హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Chapped Lips Tips: చలికి పెదాలు పగిలిపోతున్నాయా.. ఈ చిన్న చిట్కాలతో బయటపడొచ్చు.. అంతే కాకుండా..

Chapped Lips Tips: చలికి పెదాలు పగిలిపోతున్నాయా.. ఈ చిన్న చిట్కాలతో బయటపడొచ్చు.. అంతే కాకుండా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chapped Lips Tips: చలికాలంలో పెదాలు పగులుతున్నాయి. ఏమి తిన్నా.. తాగిన ఇబ్బందులకు గురవుతున్నారా.. అయితే ఇక్కడ చెప్పే హోం చిట్కాలను పాటించండి. పెదాలు పగలడం ఆగడంతో పాటు ఎంతో అందంగా కూడా తయారు అవుతాయి. వివరాల్లోకి వెళ్తే..

  ప్రతీ సంవత్సరం మూడు కాలాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ చలికాలంలో మాత్రం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారుతోంది. ఈ కాలంలోనే ఎక్కువగా చర్మ సమస్యలు మొదలవుతుంటాయి. చలి కారణంగా వాతావరణంలో పెను మార్పులు రావడంతో అది చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. చర్మానికి వచ్చే సమస్యల్లో ముఖ్యమైనది పెదాలు పొడిబారిపోవడం. ఇలా పెదాలు పగిలిపోవడంతో అందులో ఉండే సున్నితమైన కండరాలు తట్టుకోలేవు. ఇలా ఉంటే తినే సమయంలో కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటాం. తడి ఆరిపోతుండటంతో నాలుకతో పెదాలను ఆడిస్తూ వాటిని తడి చేస్తూ ఉంటాం. ఇది అసంకల్పిత ప్రతీకార చర్యలో భాగంగా జరిగిపోతుంటుంది. ఇలా చేయడం మంచిదే.. ఎందుకంటే.. మన నోట్లోని లాలాజలం మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.

  Best Foods For Teeth: మెరిసే దంతాల కోసం చూస్తున్నారా.. అయితే, మీ రోజూవారి ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి..


  పెదవులు ఆ లాలాజలాన్ని తీసుకుంటాయి. పగిలిన పెదవులు తిరిగి అతుక్కుంటాయి. ఐతే... ఇది తాత్కాలికమే. కంటిన్యూగా ఇలాగే జరిగితే... పెదవులు అందవిహీనంగా మారతాయి. పెదాలపై ఎగుడు.. దిగుడుగా కనపడుతుంటాయి. అంతే కాకుండా.. వీటి నుండి సంరక్షణ కోసం లిప్ బామ్ ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటివి కాకుండా నేచురల్ గా పెదాలు పొడిబారడం, పగలడం వంటి సమస్యలన్ను ఎలా తగ్గించుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. కొంత చక్కెర తీసుకొని దానిలో కొబ్బరి నూనెతో కలపాలి. ఈ రెండింటిన బాగా కలిపి పొడిలాగా చేసి.. పెదవులకు పట్టించాలి. ఇలాచేస్తే ఉపశమనం పొందొచ్చు.

  Vastu Tips: మీ ఇంట్లో ఆ విగ్రహం ఉంటే.. అన్నీ శుభాలే.. వివరాలిలా..


  అంతే కాకుండా రాత్రి పడుకునేటప్పుడు పెట్రోలియం జెల్లీ లేదా కొబ్బరి నూనె లేదా నెయ్యి లేదా ఫ్రెష్ క్రీమ్ వంటి ఏదైనా పెదవులకు రాసుకోండి. అది బండబారిన పెదవుల్ని సున్నితంగా చేస్తుంది. మరో చిట్కాలో తేనె, నిమ్మరసం, దూది ఉండతో అద్ది పెదాలకు పట్టించాలి. ఇలా రోజూ చేస్తే పగిలిన పెదాలు అందంగా తయారవుతాయి. దీనిని బ్లీచింగ్ మిక్సర్ అంటారు. బీట్ రూట్ జ్యూస్, కలబంద రసం, కొబ్బరి నూనెను ఒక మిశ్రమంలో కలపాలి. తర్వాత పెదాలకు పట్టిస్తే.. మంచి ఫలితం ఉంటుంది. రోజూ పడుకునే సమయంలో రాత్రిళ్లు చేయాలి.

  Peddapalli: ఆమె అక్కడ వంట ఎందుకు చేస్తుందో తెలుసా.. ఆమె ఇంట్లో జరిగే ఘటనలతో ఊరంతా ఆశ్చర్యం..


  పగిలిన పెదాలకి, ఎండిపోయిన పెదాలకి ఇదే చక్కటి మందులా పనిచేస్తుంది. అంతే కాకుండా తినే ఆహారంలో ఎక్కువగా సీ, ఈ విడమిన్లు ఉండే విధంగా చూసుకోవాలి. శరీరం వేడి చేయకుండా ఎక్కువగా ఆకుకూరలను తినాలి. ఈ సీజన్‌లో వచ్చే పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా తినాలి.

  Published by:Veera Babu
  First published:

  Tags: Health, Health benifits

  ఉత్తమ కథలు