• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • CHILDREN USING PHONES FROM AN EARLY AGE PERCEIVE THE WORLD DIFFERENTLY FINDS NEW STUDY BA GH

New Survey: మీ పిల్లలకి అర్జంట్‌గా ఫోన్ అలవాటు మార్పించండి.. లేకపోతే ఎంత డేంజరో తెలుసా?

New Survey: మీ పిల్లలకి అర్జంట్‌గా ఫోన్ అలవాటు మార్పించండి.. లేకపోతే ఎంత డేంజరో తెలుసా?

Photo Credit: SerrNovik/iStock/Thinkstock

ప్రీ-స్కూల్ వయసులో పిల్లలు మొబైల్ ఫోన్లకు అతుక్కు పోకుండా చూడమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా బాల్యంలో ఫోన్లలో అత్యధిక సమయం గడిపే పిల్లలపై జరిపిన ఓ అధ్యయనంలో ఇలాంటి షాకింగ్ విషయాలు మరోమారు తేటతెల్లమయ్యాయి.

  • Share this:
చిన్న వయసుకే కళ్లద్దాలు, ఒబేసిటీ, ఇంటర్నెట్ కు అడిక్ట్ అవ్వటం, గ్యాడ్జెట్స్ పిచ్చి.. ఇదంతా వీరు మరో ప్రపంచంలో ఉండేలా పిల్లల్ని తయారు చేస్తోంది. పిల్లలు పెద్దగా సోషలైజ్ కాకపోగా, భవిష్యత్తులో వీరిలో కొందరు గొప్ప మేధావులు అయినప్పటికీ సృజనాత్మకతలో వెనకుండి పోయేలా చేస్తుంది గ్యాడ్జెట్స్ ప్రపంచం. అందుకే ప్రీ-స్కూల్ వయసులో పిల్లలు మొబైల్ ఫోన్లకు అతుక్కు పోకుండా చూడమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా బాల్యంలో ఫోన్లలో అత్యధిక సమయం గడిపే పిల్లలపై జరిపిన ఓ అధ్యయనంలో ఇలాంటి షాకింగ్ విషయాలు మరోమారు తేటతెల్లమయ్యాయి. పిల్లలు ఎదిగేకొద్దీ వీరిలో క్రియేటివిటీ లోపించటం, కేవలం తమకు నచ్చిన విషయాలనే ఎంపిక చేసుకుని ఫోకస్ చేయటం చేస్తారు.

తమకు నచ్చని సబ్జెక్టులను వీరు ఏమాత్రం కేర్ చేయకపోగా డిజిటల్ ప్రపంచమనే సమాంతర ప్రపంచంలోనే వీరు అలా గడిపేయటాన్ని ఇష్టపడతారని చిన్న పిల్లలపై సాగిన అధ్యయనం హెచ్చరిస్తోంది. అందుకే మీ పిల్లలు ఎంతసేపు ఫోన్ లో గడుపుతున్నారు, గేమ్స్, వీడియోల్లో ఏది చూస్తున్నారు, వీరిని అమితంగా ఆకట్టుకుంటున్న సబ్జెక్ట్ ఏమిటి, వీరికి నచ్చుతున్న సరుకు ఎలాంటిది వంటి విషయాలపై పెద్దలు ఎప్పుడూ కన్నేసి ఉంచాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.

వీరికి చదువు చెప్పటమంటే..

ఇలా మొబైల్ వరల్డ్ లో విహరించే పిల్లలకు చదువు చెప్పటం అంటే అతిపెద్ద ఛాలెంజ్. వీరికి జనరల్ టీచింగ్ మెథడాలజీ అస్సలు సెట్ కాదు. ఇలాంటి చిన్నారులకు చదువు చెప్పేవారు ముందు అప్ గ్రేడ్ అవ్వాలి.. ఎందుకంటే వీరు ఏ విషయంపై శ్రద్ధ చూపి, ఫోకస్ పెట్టరు. వీరి దృష్టి ఎప్పుడూ ఏదోదానిపై ఉంటుంది కానీ మీరు చెబుతున్న విషయంపై అస్సలు ఉండదు. కాబట్టి వీరికి న్యూ ఎడ్యుకేషన్ మెటీరియల్ అవసరం అవుతుంది.

ప్రకృతిని అస్సలు ఆస్వాదించరు..

మొబైల్ కు బానిస కాని పిల్లలు చెట్లు, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, సముద్రాలు, నదులు అన్నీ ఎంతో ఉత్సాహంగా, లోతుగా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. అదే ఇంటర్నెట్ కు అడిక్ట్ అయిన పిల్లలైతే వీటిని అస్సలు ఇష్టపడరు, వీటి లోతుపాతులను అస్సలు చూడకపోగా ప్రకృతి అందాలను వీరు ఏమాత్రం ఎంజాయ్ చేయలేరు. పిల్లల బుర్ర ఇంకా పూర్తిగా వికసించని ముక్కపచ్చలారని బాల్యంలో మొబైల్ వారిని అనలిటికల్ స్కిల్స్ కు దూరంగా జరిగేలా దుష్ప్రభావం చూపుతుంది. మొబైల్ అంటే పంచప్రాణాలుగా భావించే చిన్నారులు ఈ సైడ్ ఎఫెక్ట్ నుంచి అస్సలు తప్పించుకోలేరు. అందుకే భవిష్యత్ తరాల్లో కేవలం సైంటిస్టులు, ఇంజినీర్లు వంటి ప్రొఫెషనల్స్ తప్ప మిగతా కళాకారులు అనేవారే ఉండరేమో అని మానసిక నిపుణులు అంచనా వేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

నాన్ డిజిటల్ గేమర్స్ గ్రేట్..

డిజిటల్ గేమ్స్ ఆడే పిల్లలకు వర్చువల్ వరల్డ్ తప్ప వేరేది ఏదీ వారికి అందంగా కనిపించదు, వారిని ఆకట్టుకోదు. మన ఎగ్జిబిషన్లలో ఉండే బెలూన్ షూటింగ్ వంటి గేమ్స్ ను ఒకసారి వారితో ఆడించండి, మొబైల్ కు అతుక్కుపోయే బాలబాలికలు ఏమాత్రం గురిచూసి బెలూన్లను షూట్ చేయలేరు. అదే సంప్రదాయ ఆటలు ఆడుకునే పిల్లలైతే నాన్ డిజిటల్ గేమ్స్ అయినా దాదాపు గురి పెట్టగలరు. ఇప్పుడు మీకు అర్థమైందా మీ బుజ్జాయి చేతుల్లోని మొబైల్ ఎలా కొంప ముంచుతోందో. అసలు పిల్లలు ప్రపంచాన్ని చూసే దృష్టికోణం సమూలంగా మారిపోతుందని, మొబైల్స్ కు వారిని ఎంత దూరం ఉంచితే అంత ఆరోగ్యానికి, మానసిక వికాసానికి అది సహకరిస్తుందని పిల్లల మానసిక నిపుణులు చెప్పే మాటలు సదా గుర్తుంచుకోండి.
Published by:Ashok Kumar Bonepalli
First published: