Uses Of Clay: బంకమట్టితో చర్మ సమస్యలు దూరం... మట్టితో మేని మెరవాలంటే..

బంకమట్టితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని చర్మ సంరక్షణలోనూ వాడొచ్చు. పూర్వకాలంలో బంకమన్నును పూసుకునేవారు. ఇప్పటికీ.. పలు దేశాలలో ‘mud bath’ (మట్టి స్నానం) భాగా ఫేమస్.

news18
Updated: November 27, 2020, 5:54 PM IST
Uses Of Clay: బంకమట్టితో చర్మ సమస్యలు దూరం... మట్టితో మేని మెరవాలంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 27, 2020, 5:54 PM IST
  • Share this:
ప్రకృతి మనకు అందించిన వాటిలో బంకమట్టి ఒకటి. బంకమట్టికి ఆయుర్వేద లక్షణాలు చాలా ఉన్నాయి. కొన్ని శతాబ్దాలుగా దీన్ని ఔషధాల తయారీలో, అనారోగ్యాలకు చికిత్స చేసేందుకు, సౌందర్య ఉత్పత్తిగా వాడుతున్నారు. సహజంగా లభించే ఈ పదార్ధం కేవలం బురద వంటిది కాదు. అగ్నిపర్వతాల నుంచి వెలువడే బూడిద, కుళ్లిన మొక్కల అవశేషాలు వంటివన్నీ మట్టిలో చేరి ఒక ముడి పదార్థంగా మారి బంకమట్టి తయారవుతుంది. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, సిలికా వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. బంకమట్టికి చర్మ రంధ్రాల్లో పేరుకుపోయే మలినాలను బయటకు తీసే సామర్థ్యం ఉంటుంది. దీన్ని మొటిమలకు చికిత్స చేయడంలో వాడతారు.

దీంతో పాటు స్కిన్ అలర్జీలు, సన్ బర్న్స్‌ను నయం చేయగలదు. చర్మం ఉత్పత్తి చేసే నూనెలను బ్యాలెన్స్ చేస్తుంది. చర్మం సాగే గుణాన్ని బంకమట్టి వృద్ధి చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. సౌందర్య ఉత్పత్తిగా వాడే బంకమట్టిలో చాలా రకాలు ఉన్నాయి. ఇవి చర్మానికి వివిధ ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి పొడుల రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.

1. Fuller’s Earth
దీన్ని ముల్తానీ మిట్టి (వాడుక భాషలో ముల్తాన్ మట్టి) అని కూడా పిలుస్తారు. దీనికి చర్మం ఉత్పత్తి చేసే నూనెలను పీల్చుకునే శక్తి ఉంటుంది. ముల్తానీ మిట్టిలో రోజ్ వాటర్‌ కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇది చర్మం ఉత్పత్తి చేసే నూనెలను అదుపులో ఉంచుతుంది. చర్మ రంధ్రాల్లో పేరుకుపోయే వ్యర్థాలకు బయటకు పంపుతుంది. హైపర్‌పిగ్మెంటేషన్‌ (నల్ల మచ్చలు లేదా నల్లబొంగు) కు సమస్యగా ముల్తానీమిట్టి పేస్టును వాడవచ్చు. ఇది బ్లీచింగ్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. చర్మతత్వాన్ని బట్టి దీన్ని వాడాలి. దీనివల్ల కొంతమందికి చర్మం పొడిబారవచ్చు. అందువల్ల ముల్తానీ మిట్టిని మితంగా, వారానికి ఒకసారే వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.

2. Bentonite Clay
బెంటోనైట్ క్లేను నీటిలో కలిపినప్పుడు బాగా ఉబ్బుతుంది. బెంటోనైట్ దాని ద్రవ్యరాశి కంటే ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను, పదార్థాన్ని గ్రహిస్తుంది. వాపును తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చర్మంపై పేరుకుపోయే మలినాలను ఇది సమర్థంగా బయటకు తీస్తుంది. వయసుతో పాటు వచ్చే ముడతలను నివారిస్తూ, చర్మం బిగుతుగా, ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది.

ఇది కూడా చదవండి Long Hair: మీ జుట్టు పొడవుగా, దృఢంగా మారాలా..? అయితే ఈ వంటింటి చిట్కాలు మీ కోసమే...

3. Kaolin Clay
ఇది తెలుపు, గులాబీ, ఎరుపు, పసుపు వంటి వివిధ రంగుల్లో లభిస్తుంది. సున్నితమైన చర్మం ఉండేవారు వైట్ కయోలిన్ బంకమట్టిని వాడవచ్చు. మలినాలను బయటకు తీసే విషయంలో ఎరుపు రంగు కయోలిన్ క్లే శక్తిమంతంగా పనిచేస్తుంది. రెడ్, వైట్ కలర్ క్లే పౌడర్‌లను కలిపితే పింక్ కలర్ కయోలిన్ క్లే వస్తుంది. పసుపు రంగు క్లేతో వేసుకునే ఫేస్ ప్యాక్ ముఖ చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుంది.

4. Rhassoul Clay
ఇది మొరాకోలోని భూమి పొరల్లో లభిస్తుంది. ఈ పురాతన బంకమట్టి చర్మం, జుట్టు రెండింటికీ మేలు చేస్తుంది. ఇది సెబమ్, బ్లాక్ హెడ్స్, ఇతర మలినాలను బయటకు తీసి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మం సాగే గుణాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు దీన్ని వాడతారు. రసౌల్ క్లే వెంట్రుకలు మెరిసేలా చేస్తుంది. దీనివల్ల జుట్టుకు షైనింగ్ వస్తుంది.

ఇది కూడా చదవండి Beauty Tips: పప్పు ధాన్యాలతో మేని మెరవాలంటే ఇలా చేయండి...


5. French Green Clay
దీన్ని ఇలైట్ క్లే లేదా సీ క్లే (sea clay) అని కూడా పిలుస్తారు. కుళ్లిన మొక్కల పదార్థం నుంచి ఈ బంకమట్టి ఉత్పత్తి అవుతుంది. ఐరన్ ఆక్సైడ్ ఉండటం వల్ల ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. బంకమట్టి నాణ్యతను ఐరన్ ఆక్సైడ్ ద్వారా నిర్ణయిస్తారు. ఈ బంకమట్టి చర్మ మలినాలను గ్రహించడానికి ఉపయోగపడుతుంది. ఇది చర్మం ఉపరితలం వైపు రక్త ప్రసరణ పెంచేందుకు తోడ్పడుతుంది. తద్వారా చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Published by: Srinivas Munigala
First published: November 27, 2020, 5:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading