Corona virus: ఒబెసిటీ ఉన్నవారిలో ప్రమాదకరంగా మారుతున్న కరోనా...పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ఒబెసిటీ ఉన్న కరోనా రోగులకు వ్యాధి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయని పరిశోధనలు వెల్లడించాయి. ఇలాంటి వారికి కరోనా ట్రీట్‌మెంట్‌లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సెకండ్‌ వేవ్‌లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది.

  • Share this:
కరోనా కాలంలో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం చాలా అవసరం అని చెబుతున్నారు వైద్యులు. భారీ పొట్ట, ఒబెసిటీ ఉన్న కరోనా రోగులకు వ్యాధి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయని పరిశోధనలు వెల్లడించాయి. ఇలాంటి వారికి కరోనా ట్రీట్‌మెంట్‌లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సెకండ్‌ వేవ్‌లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ఒబెసిటీ ఉన్న వాళ్లు కరోనా ట్రీట్‌మెంట్‌ సమయంలో చాలా ఆలస్యంగా స్పందిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. వీరికి హయ్యర్‌ వెంటిలేషన్‌ ప్రజర్‌ అవసరమవుతోంది. ఒబెసిటీ ఉన్న వ్యక్తులతోపాటు.. ఇటీవలకాలంలో పొట్ట పెరిగిన యువత కూడా కరోనా చికిత్స సమయంలో ఇబ్బందిపడుతున్నారట. సాధారణ బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) ఉండి పొట్ట ఉన్న వ్యక్తుల కొంటే, సన్నగా ఉన్నా పొట్ట లేని వారు కరోనా నుంచి త్వరగా కోలుకుంటున్నారట. కరోనా మూడో వేవ్‌ పొంచి ఉందంటూ వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న ఈ సమయంలో ఫిట్‌నెస్‌పై ప్రజలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. కరోనా నుండి బయటపడాలంటే, కరోనా బారిన పడినా వేగంగా కోలుకోవాలంటే ఫిట్‌గా ఉండటం చాలా అవసరం అని చెబుతున్నారు.

అబ్‌డామన్‌ ప్రజర్‌ ఎక్కువగా ఉండటం వల్ల లంగ్‌ కెపాసిటీలో తగ్గుదల ఉంటుందని కొందరు పరిశోధకులు తెలిపారు. శరీరంలో ఛాతి, అబ్‌డామిన్‌పై పై కొవ్వు పెరగిపోతున్నప్పుడు లగ్స్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దాని వల్ల అవి కంప్రెస్‌ అయిపోతాయి. దీంతో లంగ్స్‌ పని చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఒబెసిటీ ఉన్న పేషంట్లను వెంటిలేటర్‌పై ఉంచినప్పుడు కూడా ఇబ్బందులు వస్తాయి. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల ఇన్‌ఫ్లమెటరీ మార్కర్ల అవసరం కూడా ఎక్కువవుతుంది. అబ్‌డామన్‌ ఫ్లాట్‌గా ఉండేటప్పుడు కొవిడ్‌ పేషంట్ల రికవరీ కూడా వేగంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

కరోనా సోకినప్పుడు లంగ్స్‌ ఎక్స్‌పాన్షన్‌ అనేది కీలకం. ఒబెసిటీ పేషంట్లలో లంగ్స్‌ ఎక్స్‌పాన్షన్‌ దగ్గర సమస్యలు తలెత్తుతాయి. దీంతో రికవరీ అప్పుడు ఫిజియోథెరపీ అవసరం కూడా పడతుంది. దీంతోపాటు ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గినప్పుడు ప్రోనింగ్‌ చేయాల్సి ఉంటుందనే విషయం తెలిసిందే. అప్పుడు కూడా ఒబెసిటీ ఇబ్బంది పెడుతుంది. ఆక్సిజన్‌ మాస్క్‌లు సైజు నుండి, పొట్ట కింద పెట్టుకోవాల్సిన దిండ్లు ఇలా... అన్ని చోట్లా ఇబ్బందులు పడే అవకాశం ఉందని వైద్యులు ఒబెసిటీ ఉన్నవాళ్లకు సూచిస్తున్నారు.

తొలి వేవ్‌ సమయంలోనూ ఒబెసిటీ ఉన్నవాళ్లు ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది. దాంతోపాటు లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్లలో ఎక్కువమంది ఉండిపోవడంతో బరువు పెరిగిపోయారు. దాంతోపాటు అదేపనిగా తినడం వల్ల ఒబెసిటీ వచ్చేసింది. సాధారణంగా ఒబెసిటీ పేషంట్లు వైద్యానికి స్పందించరు. కరోనా విషయంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి వ్యాక్సిన్‌ అవకాశం ఉన్నప్పుడు తీసుకొని, ఎక్సర్‌సైజ్‌లు చేయడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. థర్డ్‌ వేవ్‌ రాకూడదని మనందరం కోరుకుంటున్నాం... ఒకవేళ వచ్చినా మన ఫిట్‌గా ఉంటే ఇబ్బందులు ఉండవు అని వైద్యులు చెబుతున్నారు. దీని కోసం ఎక్సర్‌సైజ్‌లు, సరైన ఆహారం, మంచి నిద్ర చాలా అవసరం.
Published by:Krishna Adithya
First published: