క్యారీ బ్యాగ్‌కి డబ్బు అడిగితే ఈ నెంబర్‌కి కంప్లైంట్ చేయండి..

క్యారీ బ్యాగ్‌కి డబ్బు వసూలు చేస్తే ఫిర్యాదు చేయండి..

లోగో ఉన్న క్యారీ బ్యాగ్ ఇస్తే దానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని రాష్ట్ర వినియోగదారుల సమాచార వివాద పరిష్కార కేంద్రం తెలిపింది. లోగో లేని క్యారీ బ్యాగ్ అయితే విక్రయించుకోవచ్చని తెలిపింది.

  • Share this:
    మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు..బిల్లింగ్ కౌంటర్‌లో క్యారీ బ్యాగ్ కావాలని అడుగుతారు. కావాలంటే వాటికి ఎక్స్‌ట్రా మనీని చార్జ్ చేస్తారు. ఇకపై ఇలా కుదరదు. లోగో ఉన్న క్యారీ బ్యాగ్ ఇస్తే దానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని రాష్ట్ర వినియోగదారుల సమాచార వివాద పరిష్కార కేంద్రం తెలిపింది. లోగో లేని క్యారీ బ్యాగ్ అయితే విక్రయించుకోవచ్చని తెలిపింది.

    ఇకనుంచి ఎవరైనా క్యారీ బ్యాగ్‌కి డబ్బులు వసూలు చేస్తే కస్టమర్లు 180042500333 నెంబర్‌కి ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు.

    ఈ మధ్యకాలంలో చాలామంది వినియోగదారులు క్యారీబ్యాగ్స్‌కి ఎక్ట్స్‌ట్రా మనీ తీసుకోవడంతో ఫిర్యాదు చేయడంతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
    First published: