నూడుల్స్‌ని తింటున్నారా.. బరువు పెరగడం ఖాయం..

ప్రతీకాత్మక చిత్రం

క్షణాల్లో తయారయ్యే నూడుల్స్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఇష్టంగా తింటారు. అయితే, వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో పాటు బరువు కూడా పెరుగుతారని తేలింది.

  • Share this:
చాలామంది నూడుల్స్‌ని ఎంతో ఇష్టంగా తింటారు. ఉప్పు, కారం, వేడివేడిగా ఉండే నూడుల్స్ చూడగానే చాలామందికి నోరూరిపోతుంటుంది. అయితే, వీటిని తినడం వల్ల బరువు పెరుగుతారని తాజా పరిశోధనల్లో తేలింది.

సాధారణంగా ట్రాన్స్ అనే కొవ్వు పదార్థంతో నూడుల్స్‌ని తయారు చేస్తారట. ఇలా తయారైన నూడుల్స్‌ని చాలావరకూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు ఎక్కువగా ఉప్పు, కారం వేసి, ఏవేవో మిశ్రమాలు చేసి తయారుచేస్తారు. ఇంట్లో కూడా మనం ఆ పద్ధతి ద్వారానే తయారు చేసుకుంటాం. ఇలా తయారైన నూడుల్స్‌ని తినడం వల్ల ఒంట్లో కొవ్వుశాతం పెరిగుతుంది. తద్వారా త్వరగా బరువు పెరుగుతారని తేలింది.

సో.. బరువు తగ్గాలనుకునేవారు నూడుల్స్‌ని ఎంత తక్కువగా తింటే అంత మంచిది.
First published: