news18-telugu
Updated: October 3, 2020, 1:11 PM IST
Coronavirus updates: ఆ విషయంలో భారతీయులకు కలిసొచ్చిన లాక్డౌన్...
Heart Health Improved: భారతీయులు గుండెల మీద చెయ్యి వేసుకొని... కాస్త ఉపశమనంలా ఫీలయ్యే వార్త ఇది. కరోనా లాక్డౌన్ సమయంలో... భారతీయుల గుండెల పనితీరు మెరుగైందని అధ్యనయంలో తేలింది. గుండె సంబంధింత అనారోగ్యాలు మగవాళ్లలో 25.4 శాతం తగ్గగా... ఆడవాళ్లలో 17.2 శాతం తగ్గాయి. ఇందుకు కారణమేంటంటే... భారతీయులు ఇంటి పట్టునే ఉంటూ... ఇంట్లో వండుకునే ఆహారం తినడమేనట. ఇదివరకు ఆఫీసులకు, పనులకు వెళ్లి... ఫుడ్ ఆర్డర్ ఇచ్చేవారు. అది ప్రాసెస్ చేసిన, ప్యాకింగ్ ఫుడ్. ఎంత మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా పిజ్జా, బర్గర్ల వంటివి. వాటిలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని రెగ్యులర్‌గా తింటే... ఇక గుండె ఆరోగ్యాన్ని వదులుకోవాల్సిందే. ఈ లాక్డౌన్ వల్ల 50 ఏళ్లు దాటి వారి గుండెలు ఇప్పుడు బాగా పనిచేస్తున్నాయట.
లాక్డౌన్ కాలంలో... మనుషుల్లో అదనంగా ఉండే కొలెస్ట్రాల్... 22.3 శాతం తగ్గిందని ఆరోగ్య నిపుణులు తేల్చారు. ఇందుకు 50,000 మంది ఆరోగ్య డేటాను 2019లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కాలంలో ఎలా ఉందో... 2020లో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఎలా ఉందో పోల్చిచూశారు. ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. భారతీయులు సహజంగా స్వేచ్ఛా జీవులు. ఫుడ్ విషయంలో వారు కండీషన్లను పెట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ... వచ్చింది కరోనా వైరస్ కదా... కచ్చితంగా ఆహార నియమాలు పాటించాల్సి వచ్చింది. జంక్ ఫుడ్ మానేసి... ఇంట్లో ఆహారం తినడమే కాదు... ఇమ్యూనిటీ పెరిగే ఆహారం, పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి కూడా తీసుకుంటున్నారు. అందువల్ల బాడీలో చెడు కొవ్వు కరిగి... గుండెకు రక్త సరఫరా మెరుగవుతోంది. అందువల్ల గుండెలు పద్ధతిగా పనిచేస్తున్నాయి.

Coronavirus updates: ఆ విషయంలో భారతీయులకు కలిసొచ్చిన లాక్డౌన్...
ఆరోగ్య నిపుణుల ప్రకారం... కొలెస్ట్రాల్ అనేది కొవ్వొత్తి లాంటిది. కొవ్వు లాగా ఉంటుంది. మానవ శరీరం హార్మోనులు, విటమిన్ D ఉత్పత్తి చెయ్యడానికీ, ఆరోగ్యకరమైన కణాలు ఉత్పత్తి అయ్యేందుకు ఇది అవసరం. మానవ శరీరం తనకు కావాల్సిన కొలెస్ట్రాల్‌ను తనే తయారుచేసుకుంటుంది. అలా కాకుండా... జంక్ ఫుడ్ ద్వారా అదనపు కొలెస్ట్రాల్ బాడీలోకి వెళ్తే... అది ధమనుల గోడలకు అంటుకొని అక్కడే అలా ఉంటుంది. కొన్నాళ్లకు అది అలా పేరుకుపోతూ... పరిమాణం పెరుగుతూ... ఏదో ఒక రోజు... ధమనిలో రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. అంతే... హార్ట్ ఎటాక్ వస్తుంది. కాబట్టే... చెడు కొలెస్ట్రాల్ బాడీలోకి వెళ్లకుండా చూసుకోవాలి.
20 నుంచి 40 ఏళ్ల వారితో పోల్చితే... 50 ఏళ్లు దాటిన వారికి గుండె పనితీరు ఎక్కువగా మెరుగైంది. దీనికి కారణం... వారి లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులే. మెట్రో నగరాలతో పోల్చితే... జైపూర్, అమృత్సర్, కాన్పూర్, జలంధర్ లాంటి చిన్న నగరాల్లో ప్రజల ఆరోగ్యం ఎక్కువగా మెరుగుపడింది. ఐతే... ఇప్పుడు అన్‌లాక్ 5 నడుస్తోంది. దాదాపుగా కండీషన్లేవీ లేవు. అందువల్ల మళ్లీ ప్రజలు బయటి ఫుడ్‌కి అలవాటు పడుతున్నారు. ఇదివరకటి రోజులు మళ్లీ కనిపిస్తున్నాయి. ఐతే... ఎలాగూ ఆరోగ్యం మెరుగైంది కాబట్టి... ఆ హెల్తీ అలవాట్లను అలాగే కొనసాగిస్తే... గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి తీవ్రమైన అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చంటున్నారు నిపుణులు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.
Published by:
Krishna Kumar N
First published:
October 3, 2020, 1:11 PM IST