బొద్దింక పాలు చాలా మంచివట... త్వరలోనే వాటికి ఫుల్లు డిమాండ్...

ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్‌‌సెల్ బయాలజీ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్ పరిశోధనలో వెల్లడైన ఆశ్చర్యకర విషయాలు... త్వరలో కాక్‌రోచ్‌లకు ఫుల్లు డిమాండ్...

Shiva Kumar Addula | news18
Updated: February 17, 2019, 2:35 PM IST
బొద్దింక పాలు చాలా మంచివట... త్వరలోనే వాటికి ఫుల్లు డిమాండ్...
నమూనా చిత్రం
  • News18
  • Last Updated: February 17, 2019, 2:35 PM IST
  • Share this:
బొద్దింకలంటే కొందరికి భయం.. మరికొందరికి అసహ్యం..! అవి కనిపిస్తేనే చాలు.. చంపేసి బయట పడేస్తాం. మళ్లీ బొద్దింకలు రాకుండా మందులు చల్లుతాం. అలాంటి బొద్దింకలను ఆహారంగా ఎవరైనా తీసుకుంటారా? అసలు ఊహించుకుంటేనే వాంతొచ్చినంత పనవుతుంది. కానీ భవిష్యత్ లో వాటినీ ఆహారంగా తీసుకునే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే బొద్దింక మంచి పౌష్టికాహారమట.

బొద్దింకలకు సంబంధించిన కీలక విషయాలను బెంగళూరుకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్‌‌సెల్ బయాలజీ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. బొద్దింకలో పోషక విలువల శాతం ఎక్కువగా  ఉందని.. రాబోయే రోజుల్లో బొద్దింకలకు డిమాండ్ పెరగనుందని తెలిపారు. మామూలు పాలకంటే బొద్దింకలను ఉపయోగించి తయారు చేసిన పాలలో నాలుగు రెట్లు ఎక్కువ పోషకవిలువలు ఉన్నాయని.. కొన్నేళ్ల తర్వాత బొద్దింక పాలు సూపర్‌ఫుడ్‌గా మారనుందని చెప్శాపారు.

బొద్దింక జాతిలో ఒకటైన పసిఫిక్‌ బీటిల్‌ కాక్రూచ్‌ మామూలు బొద్దింకల్లా గుడ్లు పెట్టకుండా పిల్లల్ని కంటాయి. ఆస్ట్రేలియాలో ఉండే ఈ బొద్దింకలు అధిక పోషక విలువలు కలిగి ఉంటాయని పరిశోధనలో తేలింది. వీటిని కేవలం పాలలోనే కాదు ఐస్ క్రీమ్స్  తయారీలోనూ వాడుతున్నారు. ఇప్పటికే  దక్షిణాఫ్రికాకు చెందిన గౌర్మట్‌ గర్బ్‌ అనే కంపెనీ ‘ఎంటోమిల్క్‌’ పేరిట బొద్దింకపాలను విక్రయిస్తోంది. ఈ బొద్దింకపాలలో కొవ్వులు, ప్రోటీన్లు, షుగర్‌, అమినోఆసిడ్స్‌ వంటివే కాకుండా ఇతర పోషకాలు ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
First published: February 17, 2019, 1:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading