ఫస్ట్ నైట్లో రక్తస్రావం అయితేనే కన్యనా..? ఇందులో శాస్త్రీయత ఎంత..?

యువతులు, మహిళలు తొలిసారి శృంగారంలో పాల్గొనే సమయంలో రక్తస్రావం అయితేనే వారు కన్యలనీ, లేకుంటే వారికి కన్యత్వం లేదనే అపోహలు మన సమాజంలో ఉన్నాయి. మరి ఇందులో నిజమెంత..?

news18
Updated: November 6, 2020, 7:53 AM IST
ఫస్ట్ నైట్లో రక్తస్రావం అయితేనే కన్యనా..? ఇందులో శాస్త్రీయత ఎంత..?
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 6, 2020, 7:53 AM IST
  • Share this:
పూర్వకాలంలో పెళ్లి అయినతర్వాత మొదటిరాత్రి శృంగార సమయంలో.. భార్య కన్యత్వాన్ని రుజువు చేసుకోవాల్సిందే. ఆ క్రమంలో సంభోగ సమయంలో రక్తం కారితేనే ఆమె కన్య అనీ.. లేకుంటే ఆమె ఇదివరకే ఎవరితోనో గడిపిందనే వాదన ఉండేది. ఇదే కారణంతో ఆ యువతిని స్వంతింట్లో విడిచిపెట్టిన సందర్భాలూ కోకొల్లలు. కాలం మారింది. ఆధునిక సమాజంలో శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సైన్స్ అందనంత ఎత్తుకు వెళ్లుతున్నది. కానీ ఈ అపోహ మాత్రం మన మైండ్ లో చెక్కు చెదరకుండా ఉంది. ఇది ఎంత వరకు నిజం..? ఇందులో శాస్త్రీయత ఎంత అనేదానిపై చాలా పరిశోధనలు జరిగాయి.

పెళ్లి రాత్రుల్లో మహిళలు తమ కన్యత్వాన్ని నిరూపించుకోవడంలో ఉపయోగపడేందుకు గానూ తమ క్యాప్సుల్స్ పనికొస్తాయని ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ప్రచురించింది. ఈ అమ్మకాలపై సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఈ విషయం మళ్లీ చర్చనీయాంశమైంది. అయితే ఇదే విషయమై గైనకాలజిస్టులు స్పందిస్తూ.. సంభోగానికి, కన్నెత్వానికి సంబంధం లేదని చెబుతున్నారు. ఇది అశాస్త్రీయమని అంటున్నారు. మహిళలలో మూత్రాశయంలో ఉండే హైమెన్ అనే సన్నని పొర చిరిగినపుడు రక్తం కారుతుంది. అది సంభోగ సమయంలోనే జరగాలని ఏమీ లేదని వారు అంటున్నారు. శారీరక వ్యాయామాలు చేసినపుడో.. వేగంగా పరిగెత్తినపుడో ఇది చిరిగిపోయే అవకాశం ఉందని వారు తెలిపారు. బాలికలు, యువతులు.. స్కిప్పింగ్ (తాడాట) ఆడే క్రమంలో చాలా మందికి ఈ కన్నె పొర చిరిగిపోతుందని పేర్కొన్నారు.

ఇదే అంశంపై హైదరాబాద్ కు చెందిన పలువురు గైనకాలజిస్టులు స్పందిస్తూ.. ‘మహిళలు తమ మొదటి సంభోగ సమయంలోనే రక్తస్రావం అవుతారనే ఆలోచన అశాస్త్రీయమైనది. స్త్రీల మూత్రాశయంలో హైమెన్ తగినంత సరళంగా, వెడెల్పుగా ఉంటే.. వారు ఫస్ట్ టైం సెక్స్ చేస్తున్నపుడు రక్తస్రావం కాకపోవచ్చు’అని అన్నారు. హైమెన్ విస్తరించగలదు గానీ చిరిగిపోకపోవచ్చని కూడా కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. శృంగార సమయంలో ఆ స్త్రీ రక్తస్రావం కాలేదని.. ఆమె కన్యత్వాన్ని నిందించడం దారుణమైన విషయమని చెప్పారు.
Published by: Srinivas Munigala
First published: November 6, 2020, 7:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading