Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు.. రక్తదానం చేయొచ్చా..? కీలక ఆదేశాలు జారీ చేసిన ఎన్బీటీసీ

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లు రక్తదానం చేయొచ్చా? చేయకూడదా? మద్యం తాగొచ్చా? తాగకూడదా? ధూమపానం చేయొచ్చా?.. ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉన్నాయి. తాజాగా వీటికి ఎన్బీటీసీ క్లారిటీనిచ్చింది.

  • Share this:
    ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అన్ని దేశాలు కరోనా కారణంగా అతలాకుతలం అయ్యాయి. పెద్ద సంఖ్యలో పౌరుల ప్రాణనష్టంతోపాటు ఆర్థికంగా కూడా దేశాలన్నీ నష్టపోయాయి. సుదీర్ఘ కాలం తర్వాత కరోనాకు కొన్ని దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సినేషన్ ను కనిపెట్టడంతో ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. భారత్ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మొదటగా, ఆ తర్వాత ఇతర విభాగాల వారికి, సామాన్య ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు ఎలాంటి పనులు చేయాలి? ఏమేం పనులు చేయకూడదన్నదానిపై ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి. తాజాగా రక్తదానం విషయంలో ఉన్న అనుమానానికి జాతీయ రక్తదాన మండలి (ఎన్బీటీసీ) క్లారటీ ఇచ్చింది.

    కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్న వాళ్లు రక్త దానం చేయొచ్చా? అనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది. అయితే ఈ విషయమై తాజాగా జాతీయ రక్తదాన మండలి కీలక ప్రతిపాదనలు చేసింది. రెండో డోసు తీసుకున్న 28 రోజలు వరకు రక్తదానం చేయొద్దని సూచనలు చేసింది. అంటే మొదటి డోసు తీసుకున్న 56 రోజుల వరకు రక్తదానం చేయడానికి వీల్లేదన్నమాట. రెండో డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత మాత్రమే వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు తయారవుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ గతంలోనే వెల్లడించింది.
    ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..

    కాగా, ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్న వాళ్లు మద్యం తాగొచ్చా? ధూమపానం చేయొచ్చా? అన్న వాటిపై కూడా పలు అనుమానాలు ఉన్నాయి. వాటికి కూడా కేంద్ర వైద్యాధికారులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు మద్యపానం చేసినా, ధూమపానం చేసినా టీకా ప్రభావం తగ్గుతోందనడానికి ఆధారాలు లేవని అధికారులు తేల్చిచెబుతున్నారు.
    ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్
    Published by:Hasaan Kandula
    First published: