మీ పసిబిడ్డల ఎదుగుదలకు కావలసినంత పోషకాహారాలు కలిగిన ఆహారాన్ని వారికి ఇవ్వడానికి కొత్త మార్గాలను కనుగొనడంలో అలసిపోయారా, పర్వాలేదు ఇప్పుడు మీరు ఏమాత్రం ఒంటరి కాదు. తల్లిదండ్రులు తమ బిడ్డల బుజ్జి కడుపులను తాజా మరియు పోషకమైన ఆహారంతో నింపడానికి ప్రతిరోజు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటారు. పిలల్లకు తరచుగా అల్పాహారం మరియు పోషకాలు లేని ఆహారాన్ని అందించడం ద్వారా వారు త్వరగా అలసిపోతారు. పిల్లలు ఇప్పుడిప్పుడే కొత్తకొత్త రుచులను తెలుసుకుంటుండడంతో, సహజంగానే వారికి నచ్చిన రుచి గల ఆహారాన్ని ఎంచుకుంటారు. ఈ అలవాటుతో మనకు తెలియకుండానే పిల్లలు కొంత అనారోగ్యానికి గురవుతారు. ఫలితంగా పిల్లలలో చిరాకు పెరగడం, ఆకలి లేకపోవడం, తలనొప్పి లేదా మైకము, కండరాలు మరియు ఎముకల బలహీనతకు లోనవడం, తరచూ కడుపులో ఇన్ఫెక్షన్లు రావడం, అంతేకాకుండా పిల్లలకు సరైన పోషకాహారం అందకపోవడంతో అనేక ఇతర సమస్యలు కూడా వస్తాయి.*
కానీ ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలకు అన్నింటిలో ఉత్తమమైనదాన్ని అందించాలని కోరుకుంటారు. దీనితో, తల్లిదండ్రులు తమ పిల్లలు ఇష్టపడే రీతిలో సరైన పోషణను అందించే మార్గాల కోసం నిరంతరంగా అన్వేషిస్తారు. పిల్లల శారీరక, మానసిక, భావోద్వేగ సామర్థ్యాలతో పాటు పిల్లల రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతున్న మొదటి సంవత్సరాల్లో సరైన పోషణ అందించడం చాలా ముఖ్యమైనది.
అన్స్ప్లాష్ లో Tong Nguyen van ఫోటో
మొదటి సంవత్సరాల్లో పోషణ ఎందుకు ముఖ్యమైనది?
మీ పిల్లలు వారి పసితనంతో పాటు 2-5 సంవత్సరాల ప్రీస్కూల్ వయస్సుతో తీసుకునే ఆహారం వారి భవిష్యత్తు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మెదడు, ఎముకలు, దంతాలు మరియు వారి మేధాశక్తి వంటి ముఖ్యమైన భాగాలు సక్రమంగా ఏర్పడడానికి తగిన ఆరోగ్యకరమైన పోషణ అందించే కీలకమైన దశ వారిది. ఈ దశలో ఐరన్, అయోడిన్, విటమిన్-ఎ వంటి ఇతర సూక్ష్మపోషకాలు చాలా అవసరం. పిల్లలు పోషకాలు అధికమైన ఆహారాన్ని వారి పసితనం నుండే తీసుకోవడం అనేది వారి ఎదుగుదలలో ఎటువంటి లోటులేకుండా ఉండేందుకుగల ముఖ్యమైన మార్గాలలో ఒకటి.
మంచి ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవడం వలన పిల్లలలో విటమిన్ ఎ, ఐరన్, జింక్, కాల్షియం మరియు విటమిన్ డి వంటి సాధారణ లోపాలను నివారించడానికి కాలసిన అన్ని సాధనాలను ఇస్తుంది. ఈ వయస్సులో మనం నేర్పించే ఆహారపు అలవాట్లు వారికి దీర్ఘకాలంలో ఆరోగ్యంగా మరియు చలాకిగా ఉండటానికి సహాయపడుతాయి. సూక్ష్మపోషకాల లోపాల ఫలితంగా లక్షలాది మంది పిల్లలలో మానసిక ఎదుగుదల నిలిచిపోవడం, బలహీనమైన రోగనిరోధక శక్తి మరియు శారీరక అభివృద్ధి లేకపోవడం వంటి సమస్యలు మనం గుర్తించవచ్చు.**
ప్రతి బిడ్డ పొందవలసిన అత్యవసర పోషకాలు ఏమిటి?
ప్రతి శిశువుకు విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వులు పుష్కలంగా ఉండే అత్యధిక పోషకాలుండే ఆహారం ఖచ్చితంగా అవసరం. బాల్యంలో ఈ ఐదు పోషకాలు పొందిన పిల్లలకు మెరుగైన మేధాశక్తి, మంచి ఆరోగ్యంతో పాటు జీవితంలో దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం నుండి బయటపడతారు.
తల్లిదండ్రులందరూ ఒక్కక్షణం ఆగి, మీ పిల్లలకి ఈ ఐదు పోషకాలు కావలసిన విధంగా అందుతున్నాయని మీరు ఖచ్చితంగా చెప్పగలరేమో ఆలోచించండి?
పనుల హడావుడిలో ఉండే అనేకమంది తల్లిదండ్రులకు ప్రతిరోజూ ఇవన్నీ క్రమం తప్పకుండా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ మీ పిల్లలు ఒక దగ్గర కూర్చోకుండా, సరైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడకపోతే ఆ భాద ఇంకా వర్ణణాతీతం.
అన్స్ప్లాష్ లో Tanaphong Toochinda ఫోటో
మీ పిల్ల లు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి నిరాకరించినప్పుడు ఏమి చేయాలి?
పిల్లలు తగినంత పోషకాలు ఉన్న ఆహారాన్ని తినడానికి నిరాకరించినప్పటికీ, వారికి సరైన పోషకాలను ప్రతిరోజు ఖచ్చితంగా అందించడం చాలా అవసరం.
దీన్ని అమలుచేయడానికి కొన్ని సులభమైన మార్గాలు:
ఇప్పుడు ఆరోగ్యకరమైన Nestlé's Ceregrow పిల్లల ఆహారంలో చేర్చడం ద్వారా పిల్లలలో ఆరోగ్యకరమైన పోషకాల సమతుల్యతను మెరుగుపరచవచ్చు. అదనపు రుచులతో నిల్వ ఉంచిన ఆహారం లేకుండా 2 నుండి 5 సంవత్సరాల పిల్లలకు రుచికరమైన అత్యుత్తమమైన అల్పాహారం ఇది. ఒక గిన్నెడు Ceregrow లో తగినన్ని ఐరన్, విటమిన్లు ఎ, సి & డి, కాల్షియం మరియు ప్రోటీన్ ఉన్నాయి. సిరి ధాన్యాలు, పాలు మరియు పండ్ల మిశ్రమంతో కూడిన ఈ ఆహారాన్ని ఇప్పుడు మీరు ఎక్కడైనా, ఎప్పుడైనా నిస్సంకోచంగా మీ పిల్లలకి అందించవచ్చు.
మీ గారాల పిల్లలకు రుచికరమైన తృణధాన్యాలతో తయరుచేసిన, అధికమొత్తంలో పోషకాలు కలిగిన అల్పాహారమైన Nestlé Ceregrow గురించి మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
* ఐసిఎంఆర్ 2010 ప్రకారం ఆర్డిఎ 4-6 సంవత్సరాల పిల్లలు
మూలాలు:
*https://www.ceregrow.in/child-nutrition/nutrient-deficiency-symptoms
** https://www.unicef.org/nutrition/index_iodine.html
ఇది భాగస్వామ్య పోస్ట్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.