హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Tongue Color : మీ నాలుక రంగు మారిందా..ఆ రంగులోకి మారితే గుండె జబ్బుకు సంకేతం!

Tongue Color : మీ నాలుక రంగు మారిందా..ఆ రంగులోకి మారితే గుండె జబ్బుకు సంకేతం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tongue Color : మీ నాలుక మీ ఆరోగ్య రహస్యాన్ని చెబుతుంది. ప్రతి ఒక్కరి నాలుక యొక్క ఆకృతి, రంగు భిన్నంగా ఉంటుంది, కానీ నాలుక రంగులో అకస్మాత్తుగా మార్పు వస్తే, అది ఏదో ఒక వ్యాధికి సంకేతం.

  Tongue Color : మీ నాలుక మీ ఆరోగ్య రహస్యాన్ని చెబుతుంది. ప్రతి ఒక్కరి నాలుక(Tongue) యొక్క ఆకృతి, రంగు భిన్నంగా ఉంటుంది, కానీ నాలుక రంగులో అకస్మాత్తుగా మార్పు వస్తే, అది ఏదో ఒక వ్యాధికి సంకేతం. అయితే, ఆహారం,మెడిసిన్స్ కారణంగా కొన్నిసార్లు నాలుక రంగు మారుతుంది. మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు, మీ నాలుక రంగును చూసి వైద్యులు కూడా వ్యాధిని అంచనా వేయవచ్చు. రక్తం, నోటి అంటువ్యాధులు కాకుండా, మీ నాలుక రంగు కూడా మీకు గుండె జబ్బు ఉందని సూచిస్తుంది, ఇది గుర్తించడం ముఖ్యం. ఏ రంగు గుండె జబ్బులకు(Heart Related Diseases) సంకేతాన్ని ఇస్తుందో తెలుసుకుందాం.

  ఆరోగ్యకరమైన నాలుక రంగు ఎలా ఉండాలి

  మెడికల్ న్యూస్ టుడే ప్రకారం...సాధారణంగా ఆరోగ్యకరమైన శరీరం కోసం నాలుక రంగు గులాబీ రంగులో ఉండి, దానిపై సన్నని తెల్లని పొర ఉండాలి. వ్యక్తి యొక్క శరీరం ప్రకారం నాలుక యొక్క రంగు కూడా లేత గులాబీ లేదా ముదురు గులాబీ రంగులో ఉంటుంది. ఆరోగ్యకరమైన నాలుక పైన,అన్ని వైపులా అనేక పాపిల్లలను కలిగి ఉంటుంది. పాపిల్లే చిన్న, మెరిసే గడ్డలు. ఇవి నాలుక ఎగువ భాగాన్ని మందంగా చేస్తాయి.

  Dubai Trip : దుబాయ్ ట్రిప్ కి వెళ్లాలనుకుంటున్నారా..ఇలా చేస్తే రెండు గంటల్లోనే వీసా

  నీలం,ఊదా రంగులు

  గుండెకు సంబంధించిన సమస్య లేదా వ్యాధి ఉన్నట్లయితే, మీ నాలుక రంగు నీలం లేదా ఊదా రంగులోకి మారుతుంది. గుండె శరీరంలో రక్తాన్ని సరిగ్గా పంప్ చేయనప్పుడు నాలుక రంగు నీలం లేదా ఊదా రంగులోకి మారుతుంది. కొన్నిసార్లు రక్తంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల నాలుక రంగు నీలం రంగులోకి మారుతుంది. అటువంటి పరిస్థితి తీవ్రంగా మారితే అప్పుడు నాలుక యొక్క రక్త నాళాల వాపు ప్రమాదం కూడా పెరుగుతుంది.

  గుండె జబ్బు యొక్క ఇతర సంకేతాలు

  - రక్త ప్రసరణ అసమతుల్యత

  - అధిక బ్లడ్ షుగర్

  - అధిక కొలెస్ట్రాల్

  - ఛాతి నొప్పి

  - గొంతు లేదా దవడలో నొప్పి

  - అధిక చెమట

  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Heart, Life Style

  ఉత్తమ కథలు