జ్వరం వచ్చినా, జలుబు చేసినా.. ఓ యాంటీ బయాటిక్ గోళీ మింగేస్తే చాలు అనుకుంటాం. వ్యాధి తీవ్రత ఎంతో తెలుసుకోకుండానే ఇష్టం వచ్చినట్లు హై డోసేజ్‌లో మందులు వేసుకుంటున్నారు. మితిమీరిన మోతాదులో యాంటీ బయాటిక్స్‌ను వాడటం వల్ల రోగాలు తగ్గడం కాదు.. కొత్త రోగాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచంలో యాంటీ బయాటిక్స్ వాడకంలో మన దేశమే తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత చైనా, అమెరికా ఉన్నాయి. ప్రపంచంలోనే బాక్టీరియా సంబంధ వ్యాధులు ఎక్కువగా మన దేశంలోనే ఉన్నాయని, ఆ రోగాలను తట్టుకోవడానికి యాంటీ బయాటిక్స్ వాడుతున్నామని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అయితే, వాటి వాడకం ఎక్కువైతే గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
యాంటీ బయాటిక్స్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకునేందుకు అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు పరీక్షలు నిర్వహించగా సిప్రోప్లోక్సాసిన్(సిప్రో) వంటి ఫ్లోరోక్వినోలోన్ యాంటీ బయాటిక్స్, ఇతర యాంటీ బయాటిక్స్ వల్ల 2.4 రెట్లు ఎక్కువగా హృద్రోగాలు వస్తున్నట్లు తేలిందట. వీటి వల్ల గుండె నుంచి ముందుకు ప్రవహించాల్సిన రక్తం.. వెనక్కి వచ్చే ముప్పు ఉందని వెల్లడైందట. 12వేల మందిపై అధ్యయనం చేయగా 30 రోజుల కంటే ఎక్కువ కాలం యాంటీ బయాటిక్స్ తీసుకునే వారు ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.