హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Free Health Insurance: గుడ్ న్యూస్..18 ఏళ్ల లోపు వారికి ఉచిత ఆరోగ్య బీమా.. కేంద్రం ప్రకటన

Free Health Insurance: గుడ్ న్యూస్..18 ఏళ్ల లోపు వారికి ఉచిత ఆరోగ్య బీమా.. కేంద్రం ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY)సాధారణంగా ప్రతి కుటుంబానికి సుమారు రూ.5 లక్షల వరకు హాస్పిటల్ ఖర్చులకు బీమాను అందిస్తుంది. ఈ యోజనకు అర్హులైన కుటుంబాలను వారి ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆయుష్మాన్ భారత్.. దేశంలోని ప్రజలందరూ ఉచితంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను పొందేందుకు ప్రారంభించిన పథకం ఇది. ఈ పథకం కింద మరో కొత్త సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి.. పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకు ఉచిత బీమా అందించనున్నట్లు పార్లమెంటులో వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రీమియాన్ని పీఎం కేర్ చెల్లిస్తుందని ఆయన ప్రకటించారు.

ఈ విషయంపై అనురాగ్ ఠాకూర్ ఒక ట్వీట్ చేశారు. "కరోనా బారిన పడి కుటుంబాలను కోల్పోయిన చిన్నారులను రక్షించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. బాధితుల్లో పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వారందరికీ ఉచిత ఆరోగ్య బీమా సదుపాయన్ని ప్రభుత్వమే అందిస్తుంది. ఆయుష్మాన్ భారత్ యోజన కింద ప్రారంభిస్తున్న ఈ ఆరోగ్య బీమా ప్రమీయం మొత్తాన్ని పీఎం కేర్స్ చెల్లిస్తుంది" అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ పథకంలో భాగంగా తల్లిదండ్రులను కోల్పోయిన ప్రతి పిల్లవాడికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుంది. అంతే కాదు.. పద్దెనిమిది సంవత్సరాలు నిండే వరకు వారికి ప్రతినెలా స్టైఫండ్ అందిస్తారు. వారికి 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత పది లక్షల రూపాయల ఫండ్‌ను అందిస్తారు. దీనికి సంబంధించిన వివరాలను pmcaresforchildren.in ద్వారా పొందవచ్చు.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY)సాధారణంగా ప్రతి కుటుంబానికి సుమారు రూ.5 లక్షల వరకు హాస్పిటల్ ఖర్చులకు బీమాను అందిస్తుంది. ఈ యోజనకు అర్హులైన కుటుంబాలను వారి ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇందుకోసం 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం సుమారు 10.74 కోట్ల కుటుంబాలు (దాదాపు 50 కోట్ల మంది ప్రజలు) ఈ పథకానికి అర్హులుగా ఎంపికయ్యారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తోన్న సేవలను కూడా లెక్కిస్తే సుమారు 13. 17 కోట్ల కుటుంబాలు (65 కోట్ల ప్రజలు) లబ్ది పొందుతున్నారు. ఈ కుటుంబాలన్నీ రూ.5 లక్షల వరకు హాస్పిటలైజేషన్ ఖర్చుల ప్రయోజనాలు పొందే వీలుంటుంది.

ఈ పథకంలో క్యాష్ లెస్, పేపర్ లెస్ సేవలను పొందేందుకు వీలును కల్పించింది ప్రభుత్వం. ఇది వ్యక్తులు హాస్పిటల్‌లో చేరినప్పుడు వారి కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా కాపాడుతుంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లోనూ వ్యక్తుల ఆర్థిక పరిస్థితులు దిగజారకుండా ఈ పథకం ఉపయోగపడుతుంది. దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలు ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని ఖర్చు చేసి రోడ్డున పడుతున్నాయని.. అలాంటి పరిస్థితులను అరికట్టడమే పథకం లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ పథకానికి అర్హులుగా ఉండాలంటే ఆదాయం నెలకు రూ.10 వేల కంటే తక్కువగా ఉండాలనే నిబంధన ఉంది. దీంతో చాలా కుటుంబాలు వివిధ ప్రయోజనాలకు అర్హులు కాకుండా పోతున్నాయి.

ఇది కూడా చదవండి:

12 ఏళ్లకు ఓసారి మాత్రమే వికసించే నీలకురింజి పువ్వులు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Ayodhya: భక్తులకు అయోధ్య రామయ్య దర్శనం ఎప్పటి నుంచి అంటే..!

First published:

Tags: Health Insurance, Insurance

ఉత్తమ కథలు