Home /News /life-style /

CORONAVIRUS 3 OMICRON SYMPTOMS THAT NEED TO BE TAKEN INTO ACCOUNT IMMEDIATELY GH VB

Omicron Symptoms: ఈ 3 లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా.. అయితే మీకు ఒమిక్రాన్ ఉన్నట్లే..?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

భారత్​లో కొవిడ్ కొత్త వేరియంట్(New Varient) ఒమిక్రాన్(Omicron) కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మొత్తం కోవిడ్ కేసుల వృద్ధికి ఈ వేరియంటే కారణమని నిపుణులు చెబుతున్నారు. వేగంగా పెరుగుతున్న కరోనా కేసుల(omicron cases in india) సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

ఇంకా చదవండి ...
భారత్​లో కొవిడ్ కొత్త వేరియంట్(New Varient) ఒమిక్రాన్(Omicron) కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మొత్తం కోవిడ్ కేసుల వృద్ధికి ఈ వేరియంటే కారణమని నిపుణులు చెబుతున్నారు. వేగంగా పెరుగుతున్న కరోనా కేసుల(omicron cases in india) సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. చాలామంది బాధితుల్లో లక్షణాలు(Symptoms) స్వల్పంగా ఉన్నప్పటికీ, దీన్ని తేలికగా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరు ఒమిక్రాన్ లక్షణాలు ప్రమాదకరం కాదని కొట్టిపారేస్తుండగా, మరికొందరు సాధారణ జలుబు అని పొరబడుతున్నారు. ఫలితంగా బయట తిరుగుతూ వైరస్‌ను ఇతర వ్యక్తులకు వ్యాప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్​కు సంబంధించిన లక్షణాల (omicron symptoms) గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.

ఒమిక్రాన్ లక్షణాలు
సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(US CDC) హెచ్చరించింది. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు సూచనలు చేసింది. విపరీతమైన దగ్గు, అలసటగా అనిపించడం, తలభాగం అంతా ఇబ్బందిగా అనిపించడం, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ఒమిక్రాన్(కరోనా టెస్ట్) చేయించుకోవాలని కోరింది. ప్రధానంగా ఈ కింది లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించింది.

Amazon: త్వరలో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం.. వాటిపై 70 శాతం డిస్కౌంట్.. రూ.16 వేల వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్​..


గొంతు నొప్పి, మంట
గొంతునొప్పిగా అనిపించడం ఒమిక్రాన్ ఉనికి మొదలైనప్పటి నుంటి వెలుగులోకి వచ్చిన లక్షణమే. గొంతునొప్పితో పాటు, చికాకుగా ఉంటుంది.

తలనొప్పి
అనేక కారణాల వల్ల తలనొప్పి వస్తుంటుంది. అయితే కరోనా-ఒమిక్రాన్(Omicron) సంబంధించినంత వరకు శాస్త్రవేత్తలు దీన్ని అధికారిక లక్షణాల జాబితాకు జోడించాలని కోరుతున్నారు. ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో తలెత్తే రకరకాల మార్పుల ద్వారా తలనొప్పి వస్తుందంటున్నారు.

ముక్కు కారటం
ఇప్పటివరకు ఒమిక్రాన్ లక్షణాలు చాలా వరకు సాధారణ జలుబు లేదా ఫ్లూతో సమానంగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ కరోనా అనేది సాధారణ జలుబు అని చెప్పడం కష్టమే. ఎందుకంటే వైరస్‌ కారణంగానే ముక్కు కారడం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Crisis: భారీ ఆర్థిక సంక్షోభంలో పొరుగు దేశం.. చుక్కలనంటిన ధరలతో విలవిల..


మరోవైపు లండన్‌ కింగ్స్ కాలేజ్ జెనెటిక్ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్, బ్రిటన్ కొవిడ్ యాప్ అధ్యయన విభాగాధిపతి అయిన టిమ్ స్పెక్టర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తేలికపాటి జ్వరం, అలసట, గొంతులో ఇబ్బంది, ఒళ్లు నొప్పులు, రాత్రిసమయంలో చెమట పట్టడం, రుచిని కోల్పోవడం, వాసన తగ్గిపోవడం వంటి లక్షణాలు ఒమిక్రాన్(Omicron) సోకిందనడానికి సంకేతమేనని వివరించారు. అంతేగాకుండా ఇటీవలి ఒమిక్రాన్ రోగుల్లో వాంతులు, వికారంగా ఉండటం, ఆకలిని కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు.

బ్రిటన్​లో రోజురోజుకూ పెరుగుతున్న కొవిడ్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని.. ఒమిక్రాన్ మహమ్మారి లక్షణాల జాబితాను అధికారికంగా ప్రకటించాలని ZOE కొవిడ్ స్టడీ యాప్‌ శాస్త్రవేత్తల్లో ఒకరైన డాక్టర్ క్లైర్ స్టీవ్స్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే.. 75 శాతం కొవిడ్ రోగుల్లో జలుబు లాంటి లక్షణాలు చాలా తక్కువగానే కనిపించినట్లు ఆమె పేర్కొన్నారు.

నివారణ చర్యలేంటి?
ఒమిక్రాన్ వేరియంట్ సోకకుండా ఉండేందుకు మాస్క్‌లు ధరించడమే ఉత్తమ మార్గం. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న ఒమిక్రాన్ వేరియంట్​ను పూర్తిస్థాయిలో అరికట్టాలంటే టీకాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Omicron

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు