హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Glowing Skin: ఈ నాలుగు రకాల జ్యూస్‌లతో చర్మ సమస్యలకు చెక్.. ఇలా తయారు చేసుకోండి !

Glowing Skin: ఈ నాలుగు రకాల జ్యూస్‌లతో చర్మ సమస్యలకు చెక్.. ఇలా తయారు చేసుకోండి !

 ఈ నాలుగు రకాల జ్యూస్ లతో .. చర్మ సమస్యలకు చెక్.. అవేవో తయారుచేసుకోండి !

ఈ నాలుగు రకాల జ్యూస్ లతో .. చర్మ సమస్యలకు చెక్.. అవేవో తయారుచేసుకోండి !

పండ్లు(Friuts), కూరగాయలు రెండింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. వీటితో జ్యూస్‌లు చేసుకోవడం కూడా సులువే. చర్మ(Skin) సౌందర్యం కోసం డైట్‌లో చేర్చుకోవాల్సిన జ్యూస్‌లు ఏవో పరిశీలిద్దాం.  

ఇంకా చదవండి ...

నలుగురి దృష్టిని ఆకర్షించాలంటే అభినయంతో పాటు అందంగా ఉండాల్సిందే. మోము నిగారింపు కోసం చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్‌(Market)లో ప్రస్తుతం ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలోని రసాయనాల కారణంగా ఇతర సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీంతో ప్రకృతి(Nature) సిద్ధంగా లభించే వాటిని చర్మ సౌందర్యం కోసం వాడటం మంచింది. అయితే చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు ఉపశమనం పొందడానికి కూరగాయలు, పండ్ల రసాలను ఉత్తమ పరిష్కార మార్గంగా పరిగణిస్తున్నారు. పండ్లు, కూరగాయలు(Vegetables) రెండింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. వీటితో జ్యూస్‌లు చేసుకోవడం కూడా సులువే. చర్మ సౌందర్యం కోసం డైట్‌లో చేర్చుకోవాల్సిన జ్యూస్‌లు ఏవో పరిశీలిద్దాం.

దోసకాయ జ్యూస్

ఇది మీ చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. దోసకాయ చర్మానికి కావాల్సిన గ్లో ఇస్తుంది. ఇందులో ఉండే ఆస్కార్బిక్ ఆమ్లం, కెఫిక్ ఆమ్లం ముఖంలోని నీరు నిలుపుదలను అరికడుతుంది. ఫలితంగా ముఖం ఉబ్బినట్లు కనిపించదు. దోసకాయ జ్యూస్‌ను వేసవిలో తరచూ తీసుకోవాలి. దీంతో శరీరం డీహైడ్రేట్ కాదు.

దోసకాయలో విటమిన్ కె, సిలికా పుష్కలంగా ఉంటాయి. మిమ్మల్ని ఫిట్‌గా ఉంచడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యం ఉంచడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. దోసకాయ జ్యూస్ కళ్ళకు కూడా చాలా ఉపయోగకరం. ఇది కళ్లకు చల్లదనాన్ని ఇస్తుంది. దోసకాయ రసంలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ.. రెటీనాలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా కంటి చూపును మెరుగుపరుస్తుంది.

పాలకూర జ్యూస్

పాలకూరలో విటమిన్ కె, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో దీన్ని జ్యూస్ రూపంలో తీసుకుంటే చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. అయితే తాగడానికి ఈ జ్యూస్ అంత రుచికరంగా ఉండదు. అయినప్పటికీ హానికరమైన వైరస్‌లను ఎదుర్కోవడంలో పాలకూర కీలక పాత్ర పోషిస్తుంది.

క్యారెట్(Carrot) అండ్ బీట్‌రూట్ జ్యూస్

ప్రతిరోజూ క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ తాగే అలవాటు ఉంటే.. ముఖంపై మొటిమలు తగ్గిపోతాయి. చర్మం గరుకుతనం పోయి, మృదువుగా తయారవుతుంది. పిగ్మెంటేషన్‌ను నివారిస్తుంది. క్యారెట్‌‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ళ ఆరోగ్యానికి మేలు చేయడం మాత్రమే కాకుండా చర్మం మీద ఏర్పడ్డ మొటిమలు, ఇతర చర్మ ఇన్ఫెక్షన్స్‌ను నివారించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇందులో విటమిన్- సి మోతాదు ఎక్కువే. ఇది శరీరంలో ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా వ్యవహరిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

ఇదీ చదవండి: WhatsApp: వారెవ్వా వాట్సాప్.. రోజుకో కొత్త ఫీచర్లు.. ఇక ఎవరికి తెలియకుండా లెఫ్ట్ అయ్యే ఫీచర్.. ఎలాగో లుక్కేయండి !ముఖంపై ఉన్న మొటిమలను నివారించడంలో ఎలాంటి కాస్మోటిక్స్ ఉపయోగించకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే స్వచ్చమైన క్లియర్ స్కిన్‌‌ను క్యారెట్ జ్యూస్ అందిస్తుంది. చర్మం(Skin)పై మొటిమలు ఏర్పడటానికి క్యాల్షియం లోపం కూడా ఒక కారణం. అయితే క్యారెట్‌లో క్యాల్షియం పుష్కలంగా పొందవచ్చు. తద్వారా మొటిమలను నివారించవచ్చు.

అల్లం - నిమ్మరసం

ఈ కాంబినేషన్ రుచిని ప్రతి భారతీయుడు ఇష్టపడతాడు. ఇందులో పొటాషియం, నియాసిన్ పుష్కలంగా ఉంటాయి. శరీరం ముఖ్యమైన ఖనిజాలను నిలుపుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ -సి ఇందులో పుష్కలంగా ఉంటుంది. తద్వారా చర్మం నిగారింపుగా మారుతుంది.

Published by:Mahesh
First published:

Tags: Health care, Health food, Skin care, Vegetables

ఉత్తమ కథలు