Health Benefits of Coconut Milk : కొబ్బరి కాయ ప్రత్యేకమైనది. అందులో ప్రతీదీ మనకు ప్రయోజనం కలిగించేదే. ముఖ్యంగా మన చర్మం, జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది. లేత కొబ్బరి బోండాల్లో నీరే ఎక్కువగా ఉంటుంది. ముదిరిన కొబ్బరి కాయల్లో కొబ్బరి పాలు లభిస్తాయి. కొబ్బరి పాలలో శరీరంలో కరిగిపోయే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే ఇందులో బ్యాక్టీరియాను ఎదుర్కొనే గుణాలుంటాయి. అంతేకాదు విటమిన్ సీ, ఈ కూడా వీటిలో ఉంటాయి. వీటి వల్ల మన చర్మం కాంతివంతంగా, కోమలంగా మారుతుంది. కొబ్బరి పాలలో ప్రోటీన్స్, బి గ్రూప్ విటమిన్స్‌తోపాటూ... రాగి, సెలెనియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పసర్ ఉంటాయి. ఇవి చర్మాన్ని కోమలంగా చెయ్యడమే కాదు... జుట్టు పెరిగేలా చేస్తాయి. జుట్టు రాలిపోవడాన్ని అరికడతాయి. కొబ్బరి పాల ప్రయోజనం పొందేందుకు ఇలా చెయ్యండి.
కొబ్బరి పాలతో హెయిర్ స్పా : పొడిబారిన, పాడైపోయిన జుట్టుకి కొబ్బరి పాలను పట్టిస్తే, అవి జుట్టుకు తిరిగి ప్రాణం వచ్చేలా చేస్తాయి. జుట్టు సాఫ్ట్‌గా మారుతుంది. చిక్కులు తొలగిపోతాయి. జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి. అలాగే... వెంట్రుకలు చిట్లిపోయే సమస్య తొలగిపోతుంది. రకరకాల రసాయనాలతో మీ జుట్టు దెబ్బతిని ఉంటే... కొబ్బరి పాలు మీకు చక్కగా ఉపయోగపడతాయి.
తాజా కొబ్బరి పాలను జుట్టు కుదుళ్లపై పోసుకొని... మసాజ్ చేసుకోవాలి. జుట్చు ఎంత పొడవు ఉంటే... అంతవరకూ కొబ్బరి పాలు తగిలేలా చెయ్యాలి. ఓ అరగంటపాటూ అలా వదిలేయాలి. ఓ టవల్‌ని గోరు వెచ్చటి నీటిలో ముంచి... బయటకు తీసి... నీటిని పిండేసి... దాన్ని తలచుట్టూ టర్బైన్ (తలపాగా)లాగా చుట్టుకోవాలి. అలా ఐదు నిమిషాలు ఉంచాలి. మళ్లీ టవల్ తీసి... గోరువెచ్చటి నీటిలో ముంచి... బయటకు తీసి.. నీటిని పిండేసి... మళ్లీ తలచుట్టూ తలపాగాలా చుట్టుకోవాలి. ఇలా నాలుగైదు సార్లు చెయ్యాలి. ఈ వేడి టవల్ వల్ల... కొబ్బరి పాలు... జుట్టులోని చుండ్రును... కొబ్బరి పాలు లాక్కునేలా చేస్తుంది. ఆ తర్వాత... నీటితో జుట్టును కడిగేసుకోవాలి. ఫలితంగా సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్ మీ సొంతం అవుతుంది.
జుట్టుకి కండీషనర్‌లా కూడా కొబ్బరి పాలు ఉపయోగపడతాయి. షాంపూతో తల స్నానం చేశాక, కొద్దిగా కొబ్బరి పాలను... జుట్టుకి పట్టించాలి. రెండు నిమిషాలు అలా వదిలెయ్యాలి. తర్వాత నీటితో కడిగేసుకోవాలి.
రెండు టీస్పూన్ల కొబ్బరి నూనె, ఓ టీస్పూన్ కొబ్బరి పాలను కలిపి... మొహంపై నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత దూదితో తుడిచేసుకోవాలి. మీ చర్మం జిడ్డుగా, మచ్చలు, మొటిమలతో ఉంటే... మీరు కూడా కొబ్బరి పాలను వాడవచ్చు. ఇందులో బ్యాక్టీరియాను చంపే గుణం ఉంటుంది.
ముసలితనం రాకుండా, ముడతలు రాకుండా, ఏజ్ స్పాట్స్ కనిపించకుండా చెయ్యడంలో కొబ్బరి పాలు బాగా ఉపయోగపడతాయి. అందువల్లే ఫేస్ మాస్క్‌లా కొబ్బరి పాలను వాడుతున్నారు. బాదం పొడి, కొబ్బరి పాలు, తేనె కలిపి ముఖానికి పేస్టులా పట్టించవచ్చు. కళ్లు, పెదవులకు మాత్రం అవసరం లేదు. 20 నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకుంటే... ముఖం కళకళలాడుతుుంది.
నొప్పి, మంటలు ఉన్న చర్మంపై కొబ్బరి పాలు రాసుకుంటే... వేడి తగ్గుతుంది. ఎంతో హాయిని ఇస్తుంది. ఎందుకంటే కొబ్బరి పాలలో వేడిని తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health Tips, Life Style, Tips For Women