అక్కడ అంతే.. ఎవరినైనా ప్రేమించొచ్చు.. కలిసి ఉండొచ్చు..

ప్రేమ ఆస్తులు కోరుకోదు.. అంతస్తులు కోరుకోదు.. ఇది ప్రేమించేవారికే తెలుసు.. అక్కడి ఊరి తల్లిదండ్రులు ఈ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు. అందుకే.. వయసుకు వచ్చిన ఆడపిల్లలు.. ప్రేమ, పెళ్లి విషయంలో తీసుకునే నిర్ణయానికి అడ్డుచెప్పరు..

Amala Ravula | news18-telugu
Updated: February 10, 2019, 6:12 PM IST
అక్కడ అంతే.. ఎవరినైనా ప్రేమించొచ్చు.. కలిసి ఉండొచ్చు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 10, 2019, 6:12 PM IST
ఈ మధ్యకాలంలో పరవు హత్యలు ఎక్కువైపోయాయి. అమ్మాయి లేదా అబ్బాయి తమని కాదని వేరే కులం, ఆస్తి తక్కువున్నవాళ్లని ప్రేమించి పెళ్లిచేసుకుందని చంపడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ, కంబోడియాలో అలా జరుగదు. ముఖ్యంగా క్రైయంగ్ తెగ ప్రజలు.. ఈడొచ్చిన ఆడపిల్లలకి ‘మీకు ఆలోచించే వయసొచ్చింది.. మీ మనసుకు నచ్చివారు ఎవరైనా సరే.. వారిని ఇష్టపడు.. ప్రేమించు.. ఇంకా కావాలంటే సహజీవనం చేసిన నీ ఇష్టం.. సరైన తోడు దొరికితే.. నచ్చితే చెప్పు పెళ్లి చేస్తాం’ అని చెబుతారట..
అయితే, ఇదంతా ఏంటని అడిగితే మాత్రం.. అక్కడి వారు ఒకటే చెబుతారు..‘పెళ్లికి ముందే కలిసి మాట్లాడే అవకాశం వల్ల పిల్లలకి సరైన భాగస్వామి దొరుకుతారు.. అంతా అయిపోయాక బాధపడే బదులు ముందే ఒకరిగురించి తెలుసుకోవడం వల్ల బంధం కలకాలం నిలిచివుంటుంది’ అని చెబుతారు.

తమ దగ్గరికి వచ్చే అబ్బాయిలతో స్నేహం, ప్రేమ, సహజీవనం అనేది వారి వ్యక్తిగతం.. కొన్ని రోజులు స్నేహం చేశాక నచ్చకపోతే వారిని తిరస్కరించే అధికారం ఉంటుంది. నిజంగానే అక్కడ విడాకులు తీసుకునే వారి శాతం కూడా తక్కువే..

ఇదంతా చదివిన యూత్.. అక్కడికి వెళ్లాలనుకుంటున్నారా ఏంటి..
First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...