ప్రేమ్ చంద్ రవివర్మకు ఫోన్ చేసి మర్రిపాలెం రావాలని పిలిచాడు. అప్పటికే కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపాడు. తాను పురుగుల మందు ఉన్న కూల్ డ్రింక్ తాగేశానని, నీ వంతే మిగిలిందని చెప్పాడు.
Valentine's Week 2020, Chocolate Day | వాలెంటైన్స్ వీక్ నడుస్తోంది. ఇందులో ఒక్కో రోజుకీ ఒక్కో ప్రత్యేకత. వాలెంటైన్స్ వీక్‌లో మూడో రోజున (ఫిబ్రవరి 9) చాక్లెట్ డే జరుపుకుంటారు. ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసుకుందామా..
ప్రేమ అంటేనే మధురానుభూతి. ఆ తియ్యదనాన్ని చాక్లెట్స్ మరింత రెట్టింపు చేస్తాయి. అందుకే వాలెంటైన్స్ వీక్‌లో మూడో రోజున (ఫిబ్రవరి 9న) చాక్లెట్ డే జరుపుకుంటారు. ఆ రోజున ప్రతీ ఒక్కరూ తమ పార్టనర్‌కి చాక్లెట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు. ఇందులో ముఖ్య విషయమేంటంటే.. ప్రతీ ఒక్కరికీ ఈ గిఫ్ట్ అందుబాటులోనే ఉండి ఆనందాన్ని పంచుతుంది. ఎవరైనా సరై..వీటిని ఈజీగా కొనేయొచ్చు.. తమ ప్రియుడు లేదా ప్రియురాలి నోటికి అందించొచ్చు. ప్రేమను వ్యక్తంచేసే తియ్యని సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్‌కి చాక్లెట్‌ను మించిన గిఫ్ట్ ఏమైనా ఉంటుందా? మీరు కూడా ఆ రోజున మీ హృదయాన్ని దోసుకున్న వారికి చాక్లెట్ గిఫ్ట్‌గా ఇవ్వడం మర్చిపోకండి.
చాక్లెట్స్ అంటే చాలామంది ఇష్టపడతారు. ఎంత ఒత్తిడిగా ఉన్నా సరే.. వీటిని తింటే ఒక్క ఐదునిమిషాల్లో అది దూరమవుతుంది. అలాంటి విశేషమున్న చాక్లెట్స్ తమ పార్టనర్స్‌కి అందించడంలో ఆలస్యమెందుకు..
ప్రతీకాత్మక చిత్రం
నేడు మార్కెట్లో ఎన్నో రకాల చాక్లెట్స్ వస్తున్నాయి. మీకు ఇంకాస్తా టైమ్ ఉంటే మీ చేత్తోని స్వయంగా చాక్లెట్స్ తయారు చేసి ఇవ్వొచ్చు. వాటి ద్వారా మీ ప్రేమను తెలియజేయొచ్చు.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.