N-95 మాస్కుల్ని మళ్లీ మళ్లీ వాడాలంటే ఇలా చెయ్యండి...

మాస్కుల ధరలు బాగా పెరిగాయి. మరి వాడిన వాటినే మళ్లీ మళ్లీ వాడటం ఎలాగో తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 4, 2020, 5:43 AM IST
N-95 మాస్కుల్ని మళ్లీ మళ్లీ వాడాలంటే ఇలా చెయ్యండి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్‌ని ఆపేందుకు N-95 మాస్క్ బాగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. ఐతే... ఆ మాస్క్ రేటు ఒక్కొక్కటీ రూ.400 దాకా ఉంది. మొదట్లో రూ.300 దాకా ఉన్న మాస్క్... డిమాండ్ పెరగడంతో... రేటు కూడా పెరిగిపోయింది. మామూలుగానైతే... N-95 మాస్క్ పనిచేసేది మాగ్జిమం 12 గంటలే. ఆ తర్వాత దాన్ని డస్ట్ బిన్‌లో పారేయాలి. ఈ లెక్కన రోజుకో N-95 మాస్క్ వాడాల్సి ఉంటుంది. అది ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి... శాస్త్రవేత్తలు... N-95 మాస్కును వాడిన తర్వాత పారేయకుండా మళ్లీ మళ్లీ ఎలా వాడాలో సూచిస్తున్నారు.

వేడి చేయడం ద్వారా N95 మాస్కును మళ్లీ మళ్లీ 50 సార్ల వరకూ వాడొచ్చని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన అధ్యయన వివరాల్ని ACS నానో జర్నల్‌లో పొందుపరిచారు. N95 మాస్కును రీ-యూజ్ చెయ్యడానికి రకరకాల పద్ధతుల్లో అంటే అల్ట్రావయలెట్ రేడియేషన్, బ్రీచ్ ట్రీట్‌మెంట్ వంటి ప్రయోగాలు చెయ్యగా... వేడి చేసే టెక్నిక్ ద్వారా మాత్రమే... కచ్చితమైన ఫలితం లభిస్తోందని తేలింది. వేడి చేయడం వల్ల.. మాస్కులో ఫిల్టరేషన్ సామర్ధ్యం దెబ్బతినకుండా ఉంటుందని చెబుతున్నారు.

ఇలా హీట్ చెయ్యాలి : N95 మాస్కును 85 డిగ్రీల వేడి దగ్గర 20 నిమిషాలపాటూ వేడి చెయ్యాలి. ఇందుకోసం ఓ గిన్నెలో నీరు పోసి... ఆ నీటిలో... మాస్కును ఉంచి... ఉడికించాలని చెబుతున్నారు. ఉడికిన తర్వాత మాస్కును బయటకు తీసి... ఆరిపోయేవరకూ అలా వదిలేయాలని చెబుతున్నారు. ఐతే... ఇలాంటి ప్రయోగం చేసే ముందు ఓసారి డాక్టర్ సలహా తీసుకొని పాటించాలని చెబుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: September 4, 2020, 5:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading