Corona Lockdown : కరోనాకు అదే మందు... సైకాలజిస్టుల సూచన...

Corona Lockdown | Coronaupdate : కరోనా వైరస్‌కి ప్రత్యేకించి మందు అవసరం లేదా... సైకాలజిస్టులు చెప్పినట్లు చేస్తే సరిపోతుందా?

news18-telugu
Updated: June 9, 2020, 4:48 AM IST
Corona Lockdown : కరోనాకు అదే మందు... సైకాలజిస్టుల సూచన...
కరోనాకు అదే మందు... సైకాలజిస్టుల సూచన... (File)
  • Share this:
Corona Lockdown | Coronaupdate : మనందరికీ తెలుసు... కరోనా వైరస్ పెద్ద మేటరేమీ కాదని. జాగ్రత్తలు తీసుకుంటే అది మన జోలికి రాదు. ఒకవేళ వచ్చినా ఏమీ కాదంటున్నారు సైకాలజిస్టులు. తాము చెప్పినట్లు చేస్తే... చాలా ఈజీగా ఈ వైరస్ బాడీ లోంచీ బయటకు వెళ్లిపోతుందని అంటున్నారు. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ పాజిటివ్‌గా ఉండాలంటున్నారు. ఎన్ని మందులు వాడినా తగ్గని రోగాలు... సంతోషంతో, పాజిటివ్ ఎనర్జీతో ఉంటే తగ్గుతున్నాయనీ, ఇదే ఫార్ములా కరోనా వైరస్‌కి కూడా పనిచేస్తుందని అంటున్నారు. ఇందులో సైన్స్ కూడా ఉంది. మనం సంతోషంగా, పాజిటివ్‌గా ఉన్నప్పుడు మన బాడీలో కణాలన్నీ ఉత్తేజంతో ఉంటాయి. అలాగే బాడీలోని మంచి బ్యాక్టీరియా కూడా ఫుల్ ఎనర్జీతో ఉంటుంది. ఇలాంటప్పుడు కరోనా వైరస్ బాడీలోకి వెళ్తే... మంచి బ్యాక్టీరియా బలంగా పోరాడి వైరస్‌ను తరిమికొడుతుంది. కణాలు కూడా వైరస్‌కి సహకరించవు. అందుకే మనం పాజిటివ్‌గా ఉండాలంటున్నారు. అలా ఎలా ఉండాలో కూడా చెబుతున్నారు.

1. కరోనా న్యూస్ టీవీల్లో అతిగా చూడొద్దు. జస్ట్ అప్‌డేట్స్ తెలుసుకొని... వేరే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ చూడండి.

2. గతంలో జరిగిన విపత్తుల్ని తలచుకోండి. ఆ తర్వాత మనం ఎంత బలంగా మారిందీ గుర్తుచేసుకోండి. ఇదీ అంతే అనుకోండి.
3. ఫన్నీ వీడియోలు బాగా చూడండి. ఇందుకు యూట్యూబ్, టిక్ టాక్ ఉండనే ఉన్నాయి.
4. ఇంట్లో బోర్ కొడితే... ఏ డాబాపైకో వెళ్లి... చుట్టూ చూడండి. ప్రకృతిని చూడండి. సూర్యోదయం చూడండి. పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి.
5. చుట్టుపక్కల వాళ్లకు సాయం చెయ్యం‌డి. చిన్న చిన్న పనులు చేసి పెట్టండి. వారు చెప్పే థాంక్స్ మీకు ఎంతో ఆనందం కలిగిస్తుంది.
6. మీకు ఇష్టమైన వారికి ఆన్‌లైన్‌లో గిఫ్ట్ ఆర్డర్ చెయ్యండి. ఆ గిఫ్ట్ అందుకున్నాక వారు పడే ఆనందం... మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.7. చిన్నప్పుడు ఎన్నో ఇష్టాలు మిస్సై ఉంటారు. వాటిని ఇప్పుడు చెయ్యండి. బొమ్మలు వెయ్యండి, వాటికి కలర్స్ వెయ్యండి... ఎంతో ఆనందం కలుగుతుంది.
8. స్వయంగా వంట చెయ్యండి. అందులో మీ క్రియేటివిటీ చూపండి. మీకు కలిగే రిలాక్స్ ఫీల్ అంతా ఇంతా కాదు.
9. చిన్నదైనా పెద్దదైనా మంచి పనులు చేస్తూ ఉండండి... మొక్కలు పెంచండి... గార్డెన్‌లో గడపండి... ఆనందం మామూలుగా ఉండదు.
10. కరోనా నెగెటివ్ వార్తల్ని పట్టించుకోవద్దు. కరోనాపై ఎవరైనా భయంకరంగా చెబితే... అస్సలు పట్టించుకోవద్దు. అప్రమత్తంగా ఉండాలి తప్ప భయం వద్దు.
11. కొత్తగా ఏదైనా కనిపెట్టడానికి ట్రై చెయ్యండి... వాట్సాప్‌లో మంచి కామెడీ మెసేజ్ తయారు చెయ్యండి.... ఏది చేసినా మీలో ఉత్సాహం పెరుగుతుంది.
12. ఇక యోగా, ఎక్సర్‌సైజ్ వంటివి చేస్తే... ఫిట్‌నెస్ పెరుగుతుంది అలాగే... బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని మీకు తెలుసు కదా.

ఏ వైరస్ అయినా మనల్ని ఎటాక్ చెయ్యాలంటే... మనం వీక్ అవ్వాలి. అలా కాకుండా మనం బలంగా, పాజిటివ్ ఎనర్జీతో ఉంటే, వైరస్‌ల ఆటలు మన దగ్గర సాగవు. ఇదే విషయాన్ని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ... ఫుల్ పాజిటివ్ యాటిట్యూడ్‌తో ముందుకు సాగండి అంటున్నారు మానసికవేత్తలు.
First published: June 9, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading