• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • CORONAVIRUS OUTBREAK COVID19 ORAL HEALTH CHANGE TOOTHBRUSH AFTER RECOVERING EXPERTS MK GH

Tooth brush: కరోనా నుంచి కోలుకున్నారా?.. మీ టూత్ బ్రెష్‌ను త్వరగా మార్చేయండి.. ఎందుకంటే ?

Tooth brush: కరోనా నుంచి కోలుకున్నారా?.. మీ టూత్ బ్రెష్‌ను త్వరగా మార్చేయండి.. ఎందుకంటే ?

ప్రతీకాత్మక చిత్రం

కరోనా లక్షణాలు కన్పించిన తర్వాత టూత్ బ్రష్, టంగ్ క్లీనర్లను మార్చాలి. టూత్ బ్రష్ మీద ఉండే బ్యాక్టీరియా, వైరస్ కారణంగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది. నీటిలో వైరస్ లేదా బ్యాక్టీరియాను తగ్గించడానికి మౌత్ వాష్ లేదా బీటాడిన్ గార్గిల్ ఉపయోగించాలి.

  • Share this:
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా భారినపడి కోలుకున్న వ్యక్తులకు కూడా మళ్లీ సోకుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకొస్తున్నాయి. దీనికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు శాస్త్రవేత్తలు. వారి విశ్లేషణలో కొన్ని కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. వాటి ఆధారంగా కొన్ని చిట్కాలను రూపొందించారు. కరోనా నుంచి కోలుకున్న వారితో పాటు అందరూ ఈ చిట్కాలను పాటించాలని వైద్యులు కోరుతున్నారు. ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు వెంటనే వారి టూత్ బ్రష్‌ను మార్చాలని దంతవైద్యులు సూచిస్తున్నారు. కోవిడ్ బారిన పడ్డ సమయంలో వాడిన టూత్ బ్రష్‌లో వైరస్‌ అలాగే నిలిచి ఉండే అవకాశముంది. దీంతో కరోనా తగ్గిన తర్వాత కూడా అదే బ్రష్ వాడితే.. మళ్లీ పాజిటివ్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

దీనిపై ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్లో డెంటల్ విభాగ అధిపతి డాక్టర్ ప్రవేష్ మెహ్రా మాట్లాడుతూ.. "మీరు లేదా మీ కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్ సర్కిల్‌లోని ఎవరైనా కరోనా బారిన పడి కోలుకుంటే, దయచేసి వెంటనే వారి టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ వంటివి మార్చేయండి. ఎందుకంటే ఇవి వైరస్‌ను వ్యాపింపజేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి” అని చెప్పారు. ఈ విశ్లేషణ సరైందేనని చెబుతున్నారు ఆకాష్ హెల్త్‌కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ (డెంటల్) డాక్టర్ భూమికా మదన్. డాక్టర్ ప్రవేష్ మెహ్రా చెప్పిన విషయాలను పూర్తిగా అంగీకరిస్తున్నానని చెప్పారు. టూత్ బ్రెష్ కూడా కరోనా సంక్రమణకు కారణమవుతుంది. ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది. అందువల్ల, సీజనల్‌గా వచ్చే ఫ్లూ, దగ్గు, జలుబు నుంచి కోలుకున్న వారెవరైనా సరే టూత్ బ్రష్, టంగ్ క్లీనర్‌లను మార్చాలని సిఫార్సు చేస్తున్నారు డాక్టర్ భూమికా మదన్.

మళ్లీ వైరస్ సోకే ప్రమాదం..
కరోనా లక్షణాలు కన్పించిన తర్వాత టూత్ బ్రష్, టంగ్ క్లీనర్లను మార్చాలి. టూత్ బ్రష్ మీద ఉండే బ్యాక్టీరియా, వైరస్ కారణంగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది. నీటిలో వైరస్ లేదా బ్యాక్టీరియాను తగ్గించడానికి మౌత్ వాష్ లేదా బీటాడిన్ గార్గిల్ ఉపయోగించాలి. మౌత్ వాష్ అందుబాటులో లేకపోతే గోరువెచ్చని సెలైన్ వాటర్‌తో నోరు శుభ్రం చేసుకోవాలి. రోజుకు రెండు సార్లు బ్రష్ చేస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. వైరస్ సోకిన వ్యక్తి దగ్గు, తుమ్ము, అరవడం, మాట్లాడటం, నవ్వడం వంటివి చేయడం ద్వారా వారి నోటి నుంచి తుంపర్లు ఎదుటి వ్యక్తిపై పడి ఇతరుకు వైరస్ త్వరగా వ్యాపిస్తుంది. వీటితో పాటు కలుషితమైన ఉపరితలాలను తాకడం, చేతులు శుభ్రర్చుకోకుండా కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకడం ద్వారా కూడా ప్రజలు వ్యాధి బారిన పడవచ్చు. ఈ విషయాలన్నీ కరోనా రోగులు దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Krishna Adithya
First published:

అగ్ర కథనాలు