కరోనాకు చెక్... యాంటీబాడీస్ పెంచుకోవడానికి 7 చిట్కాలు

Corona Lockdown | Coronaupdate : యాంటీబాడీస్ మన శరీరంలో ఎంత ఎక్కువగా ఉంటే... కరోనా వైరస్‌ని అంత ఎక్కువగా చీల్చిచెండాడగలం.

news18-telugu
Updated: September 3, 2020, 3:20 AM IST
కరోనాకు చెక్... యాంటీబాడీస్ పెంచుకోవడానికి 7 చిట్కాలు
కరోనాకు చెక్... యాంటీబాడీస్ పెంచుకోవడానికి 7 చిట్కాలు...
  • Share this:
Corona Lockdown | Coronaupdate : ప్రపంచం మొత్తం ఇప్పుడు యాంటీబాడీస్ జపం చేస్తోంది. ఎందుకంటే... ఎవరి బాడీలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయో... వారు కరోనాను ఈజీగా జయిస్తున్నారు. అమెరికాలో ఆల్రెడీ కరోనాను జయించిన వారి నుంచి యాంటీ బాడీస్ సేకరించి... కరోనా పేషెంట్లకు ఎక్కిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... ఇప్పుడు కరోనాకు యాంటీబాడీసే వ్యాక్సిన్ లాంటివి. మన దేశంలోనూ యాంటీ బాడీస్‌ని పేషెంట్లకు ఎక్కిస్తున్నారు. ఆ విషయం అలా ఉంచితే... అసలీ యాంటీ బాడీస్ పెంచుకోవడం ఎలా? ఏం తింటే అవి కుప్పలుతెప్పలుగా పెరుగుతాయి? ఫటాఫట్ తెలుసుకుందాం.

1. ప్రోటీన్స్ ఉండే ఫుడ్ తినండి : యాంటీబాడీస్ (మంచి బ్యాక్టీరియా, మంచి సూక్ష్మక్రిములు లేదా వ్యాధి నిరోధక శక్తి) తయారయ్యేది ప్రోటీన్స్ తోనే. సో... మాంసం, చికెన్, గుడ్లు బాగా తినాలి. అంతేకాదు... జీడిపప్పు, బాదం వంటి వాటిలో ప్రోటీన్స్ బాగా ఉంటాయి. అవి తినేయాలి.

2. ఫ్రూట్స్ బాగా తినండి : విటమిన్ A, C, E ఉండే పండ్లు బాగా తినండి. పుల్లగా ఉండే పండ్లు తింటే... యాంటీబాడీస్ అద్భుతంగా పెరుగుతాయి. టమాటాలు, నిమ్మకాయలు, కమలాలు, బత్తాయిలు, ద్రాక్ష, పుచ్చకాయ, బొప్పాయి, బ్రకోలీ ఇవన్నీ తినేయాలి.

3. రోజూ 10 నిమిషాలు నడవండి : రోజూ ఓ అరగంటైనా నడిస్తే మంచిదే. కనీసం 10 నిమిషాలైనా నడవాలి. అలాగే... ఒళ్లంతా వంగేలా రకరకాల పనులు చేసుకోవాలి. ఆల్రెడీ లాక్‌డౌన్ కాబట్టి... మన పనులు మనమే చేసుకుంటాం కాబట్టి... శారీరక శ్రమ ఉంటుంది. ఐతే... కొంతమందిలా గంటలతరబడి జిమ్‌ ఎక్సర్‌సైజ్‌లు చెయ్యవద్దు. దాని వల్ల తెల్లరక్తకణాలకు సమస్య వస్తుంది.

4. విటమిన్ D పెంచుకోవాలి : ఉదయం సాయంత్రం వేళ సూర్యుడి ఎండ తగిలేలా చేసుకోండి. లేదా డాక్టర్ల సలహాతో విటమిన్ డి టాబ్లెట్లు వేసుకోండి.

5. ఒత్తిడి తగ్గించుకోండి : అదే పనిగా టెన్షన్ పడకండి. ఏ పనైనా అవుతుందిలే అని మనసులో గట్టిగా అనుకోండి. యోగా చెయ్యండి. ఇంట్లో పెంపుడు జంతువులతో కాసేపు ఆడుకోండి. కామెడీ బిట్లు చూడండి. మీకు ఇష్టమైన పని చెయ్యండి. ఇష్టమైన వాళ్లతో మాట్లాడండి... ఒత్తిడి పరారవుతుంది.

6. చక్కటి వంటలు వండుకోండి : కాస్త రేటు ఎక్కువైనా ఆలివ్ ఆయిల్ లేదా కనోలా (canola) ఆయిల్స్‌తో వంటలు వండుకోండి. వేపుళ్లు తగ్గించి... ఉడకబెట్టినవి, పులుసు వంటలు ఎక్కువ తినండి. మసాలాలు తగ్గించండి. మొలకలు తినండి. బాడీలో కొవ్వు రాకుండా చూసుకోండి. అప్పుడు యాంటీ బాడీస్... మీ బాడీలో భలే తయారవుతాయి.7. మద్యం మానేయండి : ఇలా చెబితే... చాలా మంది అదెలా కుదురుతుంది అంటుంటారు. కష్టమే కావచ్చేమోగానీ... మద్యం యాంటీ బాడీస్‌ని చంపేస్తుంది. పాపం అవి గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోతాయి. మనకు కరోనా వైరస్ రాకుండా అడ్డుకునే యాంటీ బాడీస్‌ని మనం కాపాడుకోకపోతే ఎలా. మనకు మేలు చేసేవాటిని మనం చంపేయడం న్యాయం కాదు. సో... మద్యం మానేయడమే మేలు. తప్పదు... పరిస్థితుల్ని బట్టీ... మనం అలవాట్లను మార్చుకోవాలి.
Published by: Krishna Kumar N
First published: September 3, 2020, 3:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading