హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health: కరివేపాకుల్ని ఇలా తినండి... అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

Health: కరివేపాకుల్ని ఇలా తినండి... అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

Food : Curry Leaves | కరివేపాకును తేలిగ్గా తీసిపారేసే రోజులు పోయాయ్. దాని గొప్పదనం తెలిసి... చాలా మంది ఇప్పుడు కరివేపాకుల్ని బాగా వాడుతున్నారు. వాటిని ఎలా తింటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  Curry Leaves benefits: మన రోజువారీ దినచర్యల్లో చిన్నపాటి మార్పులు చేసుకుంటే... అవి ఒక్కోసారి అద్భుత ప్రయోజనాల్ని కలిగించగలవు. ఉదయాన్నే కొన్ని కరివేపాకుల్ని తింటే... ఎంతో ఆరోగ్యం. కరివేపాకులు మన వంటిళ్లలో ఎప్పుడూ ఉండేవే. కూరల్లో కరివేపాకులు వేస్తే... ప్రత్యేక రుచి, సువాసన వస్తాయి. కొంత మంది తినకుండా పక్కన పెట్టేసే ఈ కరివేపాకుల ప్రయోజనాలు తెలుసుకుంటే... ఇక వీటిని వదలం. ఇవి మన చర్మం, జుట్టు, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడగలవు. అందుకే కూరల్లో వేసుకోవడంతోపాటూ... కొన్ని కరివేపాకుల్ని ఉదయాన్నే ఖాళీ పొట్టతో తింటే మేలు. మొదట్లే కాస్త చేదుగా అనిపించినా... రాన్రానూ అలవాటైపోతుంది. ఇలా చెయ్యడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేసినట్లవుతుంది. ఎలాగో తెలుసుకుందాం.

  ఉదయాన్నే కరివేపాకుల్ని నమిలి తినడం వల్ల కలిగే ప్రయోజాలు :

  1. It can help you control hair fall : జుట్టు రాలిపోతున్న వారు ఇలా చెయ్యాలి. ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఓ గ్లాస్ మంచినీరు తాగాలి. కొన్ని నిమిషాల తర్వాత... ఓ నాలుగైదు కరివేపాకుల్ని నోట్లో వేసుకొని... కరకరా నమిలేయాలి. ఆ తర్వాత అరగంటపాటూ ఏమీ తినకుండా ఉండాలి. కరివేపాకుల్లో విటమిన్ C, ఫాస్పరస్, ఐరన్ (ఇనుము), కాల్షియం, నికోటినిక్ యాసిడ్ ఉంటాయి. కూరల్లో కూడా కరివేపాకుల్ని ఎక్కువగా వాడితే... జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

  2. Promotes digestive health : కరివేపాకుల్ని తింటే... పొట్టలో జీర్ణక్రియ మెరుగవుతుంది. ఖాళీ పొట్టతో ఉన్నప్పుడు వాటిని నమలడం వల్ల... అవి జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్స్‌ని క్రమబద్ధం చేస్తాయి. మూత్రనాళం బాగా పనిచేసేలా చేస్తాయి. మలబద్ధకం సమస్య తీరుతుంది.

  3. Treats morning sickness and nausea : కొంత మందికి ఉదయం లేవగానే బద్ధకంగా, వికారంగా ఉంటుంది. ఆ సమస్య కరివేపాకులతో తీరిపోతుంది. జీర్ణక్రియావ్యవస్థ సక్రమంగా పనిచేస్తుండటంతో... వికారం, వాంతులు అయ్యే పరిస్థితి నుంచీ బయటపడవచ్చు.

  4. Weight loss : బరువు తగ్గాలంటే కరివేపాకుల్ని తినాలి. ఇవి శరీరంలో చెడు వ్యర్థాల్ని బయటకు తరిమేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ చాప చుట్టుకొని వెళ్లిపోతుంది. ఫలితంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ సక్రమంగా అవుతాయి.

  ఇది కూడా చదవండి: Horoscope Today: జనవరి 30 రాశి ఫలాలు... ఈ రాశుల వారికి మంచి సమయం

  5. Improve Eye Sight : కరివేపాకులకూ కంటిచూపుకీ సంబంధం ఉంటుంది. ఎంత ఎక్కువగా కరివేపాకుల్ని తింటే... కంటి చూపు అంత ఎక్కువగా మెరుగవుతుంది. ముఖ్యంగా స్కూల్‌కి వెళ్లే పిల్లల క్యారేజీ కూరల్లో తప్పనిసరిగా కరివేపాకు ఉండేలా చూసుకోండి.

  First published:

  Tags: Health, Health benefits, Health Tips, HOME REMEDIES, Tips For Women

  ఉత్తమ కథలు