Health : నిమ్మ-పుదీనా డ్రింక్... ఎండలకు బ్రేక్...

నిమ్మ-పుదీనా డ్రింక్... ఎండలకు బ్రేక్... (credit - twitter - 。◕Ya‿Ya◕。)

Lemon Mint Drink : ఎండాకాలంలో లిక్విడ్లు ఎక్కువగా తాగాలనిపించడం సహజం. అలాంటి వాటిలో... నిమ్మ-పుదీనా డ్రింక్ ఎంతో మేలు చేస్తుంది.

  • Share this:
    Lemon Mint Drink : జనరల్‌గా పుదీనా డ్రింక్‌ని రోడ్లపై అమ్ముతుంటారు. ఇప్పుడు లాక్‌డౌన్ అమల్లో ఉంది కాబట్టి... ఇలాంటివేవీ రోడ్లపై కనిపించట్లేదు. ఐతే... బయటి కంటే... ఇంట్లో మనమే సొంతంగా చక్కగా నిమ్మపండు-పుదీనా డ్రింక్ తయారుచేసుకొని తాగితే... ఆరోగ్యానికి ఎంతో మేలు. కరోనా వైరస్ ప్రబలుతున్న ఈ రోజుల్లో ఇలాంటి డ్రింక్ తాగితే... వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఐతే... దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి... ఎక్కువ కూలింగ్‌తో తాగితే ప్రమాదమే. అసలు కూలింగ్ లేకుండా తాగితే ఎంతో మంచిది. ఎందుకంటే... ఫ్రిజ్‌లో వచ్చేది సహజమైన కూలింగ్ కాదు. అది మన శరీరానికి సెట్ కాదు. కూల్ వాటర్ తాగినా చాలు... గొంతులో గరగర తప్పదు. అందుకే... వీలైనంతవరకూ కూలింగ్ లేకుండా చూసుకోండి. ఎండలో పనిచేసి బాగా అలసిపోయిన వారు... ఈ నిమ్మ-పుదీనా డ్రింక్ తాగితే... ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది.

    నిమ్మకాయ-పుదీనా జ్యూస్ (ఇద్దరి కోసం కావాల్సినవి) :
    లెమన్ డ్రింక్ (లిమ్కా లేదా స్ప్రైట్) : 500ml బాటిల్ 1
    తాజా పుదీనా ఆకులు - ఒక కప్పు
    తాజా నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు లేదా ఒక పెద్ద నిమ్మకాయ
    ఉప్పు - కొద్దిగా
    కొద్దిగా కూలింగ్ కోసం - (అరకప్పు ఐస్ క్యూబ్‌లు)

    నిమ్మకాయ-పుదీనా జ్యూస్ తయారీ విధానం : పుదీనా ఆకుల్ని... మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఇందుకోసం కొద్దిగా నీరు పోసినా పర్వాలేదు. ఆ తర్వాత మరో అరకప్పు నీరు పోసి... మరో 10 సెకండ్లపాటూ మిస్కీలో బ్లెండ్ చెయ్యాలి. దీన్ని వడగట్టి... ఆ వచ్చిన రసాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఎప్పుడు తాగాలనుకుంటారో అప్పుడు పుదీనా రసాన్ని ఫ్రిజ్ నుంచి బయటకు తీసి... అందులో నిమ్మరసం, ఉప్పు వేసి... బాగా కలపాలి.

    ఇప్పుడు ఐస్ ముక్కలు బయటకు తీసి... ముక్కలు చేసి... రెండు పొడవాటి గ్లాసుల్లో వెయ్యాలి. తర్వాత పుదీనా రసాన్ని రెండు గ్లాసుల్లో సమానంగా పొయ్యాలి. ఇప్పుడు లిమ్కా లేదా స్ప్రైట్ డ్రింకును ఆ జ్యూస్‌లో కలిపి... వెంటనే మీరు తాగండి లేదా... ఇంటికి వచ్చిన అతిథిని సోషల్ డిస్టాన్స్‌లో కూర్చోబెట్టి... మీ చేతులకు హ్యాండ్ శానిటైజర్ రాసుకొని అతిథికి ఇవ్వండి.

    ఈ పుదీనా జ్యూస్ తయారుచేసుకోవడం చాలా తేలిక. బాగా దాహం వేసినప్పుడు ఇది వెంటనే దప్పిక తీర్చుతుంది. సమ్మర్‌లో చాలా మంది ఈ జ్యూస్ తాగుతుంటారు. బయట ఎండ పెరిగేకొద్దీ... ఈ డ్రింక్ తాగితే వచ్చే మజా పెరుగుతూ ఉంటంది. ఇది రోజులో ఎప్పుడైనా తాగొచ్చు. ఎంతో ఆరోగ్యకరం. ఐతే... పైన చెప్పినట్లు ఎక్కువ కూలింగ్ లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇదే కాదు... ఏ డ్రింక్, వాటర్, సోడా, ఆల్కహాల్ (ఆరోగ్యానికి హానికరం) తాగినా... ఎక్కువ కూలింగ్ లేకుండా చూసుకోండి.
    Published by:Krishna Kumar N
    First published: