హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Kadha Tea: కధా టీ తాగండి... వ్యాధి నిరోధక శక్తి పెంచుకోండి...

Kadha Tea: కధా టీ తాగండి... వ్యాధి నిరోధక శక్తి పెంచుకోండి...

కధా టీ తాగండి... వ్యాధి నిరోధక శక్తి పెంచుకోండి (File)

కధా టీ తాగండి... వ్యాధి నిరోధక శక్తి పెంచుకోండి (File)

Kadha Tea Health Benefits: ప్రధానమంత్రి ఆమధ్య తన ప్రసంగంలో... కధా పానీయం తాగమని దేశ ప్రజలకు సూచించారు. అది ఎలా తయారుచెయ్యాలో తెలుసుకుందాం.

  ఇది వరకు మనం ఎప్పుడూ వ్యాధి నిరోధక శక్తి గురించి పెద్దగా ఆలోచించి ఉండం. ఇప్పుడు మాత్రం... తెల్లారింది మొదలు... కరోనాకు బ్రేక్ వేసేందుకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా అన్నదానిపై అందరూ దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో... ప్రధానమంత్రి నరేంద్రమోదీ... తాను కధా (Kadha) పానీయం తాగుతానని దేశ ప్రజలకు చెప్పారు. దాంతో దేశ ప్రజలు అసలా కధా పానీయం అంటే ఏంటి? అది ఎలా ఇమ్యూనిటీని పెంచుతుంది? దాన్ని ఎలా తయారుచేసుకోవాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు సంధించుకున్నారు.

  కధా అనేది ఆయుర్వేద మూలికలతో తయారయ్యే టీ లాంటి ఔషధం లేదా పానీయం అనుకోవచ్చు. మూలికలు, సుగంద ధ్రవ్యాలతో దీన్ని తయారుచేసుకోవచ్చు. ఇందులో తులసి ఆకులు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండుద్రాక్ష, యాలకులతో తయారుచేస్తారు. వీటన్నింటిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలున్నాయి. వ్యాధుల్ని నయం చేసే శక్తి ఉంది. అందుకే రోజూ దీన్ని ఒక్కసారైనా తాగితే... రకరకాల వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మందులు వాడటం కంటే... మూలికలు వాడటం మేలన్న విషయం మనకు తెలిసిందే. ఈ డ్రింక్ తాగితే... ఇన్ఫెక్షన్లు రావు. జీర్ణక్రియ మెరుగవుతుంది. బాడీలో విష వ్యర్థాలు బయటకు పోతాయి. కరోనా వైరస్ లాంటి అలర్జీ సీజన్‌లో దీన్ని తాగితే ఎంతో మేలు జరుగుతుంది.

  కధా డ్రింక్ తయారీకి కావాల్సినవి :

  - తులసి ఆకులు - 1 టేబుల్ స్పూన్

  - యాలకులు - 1 టేబుల్ స్పూన్

  - దాల్చినచెక్క - 1 టేబుల్ స్పూన్

  - శొంఠి - 1 టేబుల్ స్పూన్

  - నల్ల మిరియాలు - 1 టేబుల్ స్పూన్

  - కొద్దిగా ఎండు ద్రాక్ష

  - నీరు - 2 నుంచి 3 కప్పులు

  - తేనె లేదా బెల్లం (ఇది ఆప్షనల్)

  - తాజా నిమ్మరసం

  కధా డ్రింక్ తయారీ విధానం :

  - ముందుగా నల్ల మిరియాలు, దాల్చిన చెక్కను మెత్తగా పొడిలా చేసుకోవాలి.

  - వాటర్‌ని గిన్నెలో పోసి... వేడి చెయ్యాలి.

  - తులసి ఆకులు వేసి... 5 నిమిషాలు సిమ్‌లో ఉంచాలి.

  - ఇప్పుడు నల్లమిరియాలు, దాల్చిన చెక్క పొడిని వెయ్యాలి. వెంటనే శొంఠి వేసి... నీరు ఉడకనివ్వాలి.

  - ఇప్పుడు నీరు సగానికి తగ్గిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకోవచ్చు.

  - చివర్లో తేనె లేదా బెల్లం వేసి... నిమ్మరసం వేసుకోవాలి.

  చక్కగా కలిపి... అలా అలా సిప్ చేస్తూ... తాగుతూ ఉంటే... మంచి టేస్ట్, సువాసనకి తోడు... ఆరోగ్యం కూడా.

  కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ... ఈ డ్రింక్‌ని రోజూ రెండుసార్లు తాగమని చెప్పింది. పైన చెప్పిన మోతాదులతో 2 టీలు (ఇద్దరు తాగేందుకు) తయారవుతాయి.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Ayurveda health tips, Coronavirus, Covid-19, HOME REMEDIES

  ఉత్తమ కథలు