౌజ్​ రూపంలోఛేంజ్​ చేశారు.ఇక ఈ కుటీరంలో నాలుగు రిసెప్షన్ గదులు, ఐదు బెడ్ రూములు, రెండు బాత్రూమ్ లు, ఒక సన్ రూమ్, ఒక గార్డెన్ వంటివి ఉంటాయి.

వంటగది, యుటిలిటీ గది,స్టడీ రూమ్ భోజనాల గ‌ది ఉన్నాయి.ఈ ద్వీపానికి దాని సొంతదారులు ఏకంగా ఓ కాలిబాటే నిర్మించుకున్నారు. అలాగే గ్యారేజ్ బ్లాక్ పార్కింగ్ స్థలం కూడా ఉంటుంది.కేవలం ఐదు నిమిషాల నడకతో మీరు భూమిపై కాలుపెట్టొచ్చు.

ఈ ఇంటి అమ్మకం వ్య‌వ‌హారాన్ని రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్పర్పుల్‌బ్రిక్స్ కోసం లూయిస్ డోక్వ్రా అనే కంపెనీ చూసుకుంటోంద‌ని లండ‌న్ కేంద్రంగా ప‌నిచేసే లాడ్‌బిబుల్ తెలిపింది. కరోనా కారణంగా ఇటీవ‌లికాలంలో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ క‌ల్చ‌ర్ బాగా పెరిగింది. కాబట్టి, అలా ఇంటి నుంచే ప‌నిచేసుకోవాల‌నుకునేవారికి ఈ ఇల్లు చాలా అనువైన‌ది. అలాగే ఆఫీసుకు వెళ్ళాల్సిన అవ‌స‌రం ఉన్న‌వారికీ కూడా బాగా ప‌నికొచ్చే ఇల్లే ఇది. ఇదంతా బానే ఉంది... ఇంకేం ఇల్లు కొనేద్దామ‌నుకుంటున్నారా... అయితే మీ ద‌గ్గ‌ర జ‌స్ట్ ఓ 9.2 కోట్లు ఉంటే చాలు.. ఎంచ‌క్క‌గా ఈ ఇల్లు మీ సొంత‌మైపోతుంది. హాయిగా ఈ ద్వీపంలో జీవించేయ‌చ్చు.
Published by:Sumanth Kanukula
First published: