హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Milk And Honey : చల్లని పాలల్లో తేనే కలిపి తాగితే బోలెడు ప్రయోజనాలు..బరువు కూడా తగ్గొచ్చు

Milk And Honey : చల్లని పాలల్లో తేనే కలిపి తాగితే బోలెడు ప్రయోజనాలు..బరువు కూడా తగ్గొచ్చు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Milk And Honey : పాలు-తేనె(Milk-Honey) ఒక అత్యుతమ కలయిక, దీనిని తరచుగా పానీయాలు, డెజర్ట్‌లలో ఉపయోగిస్తారు. ఈ రెండింటిలోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

Milk And Honey : పాలు-తేనె(Milk-Honey) ఒక అత్యుతమ కలయిక, దీనిని తరచుగా పానీయాలు, డెజర్ట్‌లలో ఉపయోగిస్తారు. ఈ రెండింటిలోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు కూడా ఉపయోగపడతాయి. పాలు- తేనె శతాబ్దాలుగా వినియోగించబడుతున్నాయి. ప్రస్తుతం తక్షణ శక్తి (Instant Energy)కోసం తేనె(Honey), పాలు(Milk) వాడుతున్నారు. తేనె, పాలు రెండూ వేర్వేరు ప్రభావాలను కలిగి ఉంటాయి, ఇవి నొప్పి, అల్సర్, గ్యాస్ మొదలైన వాటికి ఔషధంగా పనిచేస్తాయి. ముఖ్యంగా చల్లటి పాలు, తేనె కలిపి తాగితే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఈ కలయిక మీ మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పాలు, తేనె కలిపి తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

నిద్ర నాణ్యత

నిద్ర నాణ్యతను(Quality Sleep)మెరుగుపరచడానికి, చాలా మంది నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తేనెతో కలిపి తాగుతారు. నిజానికి, ఈ కలయిక మంచి నిద్రలో(Good Sleep)సహాయపడుతుంది.

ఎముకల బలం

ఎముకల ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషించే కాల్షియం పాలలో పుష్కలంగా ఉంటుంది. తేనెతో కలిపిన పాలు ఎముకల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Aloe Vera Oil : చర్మం,జుట్టుకి కలబంద ఆయిల్ తో బోలెడు ప్రయోజనాలు..దీన్ని ఎలా ఉపయోగించాలో చూడండి

గుండె ఆరోగ్యం మెరుగ్గా

గుండె ఆరోగ్యం విషయానికి వస్తే, పాలు- తేనెకు ప్రాధాన్యత ఇస్తారు. పాలు ముఖ్యంగా హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది, ఇది గుండె ధమనుల నుండి ఫలకాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే పాలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తపోటు(Blood Presaure)స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Reverse hair washing : తలస్నానం చేస్తున్నారా?రివర్స్ హెయిర్ వాష్ తో బోలెడు లాభాలు

కడుపు కోసం ప్రయోజనకరమైన

గ్యాస్ లేదా అసిడిటీ సమస్య ఉన్నవారు చల్లని పాలలో తేనె కలిపి తాగాలి. చల్లని పాలు, తేనె కడుపులోని వేడిని తగ్గించడంలో సహాయపడతాయి. కడుపులోని అల్సర్‌లను తగ్గించే అనేక ఔషధ గుణాలు తేనెలో ఉన్నాయి. పాలు, తేనె కలిపి తాగితే మలబద్ధకం కూడా దూరమవుతుంది.

తక్షణ శక్తిని(Instant Enery)

జిమ్‌కి వెళ్లేవారు లేదా వర్కవుట్‌లు చేసేవారు పాలు, తేనెను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఈ కలయిక శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు కండరాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది

పాలు, తేనె తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఇది శరీరం యొక్క జీవక్రియను వేగవంతం చేస్తుంది, త్వరగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. చాలా మంది బరువు తగ్గే సమయంలో తీపి, చక్కెర తీసుకోవడం మానేసినప్పటికీ, తేనెను ఉపయోగించడం ద్వారా మీ తీపి తినాలన్న కోరిక కూడా తీరుతుంది.

First published:

Tags: Health benefits, Honey, MILK, Weight loss tips

ఉత్తమ కథలు