Weight loss: బరువు తగ్గడంలో లవంగం టీ బాగా పనిచేస్తుందట.. ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా?

ప్రతీకాత్మక చిత్రం

మసాల దినుసులలో అతి ముఖ్యమైనది లవంగం (Clove).. అయితే ఇది కేవలం వంటల్లో నే కాకుండా.. బరువు తగ్గడంలోనూ (weight loss) సహాయ పడుతుంది. లవంగం టీ (Clove tea) రోజూ తాగడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయట. బరువు తగ్గడానికి చాలామంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతారు. అయితే ఇలా ఇంటిలో తయారుచేసుకున్న లవంగం టీ (Clove tea)తో ఈజీగా బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు.

  • Share this:
    సుగంధ ద్రవ్యాల (Spices)కు విలువ ఎక్కువగా ఉంటుంది. ఇవి రుచికరమైనవి (tasty) మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు (health benefits) కూడా ఉన్నాయి. ఈ సుగంధ ద్రవ్యాలు చాలావరకు రోజువారీ వంటలో ఉపయోగిస్తారు. అదనంగా.. వాటి ఔషధ గుణాల కారణంగా, ఆరోగ్య సమస్యలకు (health problems) చికిత్స చేయడానికి ఆయుర్వేద ఔషధంలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పూర్వకాలంలో సుగంధ ద్రవ్యాల కోసమే ఇతర దేశాల వాళ్ళు మన దేశానికి వచ్చి వర్తకం చేసుకునే వాళ్ళు. మనం వాడే సుగంధ ద్రవ్యాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

    లవంగం టీ..

    మనం రోజూ వాడే మసాల దినుసులలో అతి ముఖ్యమైనది లవంగం (Clove).. అయితే ఇది కేవలం వంటల్లో నే కాకుండా.. బరువు తగ్గడంలోనూ (weight loss) సహాయ పడుతుంది. లవంగం టీ (Clove tea) రోజూ తాగడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయట. బరువు తగ్గడానికి చాలామంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతారు. అయితే ఇలా ఇంటిలో తయారుచేసుకున్న లవంగం టీ (Clove tea)తో ఈజీగా బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు.

    కొవ్వును కరిగిస్తుంది.

    ఇక ఈ మసాలా టీ మీ జీర్ణక్రియ (digestive system)ను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. లవంగం టీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఉండే సమ్మేళనం మీ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. అలాగే జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా శరీరంలోని కొవ్వు (fat)ను బర్న్ చేస్తుంది.

    చర్మ సమస్యలకూ..

    అంతేకాకుండా చర్మ సమస్యల (skin problems)ను తగ్గిస్తుంది. ఇది ముడతలు, వయసు మచ్చలు కనిపించకుండా చేస్తుంది. ఈ టీ సైనస్ నుంచి ఉపశమనాన్ని కల్పిస్తుంది. యూజీనాల్ ఉండటం వల్ల ముక్కు సమస్యలను తగ్గిస్తుంది. లవంగాలలో విటమిన్ ఇ , విటమిన్ కె ఉంటాయి. ఇవి బాక్టీరియాతో పోరాడతాయి. జ్వరం (fever)ను కూడా తగ్గిస్తాయి. చిగుళ్లు, పంటి నోప్పిని తగ్గిస్తాయి.

    ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జీర్ణక్రియను పెంచడానికి ఇతర వ్యాధుల (diseases) నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయ పడతాయి. అయితే దీనితో టీ కూడా రెడీ చేసుకోవచ్చు. మరీ దానిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బాణాలిలో నీరు (water) పోసి మరిగించాలి. నీరు వేడి అయిన తర్వాత వాటిని దించి కాస్తా చల్లార్చి అందులో సుమారు 4-5 లవంగాలు, తురిమిన అల్లం, దాల్చిన చెక్కలను అందులో కలపాలి. వాటిని నీటిలో సుమారు 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంచాలి. ఆ తర్వాత ఒక కప్పులోకి వడకట్టి ఒక టీ స్పూన్ తేనే (honey), ఒక టీ స్పూన్ నిమ్మరసం (lemon juice) కలపాలి. అంతే లవంగం టీ (tea) రెడీ.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published: